![IREDA has set a revenue target of Rs 4350 crore in the current financial year - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/22/IREDA-new-target.jpg.webp?itok=bg1M1eB6)
న్యూఢిల్లీ: భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,350 కోట్ల ఆదాయన్ని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. అలాగే, 2025 మార్చి నాటికి రూ.5,220 కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర నూతన, పునరుత్పాదక శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ)తో ఇందుకు సంబంధించి పనితీరు ఆధారిత అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
ఈ ఎంవోయూ ప్రకారం నిర్ధేశించిన మేర ఆదాయ లక్ష్యాలను ఐఆర్‌ఈడీఏ చేరుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ ఆన్ నెట్‌వర్త్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్, రుణాల్లో ఎన్‌పీఏ రేషియో, అస్సెట్ టర్నోవర్ రేషియో తదితర పనితీరు ఆధారిత లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.3,482 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్టు ఐఆర్‌ఈడీఏ ప్రకటించింది.
‘‘జూన్ త్రైమాసికంలో రుణాల పంపిణీలో 272 శాతం వృద్ధి నమోదు చేశాం. పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి నమోదైంది’’అని ఐఆర్‌ఈడీఏ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. నికర నిర్ధరక రుణాలు (ఎన్‌పీఏలు) 2.92 శాతం నుంచి 1.61 శాతానికి తగ్గినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment