హాలీవుడ్ నటుడు పాల్ రిట్టర్(54) కన్నుమూశారు. బ్రెయన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను తెలియజేయడానికి చింతిస్తున్నామని కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. అతడి మరణవార్త తెలిసిన హాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "పాల్ అద్భుతమైన మనిషి. అందరితో ఎంతో సరదాగా ఉండేవాడు. నాతో కలిసి పని చేసిన వారిలో అతడు గ్రేట్ నటుడు. ఆయన మన మధ్య లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను" అని ఫ్రైడే నైట్ డిన్నర్ రచయిత రాబర్ట్ పాపర్ ట్వీట్ చేశారు.
పాల్ రిట్టర్ 1992లో 'ద బిల్' చిత్రంతో నటనారంగంలోకి ప్రవేశించారు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్, సన్ ఆఫ్ రాంబో, హ్యారీపోటర్, హాఫ్ బ్లడ్ ప్రిన్స్ వంటి పలు చిత్రాల్లో నటించారు. చెర్నోబిల్ సిరీస్‌లో తన అద్భుత నటనకుగానూ అభిమానుల ప్రశంసలు దక్కించుకున్నారు. 'ఫ్రైడే నైట్ డిన్నర్'లోనూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.
చదవండి: పెళ్లికి ముందే గర్భవతినని చెప్పాలనుకున్నా: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment