ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని! | Yadadri: Man receives electricity bill of Rs 6 lakh, owner shocks | Sakshi
Sakshi News home page

ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని!

Published Wed, Jun 12 2024 10:29 AM | Last Updated on Wed, Jun 12 2024 10:51 AM

Yadadri: Man receives electricity bill of Rs 6 lakh, owner shocks

సాక్షి, యాదాద్రి జిల్లా: ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్‌లు ఉన్నప్పుడు, సాధారణంగా  కరెంట్ బిల్లు ఎంత వ‌స్తుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుంచి 500 మించి రాదు. మ‌హా అయితే వెయ్యి రూపాయ‌లు వ‌స్తుందేమో. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.  మండుటెండ‌లో  ఇంటి కరెంట్‌ బిల్లు చూసిన యజమానికి చెమటలు పట్టడమే కాకుండా.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.

జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన డీ పరశురాములు ఇంటికి విద్యుత్తు బిల్లు రీడింగ్‌ తీసేందుకు సోమవారం ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్‌ నంబర్‌.. సోమవారం మీటర్‌ రీడింగ్‌ను స్కాన్‌ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.

రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్‌కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్‌ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్‌ వచ్చినట్టయితే రీడింగ్‌ జంప్‌ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్‌ను టెస్టింగ్‌ కోసం పంపినట్టు ఆయ‌న పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement