కేరళలోని కొట్టాయంకు చెందిన రైతు వి.ఎ. థామస్ 8 ఏళ్ల క్రితం రబ్బర్ సాగుకు స్వస్తి చెప్పారు. 70 ఏళ్ల వయసులో రసాయనిక వ్యవసాయం వదిలి సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. ఇంత వరకే అయితే పెద్ద విశేషం లేదు. కొట్టాయం దగ్గర్లోని చక్కంపుఝ గ్రామంలోని తమ 5 ఎకరాల కుటుంబ క్షేత్రాన్ని 400 రకాల పనస చెట్లతో జీవవైవిధ్యానికి చెరగని చిరునామాగా మార్చారు థామస్. బడ్ గ్రాఫ్టింగ్ లేదా బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ కొత్త రకాలను సృష్టిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పనస తొనలను రుచి చూస్తారు. నచ్చిన రకాల మొక్కల్ని వెంట తెచ్చి నాటుకుంటారు. రెండేళ్లు, ఏడాదిన్నరలోనే కాపుకొచ్చే వియత్నాం, కంబోడియాల నుంచి కూడా కొన్ని పనస రకాలను సేకరించారు. మొక్కలతో పాటు ఎండబెట్టిన పనస తొనలను అమ్ముతూ ఎకరానికి ఏటా రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఎండబెట్టిన పచ్చి పనస కాయలను కిలో రూ. వెయ్యి. ఎండబెట్టిన పనస పండ్లను కిలో రూ. 2 వేలకు అమ్ముతుండటం విశేషం!
ఇవి కూడా చదవండి: ‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%!
Comments
Please login to add a commentAdd a comment