Liverpool
-
World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత
లండన్: ప్రపంచంలోనే అత్యంత కురు వృద్ధుడిగా తొమ్మిది నెలలపాటు కొనసాగిన జాన్ ఆ్రల్ఫెడ్ టిన్నిస్వుడ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 112 ఏళ్లు. లివర్‌పూల్‌లోని వృద్ధాశ్రమంలో సోమ వారం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబం తెలిపింది. టిన్నిస్వుడ్ లివర్‌పూల్‌లో 1912 ఆగస్ట్ 26వ తేదీన జని్మంచారు. ఆగస్ట్‌లో 112వ జన్మదినం జరుపుకున్నారు. ఇంత సుదీర్ఘ కాలం జీవించడం కేవలం అదృష్టమని చెప్పే టిన్నిస్వుడ్.. మనం ఎక్కువ కాలం జీవించాలా, స్వల్ప కాలమా అన్నది మన చేతుల్లో లేదని ఆయన తెలిపేవారని కుటుంబం గుర్తు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా టిన్నిస్వుడ్ పేరు ఈ ఏడాది ఏప్రిల్‌లో గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో నమోదైంది. బ్రిటిష్ ఆర్మీ పే కార్ప్స్లో సైనికుడిగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. రెండు ప్రపంచయుద్ధాలు ఆయన జీవితకాలంలోనే జరిగాయి. టిన్నిస్‌వుడ్‌కు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మునిమనవలు ఉన్నారు. భార్య బ్లోడ్వెన్ 1986లో చనిపోయారు. -
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
పిజ్జా అంటే చెప్పలేనంత ప్రేమ ఇద్దరు స్నేహితులు చేసిన తెలిస్తే షాక్ అవుతారు. ఒకరోజు సెలవుపెట్టి ఏకంగా విమానంలో వెళ్లి మరీ పిజ్జా ఆరగించి వచ్చారు. దీనికి ఎంత ఖర్చయిందో తెలుసా? మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ ప్రకారం, యూకేకుచెందిన మోర్గాన్ బోల్డ్, ఆమె స్నేహితురాలు జెస్ వుడర్ ఇద్దరూ "ఎక్స్ట్రీమ్ డే ట్రిప్"ని ప్లాన్ చేసారు. అంటే ఒక్క రోజులోనే తిరిగి ఆఫీసుకు వచ్చేసేలా అన్నమాట. దీని ప్రకారం ఇద్దరు స్నేహితులు లివర్‌పూల్ నుండి పిసాకు (ఇటలీలో) మాంచెస్టర్ విమానాశ్రయంలో విమానంలో వెళ్లారు. డే రిటర్న్ ఫ్లైట్లను బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకోవడం విశేషం. ఈ సుడిగాలి పర్యటనలో షాపింగ్ చేసుకొని, తమకిష్టమైన పిజ్జాను ఆస్వాదించారు.బోల్డ్, వుడర్ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ముందు ఫోటోలు తీసుకున్నారు. గూగుల్ మ్యాప్‌లో మంచి పిజ్జాతో రెస్టారెంట్లకు వెతుక్కున్నారు. విమానచార్జీలు, విమానాశ్రయం పార్కింగ్, ఫుడ్ కలిపి మొత్తం పర్యటనకు 170 పౌండ్లు (రూ. 17,715) వెచ్చించామని తెలిపారు. లివర్పూల్నుంచి లండన్‌కి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా అక్కడ పిజ్జా ఇతర డ్రింక్స్ ఖరీదు చాలా ఎక్కువ. దాదాపు అదే డబ్బుతో వేరే దేశం వెళలి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. పిసా టవర్‌ను చూస్తూ పిజ్జా తినడం అద్భుతం. ఇక్కడఆహార ధరలు రీజనబుల్‌గానే ఉన్నాయంటూ వెల్లడించారు. వచ్చిన విమానంలోనే తిరిగి ఇంటికి వెళ్లడం ఇంకా బావుందంటూ తెగ సంబరపడిపోయారు. -
టాక్సీ డ్రైవర్ సాహసం.. సూసైడ్ బాంబర్‌ని కారులోనే బంధించి
లండన్: రిమెంబరెన్స్ డే సర్వీస్ సందర్భంగా లివర్‌పూల్ నగరంలోని మెటర్నటీ ఆసుపత్రి వెలుపల జరిగిన కారు పేలుడులో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు సంభవించడానికి ముందు ఓ టాక్సీ డ్రైవర్ చాకచక్యంగా వ్యహరించి.. ఉగ్రవాదిని అడ్డుకోవడంతో ఒక్కరు మాత్రమే మరణించారు. లేదంటే డజన్ల కొద్ది జనాల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ప్రస్తుతం సదరు టాక్సీ డ్రైవర్ని హీరోగా కొనియాడుతున్నారు లండన్ వాసులు. ఆ వివరాలు.. బాంబర్ లివర్‌పూల్‌లో రిమెంబరెన్స్ డే సర్వీస్ వద్దకు చేరుకుని.. తనను తాను పేల్చుకుని మారణహోమం సృష్టించాలని భావించాడు. ఈ క్రమంలో తన శరీరం మీద పేలుడు పదార్థాలను అమర్చుకుని లివర్‌పూల్‌కు వెల్లడానికి క్యాబ్ ఎక్కాడు. అయితే ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో.. క్యాబ్‌ను లివర్‌పూల్ మెటర్నటీ ఆస్పత్రి వద్దకు డైవర్ట్ చేశారు. (చదవండి: యూకే లివర్‌పూల్ నగంలో కారు బ్లాస్ట్...ఒకరు మృతి) ఆస్పత్రి వద్దకు వెళ్తుండగా.. తన కారులో కూర్చున్న వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో టాక్సీ డ్రైవర్ అతడిని ఓ కంట కనిపెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్దకు వచ్చే లోపు తన కారులో ఉన్న వ్యక్తి సూసైడ్ బాంబర్ అని టాక్సీ డ్రైవర్‌కు అర్థం అయ్యింది. మెటర్నటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే టాక్సీ డ్రైవర్ వెంటనే కిందకు దిగి బాంబర్‌ని క్యాబ్‌లో లాక్ చేశాడు. (చదవండి: కాబుల్ మరోసారి దద్దరిల్లింది.. రాకెట్ దాడిగా అనుమానం) అనంతరం బాంబర్ల కారులో ఉండే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ప్రమాదంలో బాంబర్ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తన సమయస్ఫూర్తి, సాహసంతో ఎందరో ప్రాణాలు కాపాడిన టాక్సీ డ్రైవర్‌కు చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. టాక్సీ డ్రైవర్ చూసిన సాహసం తెలుసుకున్న ప్రజలు అతడిని నిజమైన హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం -
యూకే లివర్‌పూల్ నగరంలో కారు బ్లాస్ట్...ఒకరు మృతి
లండన్: లివర్‌పూల్ నగరంలోని మహిళా ఆసుపత్రి వెలుపల జరిగాన కారు పేలుడులో ఒకరు మృతి చెందారని, పైగా ముగ్గురు వ్యక్తలను అదుపులోకి తీసుకునిన విచారిస్తున్నామని ఉగ్రవాద నిరోధక అధికారులు వెల్లడించారు. అంతేకాదు కారులోని ఒక ప్రయాణికుడు సంఘటన స్థలంలోనే మరణించాడని, డ్రైవర్ గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఆ ముగ్గురు వ్యక్తులను నగరంలోని కెన్సింగ్టన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని తీవ్రవాద చట్టం కింద అరెస్టు చేసినట్లు ఉగ్రవాద నిరోధ పోలీసులు తెలిపారు. (చదవండి: జైల్లో ఘర్షణ.. 68 మంది ఖైదీలు మృతి ఈ క్రమంలో చీఫ్ కానిస్టేబుల్ సెరెనా కెన్నెడీ మాట్టాడుతూ...తాము సమీపంలోని లివర్‌పూల్ కేథడ్రల్‌లో రిమెంబరెన్స్ డే సర్వీస్ సందర్భంగా యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటున్న సమయంలోనే ఈ సమాచారం అందడంతో వెంటనే తాము స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు తెలిపారు.అంతేకాదు తాము స్థానిక పోలీసుల మద్ధతుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఏం జరిగిందనే విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాన్ని తెలయజేస్తామంటూ ఉగ్రవాద నిరోధక అధికారులు వెల్లడించారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటమే కాక ఎప్పటికప్పుడు ఆ ఘటనకు సంబంధించిన ప్రతి విషయాన్ని స్వయంగా సమీక్షిస్తున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రీతి పటేల్ తెలిపారు. అయితే ఈ పేలుడును పోలీసులు ఉగ్రవాద ఘటనగా ప్రకటించకపోవడం గమనార్హం. (చదవండి: మెక్‌డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం) -
లేజర్ ట్రీట్మెంట్: 'అమ్మాయిగా అనిపించట్లేదు'
లండన్: మరింత అందంగా కనిపించాలని, తన నిగారింపును రెట్టింపు చేసుకోవాలని తహతహలాడిందో బ్యూటీషియన్. ఈ క్రమంలో ఒంటి మీద ఉన్న అవాంచిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం లేజర్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. మొత్తంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది సార్లు హెయిర్ రిమూవల్ చికిత్స తీసుకుంది. కానీ ఆమె ఆశించినదానికి భిన్నంగా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని అర్థమై అర్ధాంతరంగా చికిత్సను ఆపేసింది. ఇప్పుడు తనకు తాను అమ్మాయిగా అనిపించడం లేదంటూ చింతిస్తోంది. 2018లో ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు చెందిన సన్నా సోహైల్ అనే బ్యూటీషియన్ అవాంచిత రోమాలను తొలగించేందుకు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఓసారి క్లినిక్‌కు వెళ్లినప్పుడు తనను తాను చూసుకుని తీవ్ర నిరాశ చెందింది. తను ఊహించినట్లుగా అందంగా కనిపించడానికి బదులుగా ఏదో హార్మోన్ల సమస్యలు ఉన్నట్లు నిర్జీవంగా కనిపించింది. దీంతో ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపేసింది. పైగా చికిత్స తీసుకున్నచోట ఓ గడ్డ(కణతి) ఏర్పడింది. దీని గురించి సన్నా మాట్లాడుతూ.. నా చర్మంపైన కణతి ఏర్పడగానే వారు వైద్యుడికి చూపిస్తామన్నారు. ఓ ప్రైవేటు డాక్టర్‌ను సంప్రదించి దాన్ని తీసేయిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు అని సన్నా వాపోయింది. ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి మార్పులొస్తాయనే కనీస విషయాలేవీ వాళ్లు నాకు చెప్పలేదు. కణతి ఉన్నప్పుడు లెగ్గిన్లు, అండర్‌వేర్‌తో పాటు టైట్ దుస్తులు వేసుకోవద్దని చెప్పలేదు. ఇప్పుడు వాటిని ధరించాలన్నా ఎక్కడ మళ్లీ ఆ కణతి ఏర్పడుతుందోనని భయంగా ఉంది. వీటన్నింటి మధ్య నేను అమ్మాయినే అన్న భావన కలగడం లేదు. ఈ సమస్య వల్ల నేనెప్పటికీ జీన్స్ ధరించలేను అని చెప్పుకొచ్చింది. తనను మానసికంగా ఎంతో బాధించిన ఈ సమస్యను సన్నా అంత ఈజీగా వదల్లేదు. లేజర్ ట్రీట్మెంట్ మీద ఆమె పరిశోధనలు చేపట్టింది. ఓ యంత్రాన్ని సైతం కనిపెట్టింది. తను సొంతంగా ఏర్పాటు చేసిన క్లినిక్‌లో ఈ యంత్రాన్ని లాంచ్ చేసింది. చదవండి: ఆటోపై లగ్జరీ హౌజ్.. ఆనంద్ మహీంద్ర ఫిదా పట్టుమని పది సెకన్లు ఉన్న వీడియోకు రూ.48 కోట్లు గుమ్మరించారు -
30 ఏళ్ల నిరీక్షణకు తెర
లండన్: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తెరదించింది. ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) 2019–2020 సీజన్ చాంపియన్‌గా ఆవిర్భవించింది. డిఫెండింగ్ చాంపియన్ మాంచెస్టర్ సిటీ జట్టు శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 1–2 గోల్స్‌తో చెల్సీ ఎఫ్‌సీ చేతిలో ఓడటంతో లివర్‌పూల్ టైటిల్ కల సాకారమైంది. టైటిల్ రేసులో నిలవాలంటే ఓటమి తప్పించుకోవాల్సిన మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీ ఓడిపోవడంతో కరోనా విరామం అనంతరం బరిలోకి దిగకుండానే లివర్‌పూల్‌కు టైటిల్ లభించింది. ఈ సీజన్లో ఈపీఎల్‌లో ఉన్న 20 జట్లకు తలా ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా... లివర్‌పూల్ 86 పాయింట్లు, మాంచెస్టర్ సిటీ 63 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన ఏడు మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా పాయింట్ల పట్టికలో లివర్‌పూల్‌ను ఏ జట్టూ అందుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ జట్టుకు టైటిల్ ఖాయమైంది. 1989–90 సీజన్లో చివరిసారిగా లివర్‌ఫూల్ విజేతగా నిలిచింది. ఈపీఎల్ చరిత్రలో ఓ జట్టు ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే చాంపియన్‌గా అవతరించడం ఇదే తొలిసారి. -
అద్భుతం : 30 ఏళ్ల నిరీక్షణకు తెర
ఫుట్‌బాల్ చరిత్రలో గురువారం రాత్రి ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టైటిల్‌ను గెలవడం కోసం 30 ఏళ్లుగా నిరీక్షిస్తున్న లివర్‌పూల్ కల నెరవేరింది. గురువారం రాత్రి మాంచెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో చెల్సియా జట్టు 2-1 తేడాతో విజయం సాధించడంతో లివర్‌పూల్ మొదటిసారి ఇంగ్లీష్ ప్రీమియర్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. అయితే ఒక దశలో జుర్గెన్ క్లోప్ ఆధ్వర్యంలోని లివర్‌పూల్ టైటిల్ గెలవడానికి మరో మ్యాచ్‌కోసం ఎదురుచూడాల్సి వస్తుందేమోనన్న అనుమానం కలిగింది. కానీ చెల్సియా జట్టులోని క్రిస్టియన్ పులిసిక్, విలియమ్ సీల్డ్ ఆఖరి నిమిషంలో గోల్స్ చేయడంతో చెల్సియా జట్టు 2-1 తేడాతో మాంచెస్టర్ సిటీని ఓడించింది. మరోవైపు మాంచెస్టర్ సిటీ నుంచి కెవిన్ డిబ్రూయిన్ ఒక గోల్ చేశాడు. (మైదానంలోకి రోహిత్ శర్మ) ఈ విజయం చెల్సియాకు తరువాతి సీజన్లో జరగనున్న ఛాంపియన్స్ లీగ్‌లో స్థానం సాధించడంతో జట్టును మరింత బలోపేతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బ్లూస్(చెల్సియా) అభిమానులు ఈ ఫలితంతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు లివర్‌పూల్ క్లబ్ మొదటిసారి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడం వెనుక చెల్సియా మ్యాచ్ ఎంతగానో ఉపయోగపడిందని లివర్‌పూల్ అభిమానులు పేర్కొన్నారు. 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత వారి కల సాకారం అయినందుకు లివర్‌పూల్ క్లబ్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. కాగా లివర్‌పూల్ తరువాతి మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీని ఎదుర్కోనుంది. గార్డ్ ఆఫ్ ఆనర్ కింద ఈ మ్యాచ్ జరగనుంది. -
పోలీస్ అధికారి మీద పడి చితకొట్టాడు.. వైరల్
లివర్‌పూల్(ఇంగ్లాండ్) : నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ పోలీసు అధికారి మీద పడి పిడి గుద్దులు కురిపొంచాడో వ్యక్తి. అక్కడున్న వారు అతన్ని పక్కకు లాగడంతో ఆ అధికారి పరిస్థితి చావుతప్పి కన్నులొట్ట పోయినట్లైంది. స్వల్ప గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ నగరానికి దగ్గరలోని ఓ రోడ్డుపై పోలీసు అధికారి కేయిత్ కెల్లెట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు . అదే సమయంలో అటు వైపుగా మోటార్ బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిపై అనుమానంతో ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించాల్సిందిగా కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన వాహనదారుడు పోలీసు అధికారిని దుర్భాషలాడటమే కాకుండా మీద పడి పిడిగుద్దులు గుద్దటం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలు తాళలేకపోయిన అధికారి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇది గమనించిన అక్కడి వారు ఆ వ్యక్తిని విడిపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు బైకు యాజమానిని విడిపించి అటు నుంచి అటే పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని మెర్సీసైడ్‌కు చెందిన మాగ్హల్గా పోలీసులు గుర్తించారు. బైకుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడం, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై చెయ్యి చేసుకోవడం వంటి నేరాల కింద అతనికి శిక్ష పడింది. ఈ దృశ్యాలన్నింటిని అటువైపుగా వెళుతున్న ఓ వాహనదారుడు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పోలీసుపై దాడి
-
చెల్సితో అంత ఈజీ కాదు: యయ టౌర్
మాంచెస్టర్ సిటీ స్టార్ డిఫెండర్ యయ టౌర్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లివర్‌పూల్‌తో కీలకమైన సమరానికి సిద్ధమైన అతను టైటిల్ అవకాశాలపై మాట్లాడుతూ చెల్సి ఆధిక్యంలో ఉన్నా... తాము రేసులోనే ఉన్నామని చెప్పాడు. నాకౌట్ దశకు చేరిన ఈ టోర్నమెంట్లో తమ జట్టు డిఫెన్స్‌లో తప్పులను సరిదిద్దుకొని ముందంజ వేస్తుందని అన్నాడు. ఇంకా అతడేమన్నాడంటే... మాంచెస్టర్ ఇటీవల బాగా రాణిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తారా? మైదానంలో మా శక్తిమేర రాణించడం... మాకంటూ కొత్త చరిత్రను లిఖించడమే లక్ష్యంగా కదం తొక్కుతున్నాం. ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ కీలకమైన నాకౌట్ పోరు దాకా వచ్చాం. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. కానీ డిఫెన్స్‌లో పదేపదే చేసే పొరపాట్లు జట్టును కలవరపెడుతున్నాయి. ఇలా అయితే టైటిల్ సాధ్యమేననుకుంటున్నారా? ఎందుకు సాధ్యం కాదు. సమష్టిగా రాణిస్తే ఏదైనా సాధ్యమే. అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్న వెంటనే తేరుకొని గోల్స్ చేస్తున్నాం. కోట్లు కుమ్మరించిన ఆటగాళ్లంతా క్లబ్ కోసం కష్టపడుతున్నారు. వీరంతా మ్యాచ్‌ల్నే కాదు ట్రోఫీని కూడా గెలిపిస్తారు. ఈ వారాంతంలో జరిగే మ్యాచ్‌లో చెల్సి జట్టును ఓడిస్తారా? ఇదంత సులభం కాదు. చెల్సి జట్టు మాకంటే మెరుగైన స్థితిలో వుంది. ఇప్పటిదాకా ఈ టోర్నీ ఆసాంతం బాగా ఆడింది. అయితే మేం మ్యాచ్‌లో నిలకడైన ప్రదర్శన కనబరిస్తే గెలిచే అవకాశాలుంటాయి. ఇప్పుడైతే మేం పాయింట్ల పట్టికలో చెల్సి తర్వాత రెండో స్థానంపై కన్నేశాం. మాంచెస్టర్‌కు ఈ సీజన్ గొప్పగా ముగుస్తుందనే భావిస్తున్నారా? అవును. ఈ ప్రీమియర్ లీగ్‌లో మేం టైటిల్ రేసులోనే ఉన్నాం. ఎఫ్ఏ కప్‌లోనూ ఇలాగే ఆడతాం. మా మేనేజర్‌కు ఏం కావాలో దాన్ని ప్రతిరోజు మేం నేర్చుకుంటున్నాం. ఇదే పోరాటంతో ఈ సీజన్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. -
అంతర్జాలంలో స్టార్ ఆటగాడి రాసలీలలు
లండన్: ఇంగ్లాండ్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు నాథనీల్ క్లైన్‌కు పెద్ద షాక్ ఎదురైంది. అంతర్జాలంలో హఠాత్తుగా తన లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియో ఒకటి దర్శనమివ్వడంతో ఈ 25 ఏళ్ల లివర్‌పూల్ ప్లేయర్ కంగుతిన్నాడు. దీనికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసునమోదు చేసిన పోలీసులు ఆ వీడియోను తొలగించే పనిలో పడ్డారు. నథనీల్ క్లైన్ 2014లో తన లగ్జరీ అపార్ట్మెంట్లో ఓ మహిళతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో తన మిత్రుడు కూడా ఆ గదిలోనే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా అన్లైన్లో ప్రత్యక్షం కావడంతో అప్రమత్తమైన క్లైన్.. మెర్సీసైడ్ పోలీసులను ఆశ్రయించాడు. తన గౌరవానికి భంగం కలిగించేలా వీడియోను ఆన్లైన్లో ఉంచారని ఆయన మండిపడుతున్నాడు.