సిడ్నీ : ఏ ఇంట్లోనైనా ఆడుతూపాడుతూ గెంతులుపెడుతుండే చిన్నారులను చూస్తుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. వారు ఒక్క క్షణం కనిపించకుంటే ప్రాణం తల్లడిల్లుతుంది. వారికి చిన్న ఆరోగ్యపరమైన సమస్య వస్తేనే తిరిగి ఎప్పుడు కోలుకుంటారా అని కంగారు ఉంటుంది. అలాంటిది ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లో జాకబ్ స్కారట్స్, టానియా మిల్లర్ దంపతులకు తీరని విషాదం ఎదురైంది. ముద్దుముద్దు మాటలతో ఆడుతూ పాడుతూ ప్రతి రోజు తమను మెప్పించే నాలుగేళ్ల పాప పైజీ కళ్లముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని తెలిసింది. ఆ పాప మెదడులో నిమ్మకాయ సైజులో కణితి ఉందని వైద్యులు చెప్పడంతో వారు హతాశులయ్యారు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా చివరకు ఆ పాప రెండు వారాలకంటే ఎక్కువ బతకదని చెప్పేశారు. దీంతో కుప్పకూలిన వారి తల్లిదండ్రులు ఆ తర్వాత తేరుకొని గుండె ధైర్యం చేసుకున్నారు. మరో వారం రోజులు మాత్రమే ఆ పాప బతికి ఉండేది.
అంతకుముందు పాపకు ఏ సమస్యా లేన్నప్పుడు ప్రతిసారి వారి పెళ్లి రోజునాడు తాను ప్లవర్‌గర్ల్ అవుతానని, తండ్రికి, తల్లికి పెళ్లిదుస్తులు అలంకరిస్తానని పైజీ గోల చేస్తుండేది. తనకో రెండేళ్ల చెల్లెలు కూడా ఉంది. ఆ పాప కూడా తాను ప్లబర్ గర్ల్ అవుతానని మారం చేస్తుండేది. తల్లిదండ్రులు వచ్చే ఏడాది ఘనంగా వివాహ మహోత్సవం జరుపుకుందాం అని అనుకున్నారు. ప్రస్తుతం తమ బిడ్డ కన్ను మూస్తుందని తెలియడంతో ఆ పాప ఆఖరి కోరిక తీర్చాలని అనుకున్నారు. వెయ్యి డాలర్లు ఖర్చు చేసి అదే ఆస్పత్రిలో ఓ పక్క ఏడుస్తునే వివాహ వేడుకకు సిద్ధమయ్యారు. పైజీని కూడా ప్లవర్‌గర్ల్‌గా అలంకరించి ఆమెకు ఎదురుగా నిల్చొని సంతోషపెడుతూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. స్పృహ లేకుండా పడిఉన్న తమ కూతురుని ప్రేమగా నిమురుతూ ఏడుస్తూ 'పైజీ లేమ్మా.. మీకోసం వెడ్డింగ్ దుస్తుల్లో నేను మీనాన్న వచ్చామమ్మ' అని ఏడుస్తుంటే అక్కడి ఆస్పత్రి వాళ్లంతా కళ్లు చెమర్చారు. వాస్తవానికి అంతకుముందు చిన్న అనారోగ్య సమస్య కూడా పైజీకి ఉండేది కాదంట. అనూహ్యంగా జ్వరం వచ్చినట్లుగా రావడం, పరీక్షలు నిర్వహించడంతో అసలు విషయం తెలిసింది. చిన్నతనంలోనే గమనించి ఉంటే మెదడులోని కణితి తొలగించే అవకాశం ఉండేదని వైద్యులు చెబుతున్నారు.
తీరని విషాదం.. బంగారుతల్లి ఆఖరి మజిలీ..
Published Mon, Oct 9 2017 7:33 PM | Last Updated on Mon, Oct 9 2017 7:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment