
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
- కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహరం కింద జిల్లాకు నిర్ధేశించిన 3.50 కోట్ల మొక్కల లక్ష్యానికిగాను ఇప్పటివరకు 3.43 కోట్లు నాటినట్టు కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. హరితహరంపై కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమన్వయ సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారం లక్ష్య సాధనలో అన్ని శాఖల అధికారులు బాధ్యతగా, అంకితభావంతో కృషి చేసి; రాష్ట్రంలో జిల్లాను ప్ర«థమ స్థానంలో నిలిపారంటూ అభినందించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలో సుమారు కోటిన్నర మొక్కలను నాటించాలని అటవీశాఖ అధికారులను కోరారు. పొలం గట్లపై, పంట భూములలో ఎక్కువ మొక్కలు నాటించాలని డ్వామా పీడీని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్ సామాజిక వన విభాగం అటవీ సంర„ý ణాధికారి రాజారావు, ఖమ్మం అటవీ సంరక్షణాధికారి నర్సయ్య, డీఎఫ్‌ఓలు సతీష్‌కుమార్, శార్వానన్, శాంతారామ్, డీఆర్‌డీఏ పీడీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.