అమెరికన్ బిలియనీర్, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి, పరపతి కొనుగోళ్లలో అగ్రగామిగా పేరుగాంచిన థామస్ లీ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 23) తన మాన్‌హట్టన్ కార్యాలయంలో 78 ఏళ్ల వయస్సులో థామస్ లీ ఆత్మహత్య చేసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది.
ఫిఫ్త్ అవెన్యూ మాన్‌హట్టన్‌లోని తన ప్రధాన కార్యాలయం థామస్‌లీ చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. తనను తాను తుపాకీ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
లీ ఈక్విటీ సంస్థకు చైర్మన్ అయిన థామస్‌లీ ఆ సంస్థను 2006లో స్థాపించారు. అలాగే 1974లో స్థాపించిన థామస్ హెచ్ లీ పార్ట్‌నర్స్ సంస్థకు గతంలో చైర్మన్‌గా, సీఈవోగా పనిచేశారు. ది లింకన్ సెంటర్, ది మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్, హార్వర్డ్ యూనివర్సిటీ, బ్రాండీస్ విశ్వవిద్యాలయం, మ్యూజియం ఆఫ్ జ్యూయిష్ హెరిటేజ్ వంటి వాటిలో ట్రస్టీగా, బోర్డ్ సభ్యుడిగా సేవలు అందించారు.
(ఇదీ చదవండి: ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు..? ఐటీ కంపెనీ ఫ్రెషర్ల ఆవేదన)
థామస్‌లీ గత 46 సంవత్సరాలుగా వార్నర్ మ్యూజిక్ స్నాపిల్ బెవరేజెస్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌ల కొనుగోలు, ఆ తర్వాత అమ్మకాలతో సహా వందలాది డీల్స్‌లో 15 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు.
(ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment