![World's oldest man, John Alfred Tinniswood dies at 112](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/27/212.jpg.webp?itok=B1sD1jfz)
లండన్: ప్రపంచంలోనే అత్యంత కురు వృద్ధుడిగా తొమ్మిది నెలలపాటు కొనసాగిన జాన్ ఆ్రల్ఫెడ్ టిన్నిస్‌వుడ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 112 ఏళ్లు. లివర్‌పూల్‌లోని వృద్ధాశ్రమంలో సోమ వారం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబం తెలిపింది.
టిన్నిస్‌వుడ్ లివర్‌పూల్‌లో 1912 ఆగస్ట్ 26వ తేదీన జని్మంచారు. ఆగస్ట్‌లో 112వ జన్మదినం జరుపుకున్నారు. ఇంత సుదీర్ఘ కాలం జీవించడం కేవలం అదృష్టమని చెప్పే టిన్నిస్‌వుడ్.. మనం ఎక్కువ కాలం జీవించాలా, స్వల్ప కాలమా అన్నది మన చేతుల్లో లేదని ఆయన తెలిపేవారని కుటుంబం గుర్తు చేసింది.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా టిన్నిస్‌వుడ్ పేరు ఈ ఏడాది ఏప్రిల్‌లో గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో నమోదైంది. బ్రిటిష్ ఆర్మీ పే కార్ప్స్‌లో సైనికుడిగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. రెండు ప్రపంచయుద్ధాలు ఆయన జీవితకాలంలోనే జరిగాయి. టిన్నిస్‌వుడ్‌కు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మునిమనవలు ఉన్నారు. భార్య బ్లోడ్‌వెన్ 1986లో చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment