అమెరికన్ వ్యాపారవేత్త డార్విన్ డీసన్‌కు చెందిన లా జోల్లా ఎస్టేట్ 'ది శాండ్‌కాజిల్' రికార్డ్ ధరకు అమ్మకానికి వచ్చింది. 108 మిలియన్ డాలర్లు (సుమారు రూ.907 కోట్లు)కు లిస్టయింది. ఇది శాన్ డియాగో కౌంటీ రియల్ ఎస్టేట్‌కు రికార్డ్-బ్రేకింగ్ ధర.
లిస్టింగ్‌లో పెట్టిన ధరకు అమ్ముడుపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో డెల్ మార్ ఓషన్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన బిలియనీర్ ఎగాన్ డర్బన్ పేరిట ఉన్న 44 మిలియన్ డాలర్ల ప్రస్తుత రికార్డును ఇది అధిగమిస్తుంది. అఫ్లియేటెడ్ కంప్యూటర్ సర్వీసెస్ (తర్వాత జిరాక్స్ సంస్థకు విక్రయించారు) స్థాపకుడు డార్విన్ డీసన్ 2009లో ఈ ఎస్టేట్‌ను, దాని పక్కనున్న స్థలాన్ని 26 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తర్వాత దాని నిర్మాణం కోసం 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.
దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఎలివేటెడ్ బీచ్‌ను కలిగి ఉంది. అలనాటి ఐరోపా శైలిలో బంగారు పరదాలు, పాలరాతి ఫ్లోర్‌లు, ఆకృతులతో ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ ప్రముఖులు, రాజ కుటుంబాల ఇళ్లకు డిజైన్ చేసిన ప్రఖ్యాత డిజైనర్ తిమోతీ కొరిగాన్ ఈ భవనానికి ఇంటీరియర్‌లను రూపొందించారు.
ఇందులోని ఫర్నిచర్ ఫ్రెంచ్ సొగసుతో ఆకట్టుకుంటుంది. 16 మంది కూర్చునేందుకు వీలుగా రాజసమైన డైనింగ్ రూం, నాటికల్ నేపథ్యంతో తీర్చిదిద్దిన బార్ ఇందులో ఉన్నాయి. ఇక భవనం లోగిలిలో ఒక పూల్, ఫిట్‌నెస్ సెంటర్, చైనా స్లేట్ రూఫ్ టైల్స్‌తో కూడిన బీచ్ ఫ్రంట్ బోట్‌హౌస్ ఉన్నాయి. అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ సిగ్నేచర్ వైట్ షేడ్ లాంటి లుక్ కోసం 40 వేల డాలర్లతో దిగుమతి చేసుకున్న ఇసుక ఈ భవనానికి వినిగియోగించారు. ఇంత విలాసవంతంగా భవనం నిర్మించుకున్నప్పటికీ దీన్ని పెద్దగా ఉపయోగించలేదని డీసన్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment