మాజీ ప్రధానికి అరెస్ట్ వారంట్ | Bangladesh issues arrest warrant for Khaleda Zia | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధానికి అరెస్ట్ వారంట్

Published Wed, Mar 30 2016 9:24 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

మాజీ ప్రధానికి అరెస్ట్ వారంట్

మాజీ ప్రధానికి అరెస్ట్ వారంట్

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత బేగం ఖలేదా జియాకు ఆ దేశ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతేడాది ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు జరిగిన సమయంలో ఓ బస్సుకు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వ్యవహారంలో మాజీ ప్రధానికి బెయిల్ వచ్చే అవకాశముందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.

బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ఏడాది జనవరిలో బంగ్లా నేషనల్‌ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలో ఓ బస్సుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement