పిజ్జా అంటే చెప్పలేనంత ప్రేమ ఇద్దరు స్నేహితులు చేసిన తెలిస్తే షాక్ అవుతారు. ఒకరోజు సెలవుపెట్టి ఏకంగా విమానంలో వెళ్లి మరీ పిజ్జా ఆరగించి వచ్చారు. దీనికి ఎంత ఖర్చయిందో తెలుసా?
మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ ప్రకారం, యూకేకుచెందిన మోర్గాన్ బోల్డ్, ఆమె స్నేహితురాలు జెస్ వుడర్ ఇద్దరూ "ఎక్స్‌ట్రీమ్ డే ట్రిప్"ని ప్లాన్ చేసారు. అంటే ఒక్క రోజులోనే తిరిగి ఆఫీసుకు వచ్చేసేలా అన్నమాట. దీని ప్రకారం ఇద్దరు స్నేహితులు లివర్‌పూల్ నుండి పిసాకు (ఇటలీలో) మాంచెస్టర్ విమానాశ్రయంలో విమానంలో వెళ్లారు. డే రిటర్న్ ఫ్లైట్‌లను బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకోవడం విశేషం. ఈ సుడిగాలి పర్యటనలో షాపింగ్ చేసుకొని, తమకిష్టమైన పిజ్జాను ఆస్వాదించారు.
బోల్డ్, వుడర్ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ముందు ఫోటోలు తీసుకున్నారు. గూగుల్ మ్యాప్‌లో మంచి పిజ్జాతో రెస్టారెంట్‌లకు వెతుక్కున్నారు. విమానచార్జీలు, విమానాశ్రయం పార్కింగ్, ఫుడ్ కలిపి మొత్తం పర్యటనకు 170 పౌండ్లు (రూ. 17,715) వెచ్చించామని తెలిపారు.
లివర్‌పూల్‌నుంచి లండన్‌కి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా అక్కడ పిజ్జా ఇతర డ్రింక్స్ ఖరీదు చాలా ఎక్కువ. దాదాపు అదే డబ్బుతో వేరే దేశం వెళలి వచ్చామంటూ చెప్పుకొచ్చారు.
పిసా టవర్‌ను చూస్తూ పిజ్జా తినడం అద్భుతం. ఇక్కడఆహార ధరలు రీజనబుల్‌గానే ఉన్నాయంటూ వెల్లడించారు. వచ్చిన విమానంలోనే తిరిగి ఇంటికి వెళ్లడం ఇంకా బావుందంటూ తెగ సంబరపడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment