'ఝుమ్మంది నాదం'తో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన 'తాప్సీ' ఆ తరువాత షాడో, వీర వంటి సినిమాలతో తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె గణేష్ చతుర్థి సందర్భంగా ఒక ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నటి తాప్సీ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'జిఎల్ఎస్ 600'. దీని ధర రూ. 3 కోట్లు కంటే ఎక్కువే. దీనిని కంపెనీ ఆదివారం ఆమె ముంబై నివాసంలో డెలివరీ చేసింది. పల్లాడియం సిల్వర్ కలర్ ఆప్షన్ కలిగిన ఈ కారు తన గ్యారేజిలో చేరిన రెండవ బెంజ్ కారు.
తాప్సీ గ్యారేజిలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ కంపాస్, బీఎండబ్ల్యూ 3-సిరీస్, ఆడి ఏ8ఎల్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జిఎల్ఎస్ 600 చేరింది. ఈ కొత్త కారు చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600 విషయానికి వస్తే.. 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజన్ కలిగి 550 హెచ్‌పి పవర్ అండ్ 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఇది EQ బూస్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున అదనపు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి!
జిఎల్ఎస్ 600 పెద్ద 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే & 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే కలిగి కారుకి సంబంధించిన అన్ని వివరాలు డ్రైవర్‌కి అందిస్తుంది. అంతే కాకుండా నప్పా లెదర్ అపోల్స్ట్రే, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్ కలిగిన రియర్ సీట్లు మొదలైన ఆధునిక ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.
ఇదీ చదవండి: గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్ చంద్ర
ఇప్పటికే ఈ ఖరీదైన లగ్జరీ కారుని ఆయుష్మాన్ ఖురానా, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, కృతి సనన్, అజయ్ దేవగన్, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ కూడా కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారుపై సెలబ్రిటీలకు ఎంత మక్కువ ఉందో ఇట్టే అర్థమైపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment