ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రతీ ఒకరికి ఉంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇటీవల కాలంలో బ్యాంక్ సంస్థలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తమ సేవలను అందిస్తున్నాయి. అయితే నగదు లావాదేవీల ఎస్‌ఎంఎస్(SMS), ఐఎంపీఎస్(IMPS) ఫండ్ బదిలీ, చెక్ క్లియరెన్స్ , ఏటీఎం విత్‌డ్రాల్ ఇలా ఏ సౌకర్యం పూర్తిగా ఉచితం కాదు. అన్ని సేవలకు, బ్యాంక్ నిబంధనల అనుసరించి తమ కస్టమర్ల నుంచి కొంత ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది తెలియక మన జేబులో పైసలు చార్జీల రూపంలో బ్యాంక్‌లకు కడుతున్నాం. ఓసారి ఆ సేవల గురించి తెలసుకుందాం.
నగదు లావాదేవీ
బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు నగదు లావాదేవీలు చేయడం సహజం. అయితే ఈ లావాదేవీని నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు. మీరు నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే, దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ ప్రతి బ్యాంకుకు దాని నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులో 20 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది.
ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి
బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్‌ను నిర్దిష్ట పరిమితి వరకు నిర్వహించాలి. మీ ఖాతాలో అంత కంటే తక్కువ మొత్తం ఉన్నట్లయితే, కనీస బ్యాలెన్స్ లేని కారణంగా ఛార్జ్ చెల్లించాలి. అన్ని బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్, దానిని నిర్వహించనందుకు ఛార్జీల పరిమితి భిన్నంగా ఉంటాయి.
ఐఎంపీఎస్ ఛార్జీలు
అన్ని బ్యాంకులు నెఫ్ట్( NEFT), ఆర్టీజీఎస్( RTGS) లావాదేవీలను కస్టమర్‌లకు ఉచితంగా అందిస్తాయి. అయితే చాలా బ్యాంకులు ఇప్పటికీ ఐఎంపీఎస్( IMPS ) లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీ రూ.1 నుంచి రూ.25 వరకు ఉంటుంది.
లక్ష వరకు ఓకే
మీ చెక్కు రూ. 1 లక్ష వరకు ఉంటే, మీరు బ్యాంకుకు ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే క్లియరెన్స్ ఛార్జీని చెల్లించాలి. మరోవైపు, చెక్కుల విషయంలోనూ పరిమితి సంఖ్య వరకు ఉచితంగా ఇస్తారు. అంతకు మించి చెక్కుల కావాలంటే వాటికోసం మీరు ధర చెల్లించాలి.
ఏటీఎం లావాదేవీ
ఏటీఎం (ATM) నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది. పేర్కొన్న సంఖ్య కంటే ఎక్కువ లావాదేవీల జరిపితే అప్పటి నుంచి చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాంకు వసూలు చేసే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఇందుకు చాలా బ్యాంకులు రూ.20-50 వరకు వసూలు చేస్తున్నాయి.
ఎస్‌ఎంఎస్ కూడా ఫ్రీ కాదండోయ్
మీ ఖాతాలో డబ్బు క్రెడిట్ అయినప్పుడు లేదా డెబిట్ అయినప్పుడు బ్యాంక్ మీకు ఎస్‌ఎంఎస్ పంపుతుంది. దీనికి బ్యాంకులు కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు ఎందుకంటే ఈ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులకు ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి.
డెబిట్ కార్డు పోతే.. పైసలే
మీరు మీ డెబిట్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, మీరు మరొక కార్డును పొందడానికి ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీ రూ. 50 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో ఛార్జీలను నిర్దేశించింది.
చదవండి: టైం వచ్చింది వెళ్దాం.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా
Comments
Please login to add a commentAdd a comment