bank charges
-
బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా?
వివిధ బ్యాంకులు పలు చార్జీల నిమిత్తం ఐదేళ్ల కాలంలో కస్టమర్ల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేశాయో తెలిసింది. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌లు లేకపోవడంపై పెనార్టీలు, అదనపు ఏటీఎం లావాదేవీలు, ఎస్ఎంఎస్ సేవలపై ఛార్జీల రూపంలో 2018 నుంచి బ్యాంకులు రూ.35,000 కోట్లకు పైగా వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. గత ఐదేళ్లలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సేకరించిన గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ తాజాగా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. మినిమమ్ బ్యాలెన్స్‌పైనే మ్యాగ్జిమమ్ బ్యాంకులు ఐదేళ్లలో చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.35,000 కోట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడంపై విధించే చార్జీల రూపంలో అత్యధికంగా రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల చార్జీలు రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల కోసం రూ.6,254.3 కోట్లు వసూలు చేసినట్లు కరాద్ పేర్కొన్నారు. 2015 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, కస్టమర్లు తమ సేవింగ్స్ ఖాతాలలో కనీస బ్యాంక్ బ్యాలెన్స్‌ని నిర్వహించనప్పుడు సహేతుకమైన జరిమానా ఛార్జీలను నిర్ణయించడానికి బ్యాంకులకు అనుమతి ఉంది. ఇదీ చదవండి: కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు! ఈ లెక్క ఏంటో తెలుసుకోండి.. అన్ని రకాల లావాదేవీల కోసం బ్యాంకులు ఆన్లైన్ అలర్ట్‌ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే, సహేతుకతను నిర్ధారించడానికి, అటువంటి ఛార్జీలు వాస్తవ ప్రాతిపదికన విధించేలా చూసుకోవాలని బ్యాంకులకు సూచించింది. ఇక ఏటీఎం లావాదేవీలకు సంబంధించి 2022 నవంబర్ నాటి ఆర్బీఐ నూతన ఏటీఎం మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు సేవింగ్స్-బ్యాంక్ ఖాతాదారులకు లొకేషన్‌తో సంబంధం లేకుండా నెలలో కనీసం ఐదు ఉచిత ఆర్థిక లావాదేవీలను అందించాలి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే ఒక నెలలో మెట్రో నగరాల్లో మూడు, నాన్-మెట్రో ప్రాంతాలలో ఐదు ఉచిత ట్రాక్సాక్షన్లు ఉంటాయి. -
ఈ బ్యాంకింగ్ సేవలు ఫ్రీ కాదండోయ్.. లిమిట్ దాటితే బాదుడే!
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రతీ ఒకరికి ఉంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇటీవల కాలంలో బ్యాంక్ సంస్థలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తమ సేవలను అందిస్తున్నాయి. అయితే నగదు లావాదేవీల ఎస్ఎంఎస్(SMS), ఐఎంపీఎస్(IMPS) ఫండ్ బదిలీ, చెక్ క్లియరెన్స్ , ఏటీఎం విత్డ్రాల్ ఇలా ఏ సౌకర్యం పూర్తిగా ఉచితం కాదు. అన్ని సేవలకు, బ్యాంక్ నిబంధనల అనుసరించి తమ కస్టమర్ల నుంచి కొంత ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది తెలియక మన జేబులో పైసలు చార్జీల రూపంలో బ్యాంక్‌లకు కడుతున్నాం. ఓసారి ఆ సేవల గురించి తెలసుకుందాం. నగదు లావాదేవీ బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు నగదు లావాదేవీలు చేయడం సహజం. అయితే ఈ లావాదేవీని నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు. మీరు నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే, దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ ప్రతి బ్యాంకుకు దాని నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులో 20 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్‌ను నిర్దిష్ట పరిమితి వరకు నిర్వహించాలి. మీ ఖాతాలో అంత కంటే తక్కువ మొత్తం ఉన్నట్లయితే, కనీస బ్యాలెన్స్ లేని కారణంగా ఛార్జ్ చెల్లించాలి. అన్ని బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్, దానిని నిర్వహించనందుకు ఛార్జీల పరిమితి భిన్నంగా ఉంటాయి. ఐఎంపీఎస్ ఛార్జీలు అన్ని బ్యాంకులు నెఫ్ట్( NEFT), ఆర్టీజీఎస్( RTGS) లావాదేవీలను కస్టమర్లకు ఉచితంగా అందిస్తాయి. అయితే చాలా బ్యాంకులు ఇప్పటికీ ఐఎంపీఎస్( IMPS ) లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీ రూ.1 నుంచి రూ.25 వరకు ఉంటుంది. లక్ష వరకు ఓకే మీ చెక్కు రూ. 1 లక్ష వరకు ఉంటే, మీరు బ్యాంకుకు ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే క్లియరెన్స్ ఛార్జీని చెల్లించాలి. మరోవైపు, చెక్కుల విషయంలోనూ పరిమితి సంఖ్య వరకు ఉచితంగా ఇస్తారు. అంతకు మించి చెక్కుల కావాలంటే వాటికోసం మీరు ధర చెల్లించాలి. ఏటీఎం లావాదేవీ ఏటీఎం (ATM) నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది. పేర్కొన్న సంఖ్య కంటే ఎక్కువ లావాదేవీల జరిపితే అప్పటి నుంచి చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాంకు వసూలు చేసే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఇందుకు చాలా బ్యాంకులు రూ.20-50 వరకు వసూలు చేస్తున్నాయి. ఎస్ఎంఎస్ కూడా ఫ్రీ కాదండోయ్ మీ ఖాతాలో డబ్బు క్రెడిట్ అయినప్పుడు లేదా డెబిట్ అయినప్పుడు బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్ పంపుతుంది. దీనికి బ్యాంకులు కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు ఎందుకంటే ఈ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులకు ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. డెబిట్ కార్డు పోతే.. పైసలే మీరు మీ డెబిట్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, మీరు మరొక కార్డును పొందడానికి ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీ రూ. 50 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో ఛార్జీలను నిర్దేశించింది. చదవండి: టైం వచ్చింది వెళ్దాం.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా -
సాయం అంతలోనే మాయం!
పెద్దపల్లి, మంథని: రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1500 సాయంలో బ్యాంకర్లు చార్జీల పేరిట కోత విధిస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు అరకొర మాత్రమే చేతికందుతున్నాయి. ఆధార్ అనుసంధానం, జీరో బ్యాలెన్స్ ఖాతాల్లోనే ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ సాయం జమఅయింది. అయితే ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయని కారణంగా ప్రభుత్వం సాయం నుంచి ఒక్కొక్కరికి రూ.118 నుంచి రూ.1300 వరకు కోత విధించారు. బియ్యంతోపాటు నేరుగా రూ.1500 లబ్ధిదారు చేతికే డబ్బు అందిస్తే బ్యాంకు చార్జీల మోత ఉండేది కాదని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. కాగా తాము కావాలని కోత విధించడం లేదని బ్యాంకు సాప్ట్వేర్ ఆధారంగా ఆటోమెటిక్‌గా ఖాతాలో డబ్బు జమకాగానే పెనాల్టీ చార్జీలు కట్ అవుతాయని ఓ బ్యాంకు మేనేజర్ తెలిపారు.(ఆగిన పోస్టల్ నగదు పంపిణీ) రెండు వందలే చేతికొచ్చాయి ప్రభుత్వం సాయం రూ. 1500 ఖాతాలో జమ అయ్యాయని సమాచారం రాగానే బ్యాంకుకు వెళ్లా. డబ్బు తీసుకునేందుకు విత్‌డ్రా రాసి ఇస్తే కేవలం ఖాతాలో రెండు వందలే ఉన్నాయని బ్యాంకు అధికారి చెప్పారు. ఇదేంటని అడిగితే చార్జీల కింద కట్ అయిందని చెప్పారు. వచ్చే నెల సాయం పూర్తిగా తీసుకోవచ్చన్నారు. బియ్యంతోపాటే రూ.1500 చేతికిస్తే మా లాంటి పేదవారికి ఎంతో ఉపయోగపడేవి.–తాటి స్రవంతి, గంగాపురి, మంథని -
సేవింగ్స్ ఖాతాలు రెండు చాలు!!
మనలో చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలుండటం ఇపుడు సహజమైపోయింది. అయితే, ఇలా ఎక్కువ ఖాతాలుండటం లాభదాయకమేనా? ఇది ప్రతి ఒక్కరూ ఓ సారి ఆలోచించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి ఖాతాలో కనీస నగదు నిల్వలుచడం తప్పనిసరి. దీనికి తోడు ఏటీఎం, డెబిట్‌కార్డు వార్షిక చార్జీలు, ఎస్ఎంఎస్ అలర్ట్స్ చార్జీల రూపంలో రకరకాల ఛార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. కనుక ఒకటికి మించి ఖాతాలుండే వారు ఓసారి పునః పరిశీలన చేసుకోవాలనేది నిపుణుల సూచన. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి తమ సంస్థ తరఫున వేతన ఖాతాలుంటాయి. అయితే, ఒకే సంస్థలో శాశ్వతంగా ఉద్యోగం చేసే వారు తక్కువ మందే. ఎక్కువ మంది తరచూ సంస్థలు మారుతుంటారు. దీంతో వీరికి ఆయా సంస్థల తరఫున వేతన ఖాతాల సంఖ్య పెరిగిపోతుంటుంది. ఇక ఉద్యోగ జీవితానికి ముందే తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రారంభించిన ఖాతాలు సైతం ఉండొచ్చు. కనుక నిజంగా వీటిల్లో ఎన్నింటి అవసరం ఉందన్న దానిపై ఒక్కసారి దృష్టి సారించాల్సి ఉంది. జీరో బ్యాలన్స్ ఆఫర్ కనిపించిందనో, మరేదో కారణంతోనో సేవింగ్స్ ఖాతా ప్రారంభించే ముందు ఎంత ఉపయోగం ఉందో ఓ సారి గుర్తించండి. ఒక్కో అవసరానికి ఒక్కో బ్యాంకు ఖాతాను కేటాయించుకోవడం వల్ల సులభంగా ఉంటుందేమో కానీ, ఖాతాల సంఖ్య పెరిగితే గందరగోళానికీ కారణమవుతుంది. నిజానికి గరిష్టంగా ఒక్కొక్కరికి మూడు ఖాతాలకు మించి అవసరం లేదన్నది నిపుణుల సూచన. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం... వేతనం కోసం ఒకటి, ఖర్చుల కోసం మరొకటి, పెట్టుబడుల కోసం మరో ఖాతా ఉంటే సరిపోతుంది. వేతనంతో పాటు డివిడెండ్ సైతం ఒకే ఖాతాలో ఉండాలనేది వారి సూచన. ఇంటి అవసరాల కోసం చేసే అన్ని ఖర్చులకూ ఒక ఖాతాను ఉపయోగించుకోవాలి. బిల్లుల చెల్లింపులు, గ్రోసరీ కొనుగోళ్లు, ఔషధ కొనుగోళ్లు అన్నీ ఈ ఖాతా నుంచే చేయాలి. ఇక పూర్తిగా పెట్టుబడులు, పొదుపు నిధుల కోసం మూడో ఖాతాను ఉపయోగించుకోవాలి. క్రమశిక్షణకు కట్టుబడే వారు అయితే రెండు బ్యాంకు ఖాతాలు సరిపోతాయన్నది నిపుణుల సూచన. ఒకటి ఆదాయం, పెట్టుబడుల కోసం, రెండో ఖాతా ఖర్చుల కోసం. ఖాతాలు ఎక్కువైతే... సేవింగ్స్ ఖాతాలు ఉచితంగా ఏమీ రావు. ప్రతీ ఖాతాకు సంబంధించి కొన్ని చార్జీలుంటాయి. ప్రతీ ఖాతాలోనూ నెలవారీ కనీస సగటు బ్యాలన్స్ నిర్వహించాలి. లేదంటే పెనాల్జీ చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. అలాగే ఖాతాలతోపాటు వచ్చే డెబిట్ కార్డుకు వార్షిక నిర్వహణ చార్జీలు, నెలవారీ ఉంచాల్సిన కనీస బ్యాలన్స్‌పై రాబడులు తక్కువేనని పైసాబజార్ డాట్ కామ పేమెంట్ ప్రొడక్ట్స్ హెడ్ సహిల్ అరోరా పేర్కొన్నారు. ‘‘ఎక్కువ ఖాతాలు మీరు కలిగి ఉంటే, కనీస బ్యాలన్స్ రూపంలో ఎక్కువ మొత్తాన్ని ఉంచాల్సి వస్తుంది. కనీస బ్యాలన్స్ రూ.5,000–10,000 వరకు ఉన్నాయి. ఐదు ఖాతాలు ఉంటే కనీసం రూ.25,000. ఇవి 3–4 శాతం రాబడులనే ఇస్తాయి. ఇలా ఎక్కువ ఖాతాల్లో ఉంచే బ్యాలన్స్‌ను అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్ చీఫ్ డెవలప్మెంట్ అధికారి నవీన్ చందాని తెలిపారు. జాయింట్ ఖాతా మంచిదే... ఉమ్మడిగా మరొకరితో కలసి ఖాతా తెరిచే వారూ ఉన్నారు. ‘‘అందరికీ ఆర్థిక విషయాల పట్ల అవగాహన ఉండి, ఉమ్మడి లక్ష్యాలతో ఉంటే జాయింట్ అకౌంట్ మంచి నిర్ణయం అవుతుంది. ఇద్దరూ కలిసి లేదా ఎవరో ఒకరు ఆపరేట్ చేసే ఆప్షన్ ఎంచుకోవడం మంచిది’’ అని సృజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకులు దీపాలిసేన్ తెలిపారు. ముఖ్యంగా జీవిత భాగస్వాములు ఉమ్మడి ఖాతాను నిర్వహించడం వల్ల ఎన్నో సౌలభ్యాలు ఉంటాయి. అలాగే ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏర్పడే సంఘాల సభ్యుల మధ్య ఆర్థిక పారదర్శకతకూ ఉమ్మడి అకౌంట్ దోహదపడుతుంది. నామినీ తప్పనిసరి... ఇక 10–15 ఏళ్ల క్రితం ఖాతాలు తెరిచి మరిచిపోయే వారూ ఉంటారు. అందులో కొంత నగదు ఉండి మర్చిపోతే దాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే ఏటా వివిధ చార్జీలను బ్యాంకులు ఆ బ్యాలన్స్ నుంచి మినహాయించుకుంటూ ఉంటాయి. ఇక ఖాతాదారుడు మరణిస్తే వారి పేరిట ఐదారు ఖాతాలుంటే, అన్నింటికీ నామినీ రిజిస్టర్ చేసి లేకపోతే కుటుంబ సభ్యులకు ఎన్నో సమస్యలు కలిగించిన వారవుతారు. అందుకని అవసరానికి మించి ఉండే ఖాతాలు మూసేయడంతోపాటు ముఖ్యమైన ఖాతాలకు నామినీగా జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరును రిజిస్టర్ చేయించుకోవడం మర్చిపోవద్దు. -
ఆసరా పెన్షన్లలో రూ.50 కోత!
‘కనీస’చార్జీల పేరుతో కత్తిరించనున్న బ్యాంకులు సాక్షి, హైదరాబాద్: బ్యాంకు చార్జీల భారం నిరుపేదల పెన్షన్లకు సైతం ఎసరు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్ల కు వచ్చే నెల నుంచి రూ.50 కోత పడుతోంది. చార్జీలు వసూలు చేస్తామని, పెన్షన్‌లో రూ.50 తగ్గిస్తామని బ్యాంకర్లు లబ్ధిదారులకు ఇప్పటి నుంచే సమాచారం అందిస్తున్నారు. దీంతో ఆగస్టు నెల పెన్షన్లకు కోత తప్పదని లబ్ధిదారు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తం గా 35.30 లక్షల మంది పెన్షన్‌దారులున్నారు. వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, పేద వృద్ధ కళాకారులు, హెచ్ఐవీ బాధితులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున ఆసరా పెన్షన్ పంపిణీ చేస్తోంది. వికలాంగులకు రూ.1,500 పెన్షన్ అందిస్తోంది. ఆపన్నులు, ఆసరా లేని వారికి భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి నెల మొదటి వారంలో ఈ డబ్బులు చెల్లిస్తోంది. ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో.. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నిబంధనల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లోని సేవింగ్ ఖాతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాలో రూ.వెయ్యి కనీస బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే రూ.31 నుంచి రూ.37 వరకు చార్జీలు వసూలు చేస్తారు. ప్రస్తుతం ఆసరా పెన్షన్ ఖాతాలన్నీ సేవింగ్స్ ఖాతాలుగానే ఉన్నాయి. వీటిలో కొందరు రూ.500తో ఖాతాలు తెరవగా.. మరికొందరు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచారు. నోట్ల రద్దు అనంతరం మారిన నిబంధనలతో సేవింగ్స్ ఖాతాల్లోనూ కనీస మొత్తం నిల్వ ఉండాలని, లేకుంటే చార్జీలు విధించాలని బ్యాంకులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్బీఐ నుంచి వరుసగా చార్జీలకు సంబంధించిన సర్క్యులర్లు కూడా జారీ అయ్యాయి. ఏ బ్యాంకులు ఎంత చార్జీలు విధిస్తాయనే గందరగోళం కూడా ఇంకా కొనసాగుతోంది. దీంతో కనీస బ్యాలెన్స్ పేరిట చార్జీలు వడ్డిస్తే ఆసరా పెన్షన్లకు కోత పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే తక్కువ మొత్తం ఉండే నిరుపేదల ఆసరా పెన్షన్ల ఖాతాలకు కూడా చార్జీలు వసూలు చేస్తారా.. లేదా అనే విషయంలో బ్యాంకు అధికారులకూ స్పష్టత లేదు. మీకు రూ.950 వస్తుంది.. మరోవైపు కొన్ని బ్యాంకులు ‘వచ్చే నెల నుంచి మీ పెన్షన్‌లో రూ.50 చార్జీ కింద కట్ అవుతుంది. మీకు రూ.950 వస్తుంది..’ అని ఇప్పటి నుంచే లబ్ధిదారులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఆసరా పెన్షన్ల పంపిణీ బాధ్యతలు నిర్వహించే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మాత్రం పెన్షన్ ఖాతాలకు చార్జీలు వసూలు చేసే విషయం తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. చార్జీలపై తమకు సమాచారం అందించాలని ఇప్పటికే పలు జిల్లాల్లో డీఆర్డీఏ అధికారులు బ్యాంకర్ల వివరణ కోరినట్లు తెలిసింది. ఇక వచ్చే కాస్తోకూస్తో ఆర్థిక సాయంలో కత్తెర వేయటం సరికాదని కొందరు లబ్ధిదారులు బ్యాంకర్ల తీరుపై మండిపడుతున్నారు. ఎందుకు చార్జీలు వసూలు చేస్తారనేది తెలియక గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ మొత్తం ఉండే ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తారా, లేదా అనేది ఈనెల గడిస్తేనే తెలుస్తుంది. -
బాబోయ్.. బ్యాంకులు
ఓ వ్యక్తి రోడ్డుపై వెళుతూ వెళుతూ యథాలాపంగా పక్కనే ఉన్న బ్యాంకు వైపు చూశాడు. అంతే.. ‘మీ బ్యాంకు ఖాతాలో రూ.25 కోత విధించడమైనది..’ అంటూ అతని మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది. మరో వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి బయటకు వస్తూ ఏటీఎం కార్డుతో మెడ మీద గోక్కున్నాడు. అంతే.. ‘మీరు మీ ఏటీఎం కార్డును ఐదుకన్నా ఎక్కువ సార్లు గీకారు. అందుకు రూ.25 సర్వీసు చార్జీ..’ అంటూ మెసేజ్ వచ్చింది. ఇవన్నీ నిజం కాదు. బ్యాంకులు ఖాతాదారుల నుంచి నానా రకాలుగా వసూలు చేస్తున్న చార్జీలపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జోకులు. సాక్షి, అమరావతి: బ్యాంకులు అడ్డగోలుగా విధిస్తున్న చార్జీలు ఖాతాదారులకు చిర్రెత్తిస్తున్న మాట మాత్రం నిజం. ప్రస్తుతం బ్యాంకు అన్నా, బ్యాంకు లావాదేవీ అన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. డబ్బులు డిపాజిట్ చేసినా చార్జీ, విత్ డ్రా చేసినా చార్జీ. ఏటీఎం కార్డు ఎక్కువసార్లు వాడినా చార్జీ. ఇలా.. ప్రతి లావాదేవీకి బ్యాంకులు చార్జీల మోత మోగిస్తున్నాయి. బాదుడే బాదుడు బ్యాంకులు అవలంభిస్తున్న విధానాలతో పాత పద్ధతిలో ఇంటిలోనే డబ్బు దాచుకోవడం మంచిదన్న ఆలోచనలోకి ప్రజలు వస్తున్నారు. తాను సంపాదించిన మొత్తాన్ని ఏ రోజుకు ఆరోజు బ్యాంకులో జమ చేసేవాడినని, కానీ బ్యాంకు చార్జీల మోత మొదలు పెట్టినప్పటి నుంచి ఇంటిలోనే దాచుకోవడం మొదలు పెట్టానని విజయవాడకు చెందిన సెలూన్‌షాపు యజమాని రఘు చెపుతున్నాడంటే ప్రజల్లో బ్యాంకులపై ఎంత విరక్తి పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద బ్యాంకయిన ఎస్బీఐ చార్జీల మోత షురూ చేయగా మిగిలిన బ్యాంకుల అదే దారిలో పయనించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక నుంచి ఎస్బీఐలో నెలలో మూడుసార్లు మించి బ్యాంకుకు వెళ్లి నగదు డిపాజిట్ వేస్తే సర్వీస్ ట్యాక్స్‌తో కలిసి రూ.50 వరకు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకు సొంత ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు మించి, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడు సార్లకు మించి నగదు తీసుకుంటే రూ.10 నుంచి రూ.20 వరకు చార్జీల విధిస్తున్నాయి. అలాగే బ్యాంకు నిబంధనల మేరకు ఖాతాలో కనీస నిల్వ ఉంచకపోయినా..రోజుల లెక్కన రూ.200 ఆపై సర్‌చార్జీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇక నిర్దిష్ట కాలం తర్వాత బ్యాంకుల నుంచి వచ్చే ఎస్సెమ్మెస్‌లకు కూడా చార్జీలు వసూలు చేస్తారు. చార్జీలే..సేవలేవీ..? ఇన్ని చార్జీలు విధిస్తున్నా సేవలైనా సరిగా అందిస్తున్నాయా అంటే అదీ లేదు. ఏప్రిల్ నెల వచ్చి అప్పుడే అయిదు రోజులు గడుస్తున్నా ఉద్యోగులు జీతాలు తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఏటీఎంలు పనిచేయవు. అలాగని బ్యాంకుకి వెళితే ‘నగదు లేదు తర్వాత రండి’ అన్న సమాధానాలే చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఇంటి అద్దెలు, ఫీజులు, ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితులను రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంటలు అమ్మిన డబ్బు బ్యాంకుల్లో వేస్తుకుని తీసుకోవాలనుకుంటే తల ప్రాణం తోకకు వస్తోం దని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ పనే..! పెద్ద నోట్ల రద్దు తర్వాత పెరిగిన డిజిటల్ లావాదేవీలు జనవరి రెండవ వారం నుంచి తగ్గు ముఖం పట్టడంతో, నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ఆర్బీఐ నగదు కొరతను సృష్టిస్తు న్నట్లు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మార్చి నెల మొదలైనప్పటి నుంచి నగదు సరఫరా తగ్గిపోయిందని, అడిగినంత నగదును ఆర్బీఐ ఇవ్వడం లేదని ఈ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్న బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బ్యాంకులో డబ్బులున్నా.. పింఛను డబ్బులు తీసుకోవడం కోసం రెండు రోజులుగా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నాను. పెద్దనోట్ల రద్దు సమయంలో ఇబ్బందులు పడ్డాం. ఆ రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఏటీఎంలలో ఎక్కడా డబ్బులుండటం లేదు. చిల్లర ఖర్చులకు డబ్బులు లేక తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులో డబ్బులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. – పి. విశ్వేశ్వరరావు, రిటైర్డు ఉద్యోగి, కాకినాడ. ఎక్కడ చూసినా నోటీఎంలే... ఎక్కడా చూసినా ఏటీఎంలు కనిపిస్తున్నా వాటిల్లో నగదు మాత్రం ఉండటం లేదని కాకినాడకు చెందిన ఎల్.శ్రీనివాస్ తెలిపారు. ఇంటి అద్దె చెల్లించడం కోసం మంగళవారం మొత్తం ఏడు ఏటీఎంలు తిరిగినా ఒక్కటి కూడా పనిచేయలేదన్నారు. ఏటీఎం ఎక్కువసార్లు వాడితే చార్జీలు వేయడం కాదని, ఏటీఎంలో నగదు ఉంచనందుకు బ్యాంకులపై ఫైన్ విధించాలంటున్నారంటే బ్యాంకులతో ప్రజలెంతగా విసిగిపోతున్నారో అర్థమవుతుంది. 8,036 రాష్ట్రంలో మొత్తం ఏటీఎంలు రాష్ట్రంలో గత ఇరవై రోజుల నుంచి 80 శాతానికి పైగా ఏటీఎంలు పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 7,007 బ్యాంకు శాఖలు ఉండగా 8,036 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 449 ఏటీఎంలున్నాయి. అడిగినంత ఇవ్వకపోవటంతో.. ఏప్రిల్ 1 తేదీకి తక్షణం రూ. 3,000 కోట్లు అవసరమవుతాయని, లేకపోతే రాష్ట్రంలో నగదు కొరత తీవ్రమవుతుందని ఆర్బీఐకి చెప్పినా ఇంతవరకు నగదు పంపలేదని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. -
బ్యాంకులు హ్యాండ్సప్
-
బ్యాంకులు హ్యాండ్సప్
నగదు కొరతతో పరేషాన్ ⇒ ఏటీఎంలలో నో క్యాష్.. బ్యాంకుల్లో లో క్యాష్ బోర్డులు ⇒ సోషల్ మీడియాలో బ్యాంకు చార్జీలపై మండిపాటు..‘నో ట్రాన్సాక్షన్ డే’పేరిట ప్రచారం సాక్షి, హైదరాబాద్: నో క్యాష్.. ప్రస్తుతం ఏటీఎంలలోనే కాదు.. బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది! పెద్దనోట్ల రద్దు కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో నగదు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రోజువారీ డిపాజిట్లు తగ్గడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. దీనికితోడు నెలరోజులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నుంచి రాష్ట్రానికి నగదు రాకపోవడంతో నోట్ల కష్టాలు తారాస్థాయికి చేరాయి. పక్షం రోజులుగా ఏటీఎం మెషీన్లు మూతపడగా.. బ్యాంకుల్లో ఖాతాదారులకు పరిమితంగా నగదును ఇస్తున్నారు. ఈ నెల 13 నుంచి నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ... నగదు నిల్వలు హరించుకుపోవడంతో క్యాష్ కోసం వచ్చే ఖాతాదారులకు బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయి. రూ.20 వేల కోట్ల పెద్ద నోట్లు జనం వద్దే బ్యాంకు గడప దాటిన రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకులో డిపాజిట్ కావడం లేదు. దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన రెండు వేల నోట్లు ప్రజల వద్దే ఉండిపోయినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో నోట్ల చలామణి భారీగా తగ్గింది. మార్కెట్లో లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకుల్లో డిపాజిట్ కాకపోవడంతో నగదు సమస్య తీవ్రమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో ‘లో క్యాష్’బోర్డులు కనిపిస్తున్నాయి. గత నెలరోజులుగా రాష్ట్రానికి కొత్త నోట్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అడపాదడపా పంపిణీ చేస్తున్నా డిమాండ్‌కు తగినట్లు లేకపోవడంతో బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడుతోంది. రూ.35 వేల కోట్ల నగదు లోటు తెలంగాణకు సంబంధించి దాదాపు రూ.80 వేల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. వీటిలో ఆర్బీఐ ఇప్పటివరకు కేవలం రూ.45 వేల కోట్లే రాష్ట్రానికి పంపిణీ చేసింది. దీంతో దాదాపు రూ.35 వేల కోట్ల నగదు కొరత ఉత్పన్నమైంది. వివిధ బ్యాంకులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 8,642 ఏటీఎం మెషీన్లు ఉన్నాయి. ఇందులో 977 మెషీన్లు ఇప్పటికీ పూర్తిగా పనిచేయడం లేదని అధికారులే అంగీకరిస్తున్నారు. మిగతా వాటిలోనూ 90 శాతంపైగా ఏటీఎంలలో డబ్బు లేదు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఏటీఎంలు పని చేయడం లేదు. నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. కానీ ఈ నెల మొదటి వారం నుంచే ఏటీఎంలన్నీ డబ్బు లేకుండా ఖాళీ అయ్యాయి. రాష్ట్రంలో తీవ్రమైన నగదు సమస్యను బ్యాంకులు ఇప్పటికే ఆర్బీఐకి నివేదించాయి. దీంతో ఈనెలాఖరు నాటికి రూ.4 వేల కోట్లు ఇస్తామని ఆర్బీఐ రాష్ట్రానికి భరోసా ఇచ్చింది. మూడ్రోజుల్లో అత్యవసరంగా రూ.1,100 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ డబ్బు వచ్చేంత వరకు ఏటీఎంలలో నగదు కష్టాలు తప్పవని బ్యాంకర్లు చెబుతున్నారు. ‘నో ట్రాన్సాక్షన్ డే’వైరల్.. నగదు డిపాజిట్లపై బ్యాంకులు సరికొత్త ఆంక్షలకు తెరలేపాయి. నెలలో ఖాతాదారుడి లావాదేవీలు మూడింటికి మించితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశాయి. అలాగే ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్‌ను లేకున్నా చార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పాయి. ఏప్రిల్ నెల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించాయి. ఈ అదనపు చార్జీల భారాన్ని ఎందుకు భరించాలనే ఉద్దేశంతో ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ మినహా మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగదు విత్‌డ్రాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అటు చార్జీలపై సోషల్ మీడియాలో బ్యాంకుల వైఖరిపై నిరసనలు తీవ్రమవుతున్నాయి. బ్యాంకుల అడ్డగోలు చార్జీల వసూళ్లను నిరసిస్తూ... ఖాతాలోని నగదు మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని, ‘నో ట్రాన్సాక్షన్ డే’జరపాలన్న అంశాలు వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
డబ్బులు వేస్తే బాదుడు.. తీస్తే బాదుడేనా ?
సామాన్యుడి ఆగ్రహం సర్వీస్ ఛార్జీల విధింపుపై బ్యాంకులపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. స్వచ్ఛదంగా సోషల్ మీడియా వేదికగా బ్యాంకులపై వ్యక్తమవుతున్న ఆగ్రహానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇటీవల పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు బ్యాంకింగ్ సేవలపై విధించిన సర్వీసు ఛార్జీలపై ఖాతాదారులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలపై సోషల్ మీడియాలో రెండు వాదనలు చక్కర్లు కొడుతున్నాయి డబ్బులు వేస్తే బాదుడు.. తీస్తే బాదుడు. బ్యాలెన్స్ లేకపోయినా బాదుడే. బ్యాంక్ అంటే చాలు వణికిపోయే రోజులు వచ్చాయని నెటిజన్లు మండిపడుతున్నారు. అత్యవసరం సమయాల్లో కూడా తమ డబ్బులు తాము తీసుకున్నా సరే తప్పని ఛార్జీల బాదుడుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే నినాదం అందుకున్నారు. ఏప్రిల్ 6న దేశంలో ఎవరూ బ్యాంకులకు వెళ్లొద్దు. లావాదేవీలు జరపొద్దు అని పిలుపునిస్తున్నారు. ఆన్ లైన్, మొబైల్, పేటీఎం ఇలా అన్ని లావాదేవీలు జరపొద్దని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆర్బీఐ కొత్త రూల్స్, బ్యాంకుల బాదుడుపై ఖాతాదారులు దండయాత్రకు రెడీ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా జరుగుతున్న ప్రచారానికి.. కొన్ని జాతీయ ఇంగ్లీష్ పత్రికలు కూడా ప్రముఖంగా చోటివ్వటం విశేషం. అలాగే ఏప్రిల్ 6వ తేదీ నో ట్రాన్సాక్షన్ డేకు ఆర్బీఐ, బ్యాంకులు దిగిరాకపోతే.. మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 24, 25, 26 మూడు తేదీలను నో ట్రాన్సాక్షన్ డేలుగా జరపాలని పిలుపునిస్తున్నారు. ఇదిలావుంటే దీనికి సంబంధించి మరో వాదన కూడాతెరపైకి వచ్చింది. ఈ నెలాఖరున అంటే 31 తేదీల్లో అణా పైసలుతో సహా అకౌంట్లలోని నగదును విత్ డ్రా చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. తద్వారా ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ బ్యాలెన్సులు ఒక్కసారిగా డౌన్ అయి బ్యాంకులు ఇబ్బందులు తప్పవని వాదిస్తున్నారు. కస్టమర్ల చేతిలో పదునైన ఆయుధం ఇదే అని చెబుతున్నారు. అందరితో జీరో బాలన్స్ తో అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ల ఇష్టమైనట్లు రూల్స్ పెడితే మనం చూస్తూ ఊరుకోవద్దు. వెంటనే మీ అకౌంటులో ఉన్న మొత్తం బ్యాలెన్స్ అంతా మార్చ్ 31న విత్‌డ్రా చెయ్యండంటున్నారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క పౌరుడికి, బ్యాంక్ ఖాతాదారుడికి చేరేలా వెళ్లాలన్న రిక్వెస్ట్‌లు కూడా సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతున్నాయి. ఈ ఉద్యమానికి కేంద్రం స్పందన ఎలా ఉంటుంది.. బ్యాంకులు ఎలా స్పందిస్తాయో అనేది వేచిచూడాల్సిందే. -
ఏ బ్యాంకు.. ఎన్ని ఛార్జీలు
న్యూఢిల్లీ : బ్యాంకు దిగ్గజాలుగా పేరున్న ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు కస్టమర్లపై ఛార్జీలు బాదుడుకు సిద్ధమయ్యాయి. నిర్దేశించిన మొత్తం కంటే నగదు లావాదేవీలు జరిపితే, ఇక యూజర్లు తప్పసరిగా ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. నగదు లావాదేవీల తగ్గింపుకు కస్టమర్లకు ఈ వడ్డింపు వేస్తున్నట్టు బ్యాంకులు పేర్కొంటున్నాయి. బ్యాంకులు భారీగా విధించే సమీక్షించిన ఛార్జీల వివరాలెంటో మీరే ఓ సారి చూడండి.... స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా: 1. ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు నెలకు మూడు సార్లు మాత్రమే ఉచిత ఛార్జీతో నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే, ప్రతి లావాదేవీకి రూ.50కు మించి సర్వీసు ట్యాక్స్ చెల్లించాలి. 2. రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే ప్రతీ రూ.1,000పై 75పైసల చార్జీ+సర్వీసు ట్యాక్స్ విధింపు ఉంటుంది. 3. ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలన్స్ లేని ఖాతాలపై జరిమానా విధింపు. నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్స్ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీ తోపాటు సర్వీసు ట్యాక్స్ విధిస్తారు. కనిష్టంగా రూ.20+సర్వీసు ట్యాక్స్ ను బ్యాంకు నిర్ణయించింది. 4. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కనీస నగదు నిల్వ రూ.5000కు 75 శాతానికి పైగా తగ్గితే రూ.100 ప్లస్ సర్వీసు ట్యాక్స్ ఉంటుంది. ఒకవేళ 50 శాతం తగ్గితే, రూ.50 ప్లస్ సర్వీసు ట్యాక్స్ విధిస్తారు. 5. ఇతర బ్యాంకు ఏటీఎంలలో విత్ డ్రా లిమిట్ మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు చేస్తే రూ.20 ఛార్జీ వేస్తుంది. ఎస్బీఐ ఏటీఎంలలోనే ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు డ్రా చేస్తే రూ.10 ఛార్జీని బ్యాంకు విధించనుంది. 6. రూ.25వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండే సొంత ఏటీఎంలలో అయితే ఎలాంటి విత్ డ్రా ఛార్జీలుండవు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో డ్రా చేసుకునేందుకు ఛార్జీల మోత నుంచి తప్పించుకోవాలంటే బ్యాంకు బ్యాలెన్స్ రూ.లక్షకు మించి ఉండాలి. 7.ఓ త్రైమాసిక కాలంలో కనీస నగదు నిల్వలు రూ.25 వేలలోపు నిర్వహించే ఖాతాదారులకు వారి డెబిట్ కార్డు లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు గాను బ్యాంకు రూ.15 చార్జీలు వసూలు చేస్తుంది. పీఐ/యూఎస్ఎస్డీ లావాదేవీల విలువ రూ.1,000 వరకు ఉంటే ఆ సేవలు ఉచితం. యాక్సిస్ బ్యాంకు : 1. యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెల ఉచితంగా ఐదు లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆ ఐదు లావాదేవీల్లోనే డిపాజిట్లు, విత్ డ్రాలు ఉంటాయి. అంతకుమించితే ప్రతి లావాదేవీకి రూ.95 కనీస ఛార్జీ ఉంటుంది. 2. గరిష్టంగా రూ.50వేలు డిపాజిట్ చేసే కస్టమర్లకు ఐదు నాన్-హోమ్ బ్రాంచు లావాదేవీలు ఉచితం. అదే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లకు లేదా ఆరో లావాదేవీకు ప్రతి రూ.1000కు రూ.2.50 ఛార్జీ లేదా ప్రతి లావాదేవీకి రూ.95 ఛార్జీ ఏది ఎక్కువైతే అది విధిస్తారు. హెచ్డీఎఫ్సీ : 1. ప్రతినెలా నాలుగు ఉచిత లావాదేవీలు(డిపాజిట్లు, విత్ డ్రాలు కలిపి) చేసుకున్న అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతి లావాదేవీకి రూ.150 లెవీ వేస్తుంది. 2. ఈ కొత్త ఛార్జీలు సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు వర్తిస్తాయి. 3. హోమ్-బ్రాంచు లావాదేవీలకు, ఒక్కరోజు ఒకేసారి రూ.2 లక్షల వరకు ఉచితంగా డిపాజిట్ లేదా విత్ డ్రా చేసుకునే అవకాశముంటుంది. అంతకు మించితే ఇక ప్రతి రూ.1000కు రూ.5 లేదా రూ.150 చెల్లించాలి. 4. నాన్-హోమ్ బ్రాంచులో ఒక్కరోజులో రూ.25వేలకు మించి లావాదేవీ జరిపితే, ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీ విధిస్తారు. ఐసీఐసీఐ బ్యాంకు : 1. హోమ్ సిటీలోని శాఖల వద్ద నెలకు నాలుగు లావాదేవీలకు బ్యాంకు ఎలాంటి ఛార్జీలు విధించదు. ఆ పరిమితికి మించితే విత్ డ్రా లేదా డిపాజిట్ల ఒక్కో లావాదేవీపై కనీస ఛార్జీగా రూ.150 వసూలు చేస్తుంది. 2. థర్డ్ పార్టీ లిమిట్ రోజుకు రూ.50వేలే. 3. నాన్-హోమ్ బ్రాంచుల్లో ఐసీఐసీఐ బ్యాంకు తొలి క్యాష్ విత్ డ్రాకు క్యాలెండర్ నెలలో ఎలాంటి ఛార్జీ వేయదు. అంతకుమించితే కనీస ఛార్జీ రూ.150. 4. ఎక్కడైనా నగదు డిపాజిట్లకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతి రూ.1000కు రూ.5 ఛార్జీ వేస్తోంది. అంటే కనీసం రూ.150 వరకు ఉంటుంది. క్యాలెండర్ నెలలో తొలి క్యాష్ డిపాజిట్ ఉచితం. తర్వాత దానికి రూ.1000కు రూ.5 ఛార్జీ ఉంటుంది. -
బాబోయ్ బ్యాంకు చార్జీలు!
* ప్రతి లావాదేవీకీ వడ్డింపే వడ్డింపు * కనీస నిల్వ నుంచి స్టేట్మెంట్ వరకూ ఇదే తీరు * ఏటీఎం లావాదేవీలు సహా అన్నిటికీ పరిమితులే * టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ తగ్గుతున్న ఖర్చు * ఖాతాదారులకు మాత్రం అందని ప్రయోజనం * ఆన్లైన్లో నేరుగా లావాదేవీలు జరుపుకున్నా చార్జీల మోత * ముందే తెలుసుకోకపోతే జేబుకు ప్రమాదమే!! ఖాతాదారులందరికీ బ్యాంకులు పాస్ బుక్కులిచ్చేవి. ప్రతి లావాదేవీనీ ఆ పాస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవి. నగదు కావాలనుకున్నవారు బ్యాంకుకు వచ్చి విత్‌డ్రాయల్ స్లిప్పై రాసి.. డ్రా చేసుకునేవారు. వేరొకరి ఖాతాకు నగదు బదిలీ చేయాలంటే... అది కూడా బ్యాంకుకొచ్చి, చెక్కు ఇస్తేనే సాధ్యమయ్యేది. అయితే ఇదంతా గతం. ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. పాస్‌బుక్‌లు లేవు. విత్‌డ్రాయల్స్ నేరుగా ఏటీఎంలలోనే. నగదు బదిలీ నేరుగా కస్టమరే చేసుకోవచ్చు. నిజమే!! ఖాతాదారులకు దీంతో చాలా మేలు జరిగింది. మరి ఖాతాదారులకేనా? పాస్బుక్లివ్వటం, వాటిని అప్డేట్ చేయటం... మూడు నెలలకోసారి ఇళ్లకు స్టేట్మెంట్లు పంపటం... నగదు బదిలీకి, విత్‌డ్రాయల్స్‌కు సిబ్బంది పని చేయాల్సి రావటం... ఇవన్నీ బ్యాంకులకూ మిగిలినట్టేగా? టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయటం వల్ల బ్యాంకులకూ లబ్ధి కలిగినట్లేగా? మరి ఈ సర్వీసులన్నిటికీ ఇంతకు ముందు లేని చార్జీలు ఇపుడెందుకు వేస్తున్నారు? స్టేట్‌మెంటుకు రూ.100, ఏటీఎంలో ఐదు లావాదేవీలు దాటితే ప్రతి లావాదేవీకీ రూ.20పైనే, నగదు బదిలీ చేసినా, ఖాతా ఉన్న బ్రాంచి కాకుండా వేరొక బ్రాంచిలో డిపాజిట్ చేసినా ఎందుకు వడ్డిస్తున్నారు? ఇలాగైతే ఖాతాదారులందరినీ డిజిటల్ వైపు మళ్లించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అసలే ఆన్లైన్ బ్యాంకింగ్ భద్రతపై బోలెడన్ని భయాలున్నాయి. దానికి తగ్గట్టే ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా మోసపోవటమూ తప్పట్లేదు. ఇన్నిటి మధ్యా బ్యాంకులు కూడా చార్జీలు వడ్డిస్తుంటే ఖాతాదారులేమైపోవాలి? అసలు బ్యాంకులనే కాదు!! డిజిటైజేషన్ వల్ల లబ్ధి పొందుతున్న రైల్వేల్లాంటివి కూడా కస్టమర్లపై అదనంగా బాదుతున్నాయంటే ఏమనుకోవాలి? వినియోగదారులకు అందని టెక్నాలజీ లాభం బ్యాంకింగ్ టెక్నాలజీ వల్ల ఏమైనా మార్పులొస్తే అవి ఖాతాదారులకు మేలు చేయాలి. కానీ ఏటీఎంలకు ఖాతాదారుల్ని అలవాటు చేయడానికి... బ్యాంకుల్లో జరిపే లావాదేవీలపై చార్జీలు విధించారు. దీంతో అంతా ఏటీఎంలకు అలవాటు పడ్డారు. అంతలో ఏటీఎం లావాదేవీలకూ పరిమితులు పెట్టి... ఇంటర్నెట్ బ్యాంకింగ్ వైపు మళ్లించారు. సరే కదా అని నెట్ బ్యాంకింగ్ పై ఆధారపడితే... ప్రతి లావాదేవీకీ ఎంతో కొంత వడ్డిస్తూనే ఉన్నారు. అంటే... బ్యాంకులకెళ్లినా, వెళ్లకున్నా పరిమాణంలో తేడా తప్ప మోత మాత్రం తప్పటం లేదు. పెపైచ్చు ప్రతిదానికీ పరిమితులే. గీత దాటితే పెనాల్టీలు కూడా. ఇదీ... చార్జీలు వడ్డిస్తున్న తీరు ప్రతీ నెలా ఖాతాలో బ్యాంకు నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ లేకపోతే.. రూ.50 నుంచి మొదలై రూ.600 పైగా పెనాల్టీలు ఉంటున్నాయి. వీటికి మళ్లీ సేవా పన్నులు, సెస్సులు గట్రా అదనం. అందుకే ఆయా బ్యాంకులు నిర్దేశించిన కనీస మొత్తాన్ని ఎప్పుడూ ఖాతాలో ఉండేలా చూసుకోవటం ఉత్తమం. * ఏటీఎంల వాడకానికి వస్తే... ప్రాంతాన్ని బట్టి (మెట్రోలు, సిటీలు మొదలైనవి) పరిమితులొచ్చేశాయి. చాలా మటుకు సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో మాత్రం నెలకు 3 లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయటం మాత్రమే లావాదేవీ అనుకుంటారు చాలా మంది. అదేమీ కాదు. బ్యాలెన్సు ఎంక్వయిరీ చేసినా... మినీ స్టేట్మెంట్ తీసుకున్నా అవి కూడా లావాదేవీలే. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.5 నుంచి రూ. 20 పైగానే చార్జీలుంటున్నాయి. అందుకని సాధ్యమైనంత వరకూ ఏటీఎంలో తక్కువ లావాదేవీలు నిర్వహించడమే ఉత్తమం. * నేరుగా బ్యాంకు శాఖలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించినా బాదుడు తప్పదు. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకును తీసుకుంటే బేస్ బ్రాంచ్‌లో (ఒక సిటీలోని అన్ని శాఖలు.. క్యాష్ యాక్సెప్టర్ మెషీన్లలో) నెలకు నాలుగు నగదు లావాదేవీలు మాత్రమే ఉచితం. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ అన్నీ కలిసి నాలుగన్న మాట. ఆ తర్వాత ప్రతి రూ.1,000కి అదనంగా రూ. 5 మేర చార్జీ ఉంటుంది. ఇక బేస్ బ్రాంచ్ కాకుండా వేరే నగరంలోని శాఖల నుంచి క్యాష్ డిపాజిట్ చేస్తే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 5 చొప్పున చార్జీ ఉంటోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ (సెల్ఫ్) లావాదేవీలు ఐదు దాటాయంటే, ఆరో దాన్నుంచి ప్రతీ లావాదేవీకి రూ. 100 చొప్పున చార్జీలుంటున్నాయి. వీటికి పన్నులు అదనం. * పలు బ్యాంకులు డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులకు వార్షికంగా రూ.100 నుంచి నిర్వహణ చార్జీలు వసూలు చేస్తున్నాయి. కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే ఎలాగూ వాటికి అదనపు ఛార్జీలు తప్పవు. కాకపోతే కొన్ని బ్యాంకులు మీ కార్డు చెల్లుబాటయ్యే గడువు ఇంకా ఉన్నా సరే... కొత్త కార్డులొచ్చాయని, మీ ఫోటో పెట్టుకోవచ్చని... ఇలా రకరకాల స్కీమ్‌లతో వసూళ్లు మొదలెడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. * ఖాతాదారు నుంచి వసూలు చేసుకునే ఏ అవకాశాన్నీ వదలని బ్యాంకులు .. ఆఖరికి ఎస్ఎంఎస్ అలర్ట్‌లను కూడా విడిచిపెట్టడం లేదు. ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పంపినందుకు ప్రతి మూణ్నెల్లకోసారి రూ.15 పై చిలుకు వసూలు చేస్తున్నాయి. * కొన్ని బ్యాంకుల్లో పాస్‌బుక్కులు అడిగితే తప్ప ఇవ్వటం లేదు. నెట్‌బ్యాంకింగ్ ఉంది కనక మీరు స్టేట్మెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ వీసా వంటి అవసరాల కోసం కొన్ని సంస్థలు బ్యాంకు ముద్ర, అధికారి సంతకం ఉన్న స్టేట్మెంట్లు మాత్రమే అడుగుతున్నాయి. సంతకం అవసరం లేని డిజిటల్ స్టేట్మెంట్లను అంగీకరించటం లేదు. దీంతో స్టేట్మెంట్ కోసం బ్యాంకుకెళితే... అది ఒక పేజీ ఉన్నా సరే రూ.100 చెల్లించాల్సిందే. ఆన్లైన్ అయినా తప్పని మోత... బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండా ఆన్లైన్లోనే నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ మార్గాల్లో నగదు బదిలీ సర్వీసులు చేసే విధానాలూ అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా లావాదేవీలకూ బ్యాంకులు వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. అటు రైల్వే టికెట్ల బుకింగ్‌లు మొదలుకుని ఇటు కరెంటు, వాటర్ బిల్లులు వంటి వాటికి ఆన్లైన్లో కట్టినా అదనపు చార్జీలు తప్పటం లేదు. ఒకవైపు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని ప్రోత్సహిస్తున్నామంటూ.. మరోవైపు ఇలాంటి వడ్డింపులే ంటనే విమర్శలు వస్తున్నాయి. బిజినెస్ కరస్పాండెంట్లు మరీను!! గతంలో ఒకే నగరంలో ఏ శాఖ నుంచైనా తన ఖాతాలో డిపాజిట్ చేసుకునే వీలుండేది. కొన్ని బ్యాంకులిపుడు దీనిక్కూడా చార్జీలు విధిస్తున్నాయి. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఏర్పాటు చే స్తున్న బిజినెస్ కరెస్పాండెంట్ల (బీసీ) విధానం... కొన్నిచోట్ల మరీ ఘోరం. బిజినెస్ కరస్పాండెంట్లు బ్యాంకు నుంచి కమిషన్ పొందాలి తప్ప కస్టమర్ల నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయకూడదని రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. కానీ ప్రతి డిపాజిట్‌కూ కోత తప్పటం లేదు. రూ.5 వేలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ.100 కోత వేయటం మరీ విచిత్రం. ఇంకో చిత్రమేంటంటే చాలా బ్యాంకులు తమ శాఖల్లోనే కిందనో... లేక పక్కనో బిజినెస్ కరస్పాండెంట్లను కూర్చోబెడుతున్నాయి. డిపాజిట్ చెయ్యటానికి బ్యాంకుకు వెళితే... పక్కనున్న బీసీ దగ్గర ఖాళీగా ఉంటుంది అక్కడ డిపాజిట్ చేయమని బ్యాంకు సిబ్బందే సలహా ఇస్తున్నారు. తెలియక అక్కడికెళితే... డబ్బులు తీసుకుని నేరుగా డిపాజిట్ చేసేస్తున్నారు. తీరా చూస్తే అకౌంట్లో క్రెడిట్ అయిన మొత్తం తక్కువగా ఉంటోంది. అంటే ఛార్జీల్ని మైనస్ చేస్తున్నారన్న మాట!!. ఏదో బ్యాంకుకు దూరంగా ఏర్పాటు చేస్తే కస్టమర్లకు సౌకర్యంగా ఉంటుంది గానీ... బ్యాంకుల్లోనే ఏర్పాటు చేయటమేంటన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్బీఐ కూడా నగరాల్లో అయితే సదరు బ్యాంకు శాఖ తనకు 5 కిలోమీటర్ల దూరంలోపు బీసీని పెట్టవచ్చని, పల్లెలు, పట్టణాల్లో అయిలే ఈ దూరం 30 కి.మీ. వరకూ ఉండవచ్చని ఆర్బీఐ చెబుతోంది. కానీ పలు బ్యాంకులు దీనికి తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. -
వడ్డీరేట్లు మరింత తగ్గుతాయి: కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ దిగువ స్థాయి వడ్డీరేట్ల బాటలో నడుస్తున్నదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ శుక్రవారం పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం)ను పావుశాతం తగ్గించిన నేపథ్యంలో- బ్యాం కులు రానున్న కొద్ది రోజుల్లోనే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించనున్నాయని అన్నారు. ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం)ను లక్ష్యాల మేరకు 3.5 శాతం (2016-17 జీడీపీలో) కట్టడిలో ఉంచుతామని, చిన్న పొదుపు మొత్తాల రేట్లను తగ్గించి వ్యవస్థను దిగువస్థాయి రేట్ల దిశగా తీసుకువెళతామని ప్రభుత్వం పటిష్ట సంకేతాలు ఇస్తోందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) విధానానికి బ్యాంకింగ్ ఇప్పటికే శ్రీకారం చుట్టిన విషయాన్ని ప్రస్తావించారు. -
డెబిట్ కార్డులతోనూ బీమా ధీమా..
ప్రయాణంలో డెబిట్ కార్డు పోవడంతో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు విజయ్. బ్యాంకు వాళ్లు అప్పటికప్పుడు ఇన్స్టంట్ కార్డు జారీ చేశారు. అది తీసుకుని ఇంటికొచ్చిన తర్వాత .. వార్షిక చార్జీలు వగైరాలు ఎంత ఉంటాయో చూసుకుందామని కార్డుతో పాటు ఇచ్చిన బుక్‌లెట్‌ను తీరిగ్గా తిరగేశాడు విజయ్. చార్జీలు వగైరాల గురించి పక్కన పెడితే.. అందులో బీమా ప్రయోజనం అంశం అతని దృష్టిని ఆకర్షించింది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే ప్రమాదంలో మరణించిన తన మిత్రుడి కుటుంబానికి కూడా బీమా క్లెయిమ్ మొత్తం లభించేలా సాయం చేశాడు. ఇలా డెబిట్ కార్డులో ఇమిడి ఉన్న ప్రయోజనాలను వివరించేదే ఈ కథనం.. ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసుకోవడానికే కాకుండా ఇతరత్రా కొనుగోళ్లు జరిపేందుకు కూడా ఉపయోగపడేలా బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్ కార్డులు ఇస్తున్నాయి. ఈ డెబిట్ కార్డులతో బీమా ప్రయోజనం కూడా ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా మొదలు ఈ కార్డులతో జరిపే కొనుగోళ్లకు కూడా కవరేజీ ఉంటోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన బ్యాంకులు.. వివిధ బీమా కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. అయితే, పూర్తి స్థాయి బీమా పాలసీలకు ఈ తరహా కవరేజీని ప్రత్యామ్నాయంగా అనుకోవద్దు. దేని ప్రయోజనాలు దానివేనని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత ప్రమాద బీమా.. డెబిట్ కార్డులపై వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ బ్యాంకు, కార్డు, సందర్భాన్ని బట్టి రూ. 2 లక్షల నుంచి రూ. 3 కోట్ల దాకా ఉంటోంది. ప్రమాదంలో ఖాతాదారు కన్నుమూసిన పక్షంలోనే ఈ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తారు. సాధారణ రోడ్డు ప్రమాదాల్లాంటి (నాన్-ఎయిర్) వాటితో పోలిస్తే విమాన ప్రయాణాల్లో ప్రమాదాలకి (ఎయిర్) అధిక కవరేజీ ఉంటోంది. ఉదాహరణకు, ఐసీఐసీఐ బ్యాంకు తమ ప్లాటినం డెబిట్ కార్డుపై విమాన ప్రమాదాలకయితే రూ. 20 లక్షల మేర, నాన్-ఎయిర్ ప్రమాదాలకయితే రూ. 10 లక్షల మేర కవరేజీ ఇస్తోంది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..తమ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుపై రూ. 2 లక్షల మేర, ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుపై రూ. 5 లక్షల దాకా కవరేజీ ఇస్తోంది. కొనుగోళ్లకు ధీమా.. ప్రమాద బీమాతో పాటు కొనుగోళ్లకు కూడా డెబిట్ కార్డులతో బీమా ప్రయోజనం ఉంటోంది. కొన్న రోజు నుంచి సుమారు 90 రోజుల్లోగా సదరు వస్తువు పోయినా, అగ్నిప్రమాదాలు వంటి దుర్ఘటనల్లో ధ్వంసమైనా ఈ కవరేజీని క్లెయిము చేయొచ్చంటున్నాయి బ్యాంకులు. ఇలాంటి సందర్భాల్లో పర్చేజ్ ప్రొటెక్షన్ కింద కార్డును బట్టి రూ. 5 లక్షల దాకా కవరేజీ ఉంటోంది. షరతులూ ఉంటాయి.. క్లెయిమ్ చేసుకోవాలంటే మిగతా బీమా పాలసీల్లాగే వీటికి కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఉదాహరణకు విమాన ప్రమాదం కవరేజీ క్లెయిమ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా సదరు డెబిట్ కార్డుతోనే టికెట్ కొన్నట్లయితేనే కుదురుతుంది. క్లెయిమ్‌కి కావల్సినవి .. క్లెయిమ్ పొందాలంటే ఘటన గురించి సాధారణంగా 15 రోజుల్లోగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. నామినీ సంతకం చేసిన క్లెయిమ్ ఫారం. ఘటన జరగడానికి ముందు.. ముఫ్ఫై రోజుల పాటు కార్డు స్టేట్మెంటు. గెజిటెడ్ ఆఫీసరుతో అటెస్ట్ చేయించిన మరణ ధృవీకరణ పత్రం, పోస్ట్‌మార్టం కాపీ, ఎఫ్ఐఆర్ తదితర కాపీలు. ఆస్పత్రిలో చికిత్స పొందిన పక్షంలో చికిత్స పత్రాలు. క్లెయిమ్ మొత్తాన్ని బట్టి పాన్ కార్డు కాపీ, చిరునామా ధృవీకరణ పత్రాలు, క్లెయిమెంటు పాస్‌పోర్ట్ ఫొటోలు, నిర్దేశిత స్టాంపు పేపరుపై డిక్లరేషన్ బాండు, ఇతర వారసుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెటు ఒరిజినల్. పర్చేజ్ ప్రొటెక్షన్ క్లెయిముకయితే.. బిల్లులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. -
బ్యాంకు చార్జీలపై కన్నేయండి
ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతేనో.. లేదా చెక్కులు బౌన్స్ అవుతేనో బ్యాంకులు పెనాల్టీలని, ఇతర చార్జీలని వడ్డిస్తుంటాయని అనుకుంటాం. కానీ, ఇవే కాకుండా ఇతర చార్జీలు కూడా చాలానే ఉంటాయి. ఉదాహరణకు.. చెక్కుల వాడకాన్ని చాలా మటుకు తగ్గించేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో ఇంటి అద్దె నుంచి మిగతా బిల్లుల దాకా ప్రతీ దానికి చెక్కు నింపే అలవాటు ఉన్నవారు.. బ్యాంకులకు మరికాస్త ఎక్కువే కట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాంకులు ప్రతి ఏటా నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే చెక్ లీఫ్‌లను ఉచితంగా ఇస్తాయి. అవి కూడా పూర్తయిపోయి మరిన్ని చెక్కులు కావాలంటే అదనంగా కట్టాల్సిందే. కొన్ని బ్యాంకులు ఏటా 25-50 దాకా ఉచిత చెక్కులు ఇస్తున్నాయి. మరిన్ని కావాలంటే.. చెక్కు లీఫ్కి రూ. 2 చొప్పున తీసుకుంటున్నాయి. చెక్కుల బాదరబందీ లేకుండా ఆన్లైన్లో లావాదేవీలు జరిపే వీలుంది. అయితే, దీనికీ నగదు పరిమాణాన్ని బట్టి కనిష్టంగా రూ. 2.5 నుంచి చార్జీలు ఉంటున్నాయి. సర్వీస్ అలర్ట్‌లు.. ఆర్థిక లావాదేవీలు భద్రంగా ఉండాలంటే.. వద్దనుకున్నా కొన్ని చార్జీల నుంచి తప్పించుకోలేము. అలాంటివే సర్వీస్ అలర్టులు. డబ్బు వేసినప్పుడు, తీసినప్పుడు మీకు ఎస్ఎంఎస్లు, ఈమెయిళ్ల రూపంలో బ్యాంకులు అలర్టులు పంపిస్తుంటాయి. ఇందుకోసం కొన్ని బ్యాంకులు ఏడాదికి రూ. 60 దాకా చార్జీలు విధిస్తున్నాయి. క్రెడిట్ కార్డుల చెల్లింపులు.. సాధారణంగా చాలామంది ఆఖరు నిమిషం దాకా క్రెడిట్ కార్డులకు కట్టాల్సిన వాటిని వాయిదా వేస్తుంటారు. చివర్లో చెక్కు వేస్తే మరింత ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో బ్యాంకుకు వెళ్లి డబ్బు కట్టేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ క్రెడిట్ కార్డులకు ఇలా డబ్బు రూపంలో కట్టినా బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇలాంటి వాటిపై క్యాష్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 100 వసూలు చేస్తున్నాయి. అటు క్రెడిట్ లిమిట్‌ను మించి వాడుకున్న పక్షంలో ఓవర్డ్రాయల్ ఫీజు కింద బ్యాంకును బట్టి కనీసం రూ. 500 అయినా కట్టాల్సి వస్తుంది. ఒకోసారి ఒక కార్డు మీద చేసిన ఖర్చులను తక్కువ వడ్డీ రేటు ఉంది కదాని వేరే కార్డుకు బదలాయిస్తుంటాం. ఇలాంటప్పుడు కూడా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఫీజు అని పడుతుంది. కొన్ని సార్లు బదలాయించిన మొత్తంలో 4 శాతం దాకా కూడా ఈ ఫీజులు ఉంటాయి. కాబట్టి, వడ్డీ తక్కువ కదా అని ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రయోజజనం అటుంచి అంతకన్నా ఎక్కువ కట్టాల్సి వచ్చే పరిస్థితి ఎదురవుతుంది.