graft
-
బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం!
కేరళలోని కొట్టాయంకు చెందిన రైతు వి.ఎ. థామస్ 8 ఏళ్ల క్రితం రబ్బర్ సాగుకు స్వస్తి చెప్పారు. 70 ఏళ్ల వయసులో రసాయనిక వ్యవసాయం వదిలి సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. ఇంత వరకే అయితే పెద్ద విశేషం లేదు. కొట్టాయం దగ్గర్లోని చక్కంపుఝ గ్రామంలోని తమ 5 ఎకరాల కుటుంబ క్షేత్రాన్ని 400 రకాల పనస చెట్లతో జీవవైవిధ్యానికి చెరగని చిరునామాగా మార్చారు థామస్. బడ్ గ్రాఫ్టింగ్ లేదా బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ కొత్త రకాలను సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పనస తొనలను రుచి చూస్తారు. నచ్చిన రకాల మొక్కల్ని వెంట తెచ్చి నాటుకుంటారు. రెండేళ్లు, ఏడాదిన్నరలోనే కాపుకొచ్చే వియత్నాం, కంబోడియాల నుంచి కూడా కొన్ని పనస రకాలను సేకరించారు. మొక్కలతో పాటు ఎండబెట్టిన పనస తొనలను అమ్ముతూ ఎకరానికి ఏటా రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఎండబెట్టిన పచ్చి పనస కాయలను కిలో రూ. వెయ్యి. ఎండబెట్టిన పనస పండ్లను కిలో రూ. 2 వేలకు అమ్ముతుండటం విశేషం! ఇవి కూడా చదవండి: ‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%! -
మాజీ ప్రధానమంత్రికి బెయిల్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలేదా జియాకు లంచం కేసులో బెయిల్ లభించింది. జియా అనాథశరణాలయం ట్రస్ట్‌లో దాదాపు ఇరవై ఒక్క కోట్ల టాకా(బంగ్లా కరెన్సీ)ల దుర్వినియోగం జరిగిందని 2008లో ఆమెతోపాటు ఆమె కుమారుడు తారిఖ్ రెహ్మాన్ పై కేసులు నమోదయ్యాయి. పలు అవకతకలకు సంబంధించి ఖలేదా జియాపై 37 కేసులున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఆమె ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీటిపై ఢాకా హైకోర్టు ప్రత్యేక బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఖలేదా పెట్టుకున్న వినతిని పరిశీలించిన న్యాయస్థానం...ఆమెకు పర్మినెంట్ బెయిల్‌ను ఎందుకు మంజూరు చేయరాదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆమె బెయిల్‌ను దుర్వినియోగం చేశారా అని అడిగింది. అనంతరం పర్మినెంట్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ కేసుతో సంబంధమున్న ఖలేదా కుమారుడితోపాటు మరో నలుగురు బెయిల్‌పై బయటకు వచ్చి కనిపించకుండా పోయారని ప్రభుత్వం తెలిపింది. -
ఆ విషయంలో మనమే టాప్!
బెర్లిన్/న్యూఢిల్లీ: ప్రభుత్వాలు మారినా, అధికారం చేతులు మారుతున్నా ఇండియాలో అవినీతి రేటు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బల్లకింద చేతులు పెట్టే ఆనవాయితీకి అడ్డుకట్ట పడడం లేదు. ఆసియా పసిఫిక్ లో అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచిందని తాజా సర్వే వెల్లడించింది. ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చామని మూడింట రెండొంతుల మంది భారతీయులు చెప్పారని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక సంస్థ 'ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్' నిర్వహించిన సర్వే తెలిపింది. అమ్యామ్యాలు సమర్పించుకున్నామని భారత్ లో 69 శాతం మంది చెప్పారు. ఇండియా తర్వాతి స్థానంలో వియత్నాం నిలిచింది. లంచాలు ఇచ్చామని వియత్నాంలో 65 శాతం మంది వెల్లడించారు. పాకిస్థాన్ లో 40 శాతం, చైనాలో 26 శాతం మంది లంచాలు ఇచ్చినట్టు తెలిపారు. జపాన్ అతి తక్కువగా 0.2 శాతం మంది మాత్రమే లంచాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. గత సంవత్సర కాలంతో పోలిస్తే చైనాలో 73 శాతం అవినీతి పెరిగిందని సర్వే అంచనా వేసింది. 16 దేశాల్లో 20 వేల మంది అభిప్రాయాలతో సర్వే నిర్వహించారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో 90 కోట్ల మంది గత సంవత్సర కాలంలో కనీసం ఒక్కసారైనా లంచం ఇచ్చారని ఈ సర్వే అంచనా వేసింది. లంచాలు తీసుకోవడంతో పోలీసులు అందరి కంటే ముందున్నారని వెల్లడించింది. 'అవినీతిని అంతం చేయడానికి ప్రభుత్వాలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముంది. మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ సేవలకు లంచాలు సమర్పించుకుంటున్నారు. అవినీతి కారణంగా ఎక్కువగా పేదలే నష్టపోతున్నార'ని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అధిపతి జోస్ ఉగాజ్ పేర్కొన్నారు. -
అవినీతి ఫిర్యాదులకు ఒకే నంబర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అవినీతిపై ఫిర్యాదులను స్వీకరించడానికి ఒకే ఫోన్ నంబరుతో నిరంతరాయంగా పనిచేసే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐ భావిస్తోంది. ఫిర్యాదును స్వీకరించిన అనంతరం అది కేంద్ర పరిధిలోకి వచ్చే సంస్థల్లో అవినీతికి సంబంధించినది అయితే సీబీఐ సొంతంగా విచారణ చేపడుతుంది. రాష్ట్ర విభాగాలకు చెందిన ఫిర్యాదు అయితే సంబంధిత రాష్ట్రంలోని అవినీతి నిరోధక విభాగాలకు చేరవేస్తుంది. అనంతరం వాటి పురోగతినీ తెలుసుకుంటూ ఉంటుంది. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా ఈ–మెయిళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇందులో స్వీకరిస్తారు. -
ప్రధాని మోదీకి శివసేన చురక
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీపై మిత్రపక్షం శివసేన మరోసారి విరుచుకుపడింది. విదేశాల్లో దేశం పరువు తీయొద్దని ఆయనకు హితవు పలికింది. దేశంలోని అవినీతి గురించి అదేపనిగా ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ అవినీతి దేశమని పదేపదే ప్రస్తావించొద్దని, ఇలాంటి ప్రకటనలతో మున్ముందు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. 'భారత్ లో అవినీతి ఎలా పెరిగిపోయింది, అవినీతిని రూపుమాపేందుకు తాము చేపడుతున్న చర్యలు గురించి దోహలో బహిరంగంగా ప్రధాని మోదీ వివరించారు. ఆయన మాటలకు సభికులు హర్షధ్వానాలు చేశారు. విదేశీ గడ్డపై భారత్ ప్రటిష్ఠను మంటగలిపార'ని పార్టీ పత్రిక 'సామ్నా'లో శివసేన విమర్శించింది. అవినీతి పెరిగిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించింది. బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా అవినీతి ఎందుకు తగ్గలేదని శివసేన ప్రశ్నించింది. అవినీతి గురించి గొంతు చించుకోవడానికి యూరప్, అమెరికా వెళ్లాల్సిన పని లేదని చురక అంటించింది. మాటలు కట్టిపెట్టి అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. -
లంచం ఇవ్వచూపినందుకు మూడేళ్ల జైలు
దుబాయ్: లంచం ఇవ్వచూపినందుకు భారతీయుడొకరు దుబాయ్ లో జైలుపాలయ్యారు. అతడికి దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడి వయసు 43 ఏళ్లు అని, అతడి పేరును ఏఎన్ఎన్ గా స్థానిక మీడియా పేర్కొంది. తన కుటుంబ సభ్యులకు వీసా కోసం యూఏఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నేచురలైజేషన్ అండ్ ఫారినర్స్ అఫైర్స్(జీడీఎన్‌ఎఫ్) అధికారికి 10 వేల దిర్హామ్(సుమారు రూ.1.72 లక్షలు)ల లంచం ఇవ్వచూపినందుకు నిందితుడికి జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలని అతడిని కోర్టు ఆదేశించింది.