కలకలం.. ఏటీఎం నుంచి నకిలీ నోటు! | Fake Currency Note From ATM In Anantapur District | Sakshi
Sakshi News home page

కలకలం.. ఏటీఎం నుంచి నకిలీ నోటు!

Published Thu, Sep 29 2022 7:32 AM | Last Updated on Thu, Sep 29 2022 7:32 AM

Fake Currency Note From ATM In Anantapur District - Sakshi

నకిలీ నోటును చూపుతున్న సీఆర్‌పీఎఫ్‌ మాజీ జవాన్‌ కిష్టప్ప   

గుత్తి(అనంతపురం జిల్లా): స్థానిక ప్రధాన ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఏటీఎం కేంద్రం నుంచి నకిలీ రూ.500 బయటపడింది. వివరాలు.. గుత్తిలోని లచ్చానపల్లి రోడ్డులో నివాసముంటున్న సీఆర్‌పీఎఫ్‌ విశ్రాంత జవాన్‌ కిష్టప్ప బుధవారం ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఏటీఎం కేంద్రం నుంచి రూ.9,500 డ్రా చేశాడు. అందులో ఓ నకిలీ రూ.500 నోటు వచ్చింది. విషయాన్ని వెంటనే ఎస్‌బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఎస్‌బీఐ అధికారులు స్పందించలేదని, ఏటీఎం కేంద్రంలో డబ్బు డిపాజిట్టు విషయం తమ పరిధిలో కాదని వారు పేర్కొన్నట్లు వివరించాడు.
చదవండి: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్‌ ఫాదర్‌’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement