మాజీ ప్రధానమంత్రికి బెయిల్‌ | Former Bangladesh Prime Minister Khaleda Zia gets permanent bail in graft charges | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధానమంత్రికి బెయిల్‌

Published Wed, Aug 9 2017 7:34 PM | Last Updated on Mon, Sep 11 2017 11:41 PM

Former Bangladesh Prime Minister Khaleda Zia gets permanent bail in graft charges

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి ఖలేదా జియాకు లంచం కేసులో బెయిల్‌ లభించింది. జియా అనాథశరణాలయం ట్రస్ట్‌లో దాదాపు ఇరవై ఒక్క కోట్ల టాకా(బంగ్లా కరెన్సీ)ల దుర్వినియోగం జరిగిందని 2008లో ఆమెతోపాటు ఆమె కుమారుడు తారిఖ్‌ రెహ్మాన్ పై కేసులు నమోదయ్యాయి. పలు అవకతకలకు సంబంధించి ఖలేదా జియాపై 37 కేసులున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఆమె ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీటిపై ఢాకా హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ బుధవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ఖలేదా పెట్టుకున్న వినతిని పరిశీలించిన న్యాయస్థానం...ఆమెకు పర్మినెంట్‌ బెయిల్‌ను ఎందుకు మంజూరు చేయరాదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆమె బెయిల్‌ను దుర్వినియోగం చేశారా అని అడిగింది. అనంతరం పర్మినెంట్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ కేసుతో సంబంధమున్న ఖలేదా కుమారుడితోపాటు మరో నలుగురు బెయిల్‌పై బయటకు వచ్చి కనిపించకుండా పోయారని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement