రూ.75 వేల కోట్ల వ్యాపారమే లక్ష్యం
రూ.75 వేల కోట్ల వ్యాపారమే లక్ష్యం
Published Mon, Nov 7 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
ఆంధ్రాబ్యాంకు సర్కిల్ జీఎం రంగనాథ్
రాయవరం : ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల కోట్ల వ్యాపారం చేయడం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆంధ్రాబ్యాంకు సర్కిల్(ఏపీ) జనరల్ మేనేజర్ కె.రంగనా«థ్ తెలిపారు. రాయవరం ఆంధ్రాబ్యాంకును సందర్శించిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆంధ్రాబ్యాంకు విశాఖ సర్కిల్ పరిధిలో(13 జిల్లాలు) 750 బ్రాంచిల పరిధిలో రూ.64వేల కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన వ్యాపారంలో రూ.36వేల కోట్లు డిపాజిట్లు సేకరించగా, రూ.28వేల కోట్లు రుణాలుగా ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వ్యాపార లక్ష్యాని అధిగమించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నెలంతా ఫౌండేషన్ డే ఉత్సవాలు..
ఈ నెల 23న ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిరామయ్య, 28న ఆంధ్రాబ్యాంకు 94వ వార్షికోత్సవం కావడంతో ఈ నెలంతా ఫౌండేషన్ డే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జీఎం రంగనాధ్ తెలిపారు. ఫౌండేషన్ డే పురస్కరించుకునిసర్కిల్ పరిధిలో సుమారు 15 బ్రాంచిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జోన్ పరిధిలో మురముండ, జొన్నాడలో ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీజీఎం పి.భాస్కరరావు, బ్యాంకు ఏజీఎం డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement