brain tumour
-
ఒకే రోజు ఇద్దరు క్రికెటర్లను బలి తీసుకున్న బ్రెయిన్ ట్యుమర్
ప్రాణాంతక వ్యాధి బ్రెయిన్ ట్యుమర్ ఒకే రోజు ఇద్దరు మాజీ అంతర్జాతీయ క్రికెటర్లను బలి తీసుకుంది. ఈ ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన వారే కావడం విశేషం. బంగ్లాదేశ్ తొలి వన్డే జట్టులో సభ్యుడైన సమియుర్ రెహమాన్ (69) బ్రెయిన్ ట్యుమర్ వ్యాధి కారణంగా ఇవాళ (ఏప్రిల్ 19) ఢాకాలోని సిటీ ఆసుపత్రిలో కన్నుమూయగా, ఇదే రోజు బంగ్లా మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మొషారఫ్ హొస్సేన్ (40) అదే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మృతి చెందాడు. ఒకే రోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు కన్నుమూయడం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. (సమియుర్ రెహమాన్) రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సమియుర్ బంగ్లాదేశ్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా సాధించలేకపోగా, మొషారఫ్ హొస్సేన్ 2008-16 మధ్యలో 5 వన్డేలు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. సమియుర్ ఆటగాడిగా రిటైర్ అయిన అనంతరం బంగ్లా దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరించగా, మొషారఫ్ హొస్సేన్.. బంగ్లా దేశవాళీ టోర్నీల్లో 572 వికెట్లు పడగొట్టి స్టార్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: లక్నోతో మ్యాచ్.. భారీ రికార్డులపై కన్నేసిన దినేశ్ కార్తీక్ -
బ్రెయిన్ ట్యూమర్‌తో హ్యారీపోటర్ నటుడి మృతి
హాలీవుడ్ నటుడు పాల్ రిట్టర్(54) కన్నుమూశారు. బ్రెయన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను తెలియజేయడానికి చింతిస్తున్నామని కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. అతడి మరణవార్త తెలిసిన హాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "పాల్ అద్భుతమైన మనిషి. అందరితో ఎంతో సరదాగా ఉండేవాడు. నాతో కలిసి పని చేసిన వారిలో అతడు గ్రేట్ నటుడు. ఆయన మన మధ్య లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను" అని ఫ్రైడే నైట్ డిన్నర్ రచయిత రాబర్ట్ పాపర్ ట్వీట్ చేశారు. పాల్ రిట్టర్ 1992లో 'ద బిల్' చిత్రంతో నటనారంగంలోకి ప్రవేశించారు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్, సన్ ఆఫ్ రాంబో, హ్యారీపోటర్, హాఫ్ బ్లడ్ ప్రిన్స్ వంటి పలు చిత్రాల్లో నటించారు. చెర్నోబిల్ సిరీస్‌లో తన అద్భుత నటనకుగానూ అభిమానుల ప్రశంసలు దక్కించుకున్నారు. 'ఫ్రైడే నైట్ డిన్నర్'లోనూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. చదవండి: పెళ్లికి ముందే గర్భవతినని చెప్పాలనుకున్నా: హీరోయిన్ లాస్య గ్రాండ్ పార్టీ: రచ్చ లేపిన బిగ్‌బాస్ కంటస్టెంట్లు -
ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉంది
-
ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉంది
లండన్ : డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేస్తుండగానే సదరు మహిళ వయొలిన్ పరికరాన్ని వాయించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఘటన బ్రిటన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాలు.. లండన్‌కు చెందిన 53 ఏళ్ల డాగ్మార్ టర్నర్ గత కొంత కాలంగా అరుదైన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజీ ఆసుపత్రి న్యూరో సర్జన్ కీమౌర్స్ అష్కాన్ దగ్గర ట్యూమర్‌కు సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. కాగా ట్యూమర్ పరిధి బ్రెయిన్ కుడి భాగం మొత్తం విస్తరించడంతో వెంటనే ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించుకోవాలని,లేకపోతే వెంటనే ప్రాణం పోతుందని కీమౌర్స్ అష్కాన్ సూచించారు.(జస్ట్ మిస్.. కొద్దిలో ప్రాణం పోయేదే) ఇదిలా ఉండగా టర్నర్‌కు సంగీతమంటే మహా ప్రాణం.. ఎంతలా అంటే ఆమె గత 40 ఏళ్లుగా వయొలిన్ పరికరాన్ని ఎంతో ఇష్టంగా వాయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సమయంలో తనకు వయొలిన్ వాయించడానికి అనుమతి ఇవ్వాలని టర్నర్ అష్కాన్‌ను కోరారు. మొదట ఆమె అడిగినదానికి ఒప్పుకోని అష్కాన్ టర్నర్‌కు సంగీతంపై ఉన్న ఇష్టంతో కాదనలేకపోయాడు. ఆపరేషన్ సమయంలో ఆమెకు మత్తు ఇవ్వకుండానే బ్రెయిన్లోని ట్యూమర్‌ను తొలగించారు. అయితే కణితిని తొలగించినంత సేపూ ఆమె ఎడమ చేయిలో వయొలిన్ పట్టుకొని కుడిచేత్తో వాయించిన తీరు హృదయాన్ని హతుత్కునేలా ఉంది. అయితే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో ఫేర్ చేయడంతో వైరల్‌గా మారింది. (బల్లి నోట్లో నోరు పెట్టాడు..) 'ఒక ఆపరేషన్ సయయంలో పేషంట్ ఇలా సంగీత పరికరం వాయించడం నా కెరీర్లో ఇదే మొదటిసారి అనుకుంటా.ఆమె సంగీతానికి ఎటుంటి ఆటంకం కలగించకుండానే శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాం' అని అష్కాన్ పేర్కొన్నారు. ' నాకు అవకాశం కల్పించిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆపరేషన్ సమయంలో వయొలిన్ ప్లే చేయలేనేమో అని బాధపడ్డా. వయొలిన్ వాయించడమనేది నా అభిరుచిగా ఉండేది. నేను 10 సంవత్సారాల వయసు నుంచే వయొలిన్ వాయించడం నేర్చుకున్నా' అంటూ టర్నర్ భావోద్వేగానికి గురయ్యారు. -
పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి నిలిచిపోతుంది
సూరత్ : కొందరు చావు పేరు చెబితేనే ఆమడ దూరం వెళ్లిపోతారు. మరికొందరు చావు పేరు వింటేనే మా గుండెల్లో దడ మొదలవుతుంది అంటారు. మరీ అలాంటిది ఒక మహిళ మాత్రం కొద్దిరోజుల్లో తాను మరణిస్తానన్న విషయం తెలిసినా ఏ మాత్రం అధైర్యపడకుండా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ఎంచుకున్నారు. ఆమె గుజరాత్‌కు చెందిన 27ఏళ్ల శ్రుచి వదాలియా.. గుజరాత్‌లోని సూరత్ సిటీకి వెళ్లి అడిగితే ఎవరైనా ఈమె గురించి వివరిస్తారు. మరి ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 'చనిపోయేలోగా నేను నాటిన మొక్కల ద్వారా కొంతమేరకైనా వాయు కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటున్నట్లు' శ్రుచి వదాలియా పేర్కొంటున్నారు. శ్రుచి వదాలియాకు కొన్ని సంవత్సరాల క్రితం బ్రెయిన్ ట్యూమర్ సోకింది. ఇప్పుడామే తన జీవితంలో చివరి దశకు వచ్చేసింది.. అంటే కొన్ని రోజుల్లో ఈ లోకం విడిచివెళ్లనుంది. అయినా ఆమె ఏమాత్రం బెదరకుండా తాను చనిపోయేలోగా సమాజానికి తనవంతుగా ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించింది. తనకు బ్రెయిన్ ట్యూమర్ రావడానికి వాయు కాలుష్యం కూడా ఒక కారణమని భావించిన శ్రుచి వదాలియా తాను చనిపోయేలోగా వీలైనన్ని మొక్కలు నాటి ప్రమాదకర కాన్సర్‌తో పాటు, కొంతమేరైనా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చని నిర్ణయించుకొంది. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి మంచి చేయడంతో పాటు ప్రమాదకర కాన్సర్‌ను నివారించే అవకాశం ఉందని శ్రుచి పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు సంవత్సరాలలో 30వేలకు పైగా మొక్కలు నాటడమే గాక మిగతవారిని కూడా ఆ పని చేయమని ప్రోత్సహిస్తున్నారు. 'నేను చనిపోతానని నాకు తెలుసు. కానీ నేను పెంచే మొక్కల ద్వారా వచ్చే గాలిని పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు. నాలాగా ఎవరు ఈ వ్యాధికి గురవకూడదనేదే నా ప్రయత్నం. అందుకే వీలైనన్ని మొక్కలను పెంచి నా వంతుగా పర్యావరణానికి మేలు చేస్తున్నానని' శ్రుచి వదాలియా భావోద్వేగంతో తెలిపారు. శ్రుచి వదాలియా సూరత్‌లోని ప్రతీ పాఠశాలలకు తిరిగి ఒక్కో పిల్లాడి చేత మొక్కను నాటించి పర్యావరణాన్ని కాపాడే భాద్యతను ఎత్తుకున్నారు. -
తీరని విషాదం.. బంగారుతల్లి ఆఖరి మజిలీ..
సిడ్నీ : ఏ ఇంట్లోనైనా ఆడుతూపాడుతూ గెంతులుపెడుతుండే చిన్నారులను చూస్తుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. వారు ఒక్క క్షణం కనిపించకుంటే ప్రాణం తల్లడిల్లుతుంది. వారికి చిన్న ఆరోగ్యపరమైన సమస్య వస్తేనే తిరిగి ఎప్పుడు కోలుకుంటారా అని కంగారు ఉంటుంది. అలాంటిది ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లో జాకబ్ స్కారట్స్, టానియా మిల్లర్ దంపతులకు తీరని విషాదం ఎదురైంది. ముద్దుముద్దు మాటలతో ఆడుతూ పాడుతూ ప్రతి రోజు తమను మెప్పించే నాలుగేళ్ల పాప పైజీ కళ్లముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని తెలిసింది. ఆ పాప మెదడులో నిమ్మకాయ సైజులో కణితి ఉందని వైద్యులు చెప్పడంతో వారు హతాశులయ్యారు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా చివరకు ఆ పాప రెండు వారాలకంటే ఎక్కువ బతకదని చెప్పేశారు. దీంతో కుప్పకూలిన వారి తల్లిదండ్రులు ఆ తర్వాత తేరుకొని గుండె ధైర్యం చేసుకున్నారు. మరో వారం రోజులు మాత్రమే ఆ పాప బతికి ఉండేది. అంతకుముందు పాపకు ఏ సమస్యా లేన్నప్పుడు ప్రతిసారి వారి పెళ్లి రోజునాడు తాను ప్లవర్గర్ల్ అవుతానని, తండ్రికి, తల్లికి పెళ్లిదుస్తులు అలంకరిస్తానని పైజీ గోల చేస్తుండేది. తనకో రెండేళ్ల చెల్లెలు కూడా ఉంది. ఆ పాప కూడా తాను ప్లబర్ గర్ల్ అవుతానని మారం చేస్తుండేది. తల్లిదండ్రులు వచ్చే ఏడాది ఘనంగా వివాహ మహోత్సవం జరుపుకుందాం అని అనుకున్నారు. ప్రస్తుతం తమ బిడ్డ కన్ను మూస్తుందని తెలియడంతో ఆ పాప ఆఖరి కోరిక తీర్చాలని అనుకున్నారు. వెయ్యి డాలర్లు ఖర్చు చేసి అదే ఆస్పత్రిలో ఓ పక్క ఏడుస్తునే వివాహ వేడుకకు సిద్ధమయ్యారు. పైజీని కూడా ప్లవర్గర్ల్గా అలంకరించి ఆమెకు ఎదురుగా నిల్చొని సంతోషపెడుతూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. స్పృహ లేకుండా పడిఉన్న తమ కూతురుని ప్రేమగా నిమురుతూ ఏడుస్తూ 'పైజీ లేమ్మా.. మీకోసం వెడ్డింగ్ దుస్తుల్లో నేను మీనాన్న వచ్చామమ్మ' అని ఏడుస్తుంటే అక్కడి ఆస్పత్రి వాళ్లంతా కళ్లు చెమర్చారు. వాస్తవానికి అంతకుముందు చిన్న అనారోగ్య సమస్య కూడా పైజీకి ఉండేది కాదంట. అనూహ్యంగా జ్వరం వచ్చినట్లుగా రావడం, పరీక్షలు నిర్వహించడంతో అసలు విషయం తెలిసింది. చిన్నతనంలోనే గమనించి ఉంటే మెదడులోని కణితి తొలగించే అవకాశం ఉండేదని వైద్యులు చెబుతున్నారు. -
ఎయిమ్స్‌లో పరిస్థితి మరీ ఇంత దారుణమా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితికి అద్దం పట్టిన ఉదంతమిది. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న వృద్ధురాలికి అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించడానికి డాక్టర్లు ఇచ్చిన తేదీని చూస్తే ఎవరైనా అవాక్కవాల్సిందే. దాదాపు మూడేళ్ల తరువాత, ఫిబ్రవరి 20,2020వ సం.రంలో ఆపరేషన్ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఆసుపత్రిలో పడకలు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడంతో రోగి బంధువులు ఆందోళనలో పడిపోయారు. వివరాల్లోకి వెళితే..బీహార్ కు చెందిన రమారతిదేవి దేవి (65 ) బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో పట్నా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఎయిమ్స్ న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ కు రిఫర్ చేశారు. ఆమెను పరీక్షించిన ఎయిమ్స్ వైద్యులు అత్యవసర ఆపరేషన్ అంటూనే ఫిబ్రవరి 20, 2020న నిర్వహిస్తామని చెప్పారు. దీంతో ఆమె కొడుకు గులాబ్ థాకూర్ షాక్ లో వుండిపోయారు. తాము చాలా పేదవాళ్లమనీ, ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకునే స్థోమత లేదని గులాబ్ థాకూర్ వాపోయారు. 