వివిధ బ్యాంకులు పలు చార్జీల నిమిత్తం ఐదేళ్ల కాలంలో కస్టమర్ల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేశాయో తెలిసింది. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌లు లేకపోవడంపై పెనార్టీలు, అదనపు ఏటీఎం లావాదేవీలు, ఎస్‌ఎంఎస్ సేవలపై ఛార్జీల రూపంలో 2018 నుంచి బ్యాంకులు రూ.35,000 కోట్లకు పైగా వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.
గత ఐదేళ్లలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సేకరించిన గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ తాజాగా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
మినిమమ్ బ్యాలెన్స్‌పైనే మ్యాగ్జిమమ్
బ్యాంకులు ఐదేళ్లలో చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.35,000 కోట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడంపై విధించే చార్జీల రూపంలో అత్యధికంగా రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల చార్జీలు రూ.8,289.3 కోట్లు, ఎస్‌ఎంఎస్ సేవల కోసం రూ.6,254.3 కోట్లు వసూలు చేసినట్లు కరాద్ పేర్కొన్నారు.
2015 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, కస్టమర్లు తమ సేవింగ్స్ ఖాతాలలో కనీస బ్యాంక్ బ్యాలెన్స్‌ని నిర్వహించనప్పుడు సహేతుకమైన జరిమానా ఛార్జీలను నిర్ణయించడానికి బ్యాంకులకు అనుమతి ఉంది.
ఇదీ చదవండి: కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు! ఈ లెక్క ఏంటో తెలుసుకోండి..
అన్ని రకాల లావాదేవీల కోసం బ్యాంకులు ఆన్‌లైన్ అలర్ట్‌ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే, సహేతుకతను నిర్ధారించడానికి, అటువంటి ఛార్జీలు వాస్తవ ప్రాతిపదికన విధించేలా చూసుకోవాలని బ్యాంకులకు సూచించింది.
ఇక ఏటీఎం లావాదేవీలకు సంబంధించి 2022 నవంబర్ నాటి ఆర్బీఐ నూతన ఏటీఎం మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు సేవింగ్స్-బ్యాంక్ ఖాతాదారులకు లొకేషన్‌తో సంబంధం లేకుండా నెలలో కనీసం ఐదు ఉచిత ఆర్థిక లావాదేవీలను అందించాలి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే ఒక నెలలో మెట్రో నగరాల్లో మూడు, నాన్-మెట్రో ప్రాంతాలలో ఐదు ఉచిత ట్రాక్సాక్షన్‌లు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment