మాంచెస్టర్ సిటీ స్టార్ డిఫెండర్ యయ టౌర్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లివర్‌పూల్‌తో కీలకమైన సమరానికి సిద్ధమైన అతను టైటిల్ అవకాశాలపై మాట్లాడుతూ చెల్సి ఆధిక్యంలో ఉన్నా... తాము రేసులోనే ఉన్నామని చెప్పాడు. నాకౌట్ దశకు చేరిన ఈ టోర్నమెంట్‌లో తమ జట్టు డిఫెన్స్‌లో తప్పులను సరిదిద్దుకొని ముందంజ వేస్తుందని అన్నాడు. ఇంకా అతడేమన్నాడంటే...
మాంచెస్టర్ ఇటీవల బాగా రాణిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తారా?
మైదానంలో మా శక్తిమేర రాణించడం... మాకంటూ కొత్త చరిత్రను లిఖించడమే లక్ష్యంగా కదం తొక్కుతున్నాం. ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ కీలకమైన నాకౌట్ పోరు దాకా వచ్చాం. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం.
కానీ డిఫెన్స్‌లో పదేపదే చేసే పొరపాట్లు జట్టును కలవరపెడుతున్నాయి. ఇలా అయితే టైటిల్ సాధ్యమేననుకుంటున్నారా?
ఎందుకు సాధ్యం కాదు. సమష్టిగా రాణిస్తే ఏదైనా సాధ్యమే. అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్న వెంటనే తేరుకొని గోల్స్ చేస్తున్నాం. కోట్లు కుమ్మరించిన ఆటగాళ్లంతా క్లబ్ కోసం కష్టపడుతున్నారు. వీరంతా మ్యాచ్‌ల్నే కాదు ట్రోఫీని కూడా గెలిపిస్తారు.
ఈ వారాంతంలో జరిగే మ్యాచ్‌లో చెల్సి జట్టును ఓడిస్తారా?
ఇదంత సులభం కాదు. చెల్సి జట్టు మాకంటే మెరుగైన స్థితిలో వుంది. ఇప్పటిదాకా ఈ టోర్నీ ఆసాంతం బాగా ఆడింది. అయితే మేం మ్యాచ్‌లో నిలకడైన ప్రదర్శన కనబరిస్తే గెలిచే అవకాశాలుంటాయి. ఇప్పుడైతే మేం పాయింట్ల పట్టికలో చెల్సి తర్వాత రెండో స్థానంపై కన్నేశాం.
మాంచెస్టర్‌కు ఈ సీజన్ గొప్పగా ముగుస్తుందనే భావిస్తున్నారా?
అవును. ఈ ప్రీమియర్ లీగ్‌లో మేం టైటిల్ రేసులోనే ఉన్నాం. ఎఫ్‌ఏ కప్‌లోనూ ఇలాగే ఆడతాం. మా మేనేజర్‌కు ఏం కావాలో దాన్ని ప్రతిరోజు మేం నేర్చుకుంటున్నాం. ఇదే పోరాటంతో ఈ సీజన్‌లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
చెల్సితో అంత ఈజీ కాదు: యయ టౌర్
Published Sat, Mar 18 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
Advertisement