2020 సం.రం నాటికి అంటే చాలా ఆలస్యమవుతుందనీ, అనారోగ్యంతో తన తల్లి చనిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన తలనొప్పి, మెమరీ లాస్ తో బాధపడుతున్న అమ్మ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందనీ.. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని కోరుతున్నారు. అయితే రోగుల రద్దీ అంత తీవ్రంగా ఉండడం వల్లే ఈనిర్ణయం తీసుకున్నామని న్యూరోసర్జరీ విభాగం అధిపతి డాక్టర్ బి.ఎస్. శర్మచెప్పారు. సాధారణంగా పరిస్థితి తీవ్రతను ఆధారంగా తేదీలు ఇస్తామని, కొన్నిసార్లు ఆసుపత్రిలో బెడ్ ల కొరత కారణంగా ఈ వెయింటింగ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. చాలా అత్యవసర ఉంటే శస్త్రచికిత్స లకు మొదటి ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. -
బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో కొత్త మందు
న్యూయార్క్: మెదడులో కణితిలు వ్యాపించకుండా సమర్థవంతంగా నిరోధించే కొత్త ఔషధం పీపీఎఫ్‌ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మెదడు కణాలలోని టీఆర్ఓవై అనే ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మందు పనిచేస్తుంది. ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో పీపీఎఫ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ట్రాన్సిషనల్ జినోమిక్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. మెదడులోని క్యాన్సర్‌కు గురైన గ్లియోబ్లాస్టోమా కణాలలోని ప్రొటీన్లను నశింపచేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో వాడే కీమోథెరపీతో పాటు రేడియోథెరపి విధానాలకు ఈ ఔషధం సహాయకారిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. పరిశోధనకు సంబంధించిన వివరాలను సీనియర్ రచయిత నెహన్ ట్రాన్ వెల్లడిస్తూ.. క్యాన్సర్ కణాలను నిస్సహాయంగా మార్చడంలో పీపీఎఫ్ ఔషధం విజయవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. మెదడులోని క్యాన్సర్ బారిన పడిన కణాలు వ్యాపించకుండా పీపీఎఫ్ పనిచేయడం వలన చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. -
మగాళ్లకే బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు వస్తాయి?
సాధారణంగా ఆడవాళ్లకన్నా మగవారికే బ్రెయిన్ ట్యూమర్లు ఎక్కువ వస్తాయి. దీనికి కారణం మగవాళ్లలో క్యాన్సర్ నిరోధక ప్రొటీన్ లోపమేనంటున్నారు శాస్త్రవేత్తలు. వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో క్యాన్సర్ ను నిరోధించే రిటినో బ్లాస్టోమా ప్రొటీన్ మగవారిలో తక్కువగా ఉంటుందని తేలింది. మగవారి మెదడు కణాల్లో ఈ ప్రోటీన్ తక్కువగా ఉంటుందట. దీని వల్లే వారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఈ ప్రోటీన్ లేనందున మగపేషంట్ల చికిత్స కూడా అంత ప్రభావాత్మకంగా ఉండదంటున్నారు నిపుణులు. ఆడవారిలో ఈ ప్రోటీన్ ను నిరోధిస్తే వారిలోనూ మెదడు క్యాన్సర్ కలుగుతుందని కూడా వారు కనుగొన్నారు. ఇప్పుడు లింగ భేదాలను కలుగజేసే సెక్స్ హార్మోన్ల పనితీరుకి ఈ ప్రోటీన్ లభ్యతకి మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.