Khaleda Zia
-
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాట్లు.. తెరపైకి ఆ ముగ్గురి పేర్లు
తీవ్ర నిరసనలు, అట్టుడికిన అల్లర్లలో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉన్నపళంగా దేశం వీడాల్సి వచ్చింది. రాజకీయ సంక్షోభం నెలకొన్న బంగ్లాలో ప్రస్తుతం దేశ పాలన సైన్యం నియంత్రణలోకి తీసుకుంది. నిరసన కారులను శాంతిపజేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు దేశ ఆర్మీ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ సలహాలతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో పాటు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆ తాత్కాలిక ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆలస్యంగా తన సమ్మతిని తెలిపారు.తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హసీనా రాజకీయ విరోధి, మాజీ ప్రధాని ఖలీదా జియా. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్, విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లాం. ఖలీదా జియా.. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై 2018 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు రాష్ట్రపతి ఆదేశించారు. అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకున్న వెంటనే ఈమేరకు దేశాధ్యక్షుడి నుంచి ఆదేశాలు వెలువడటం గమనార్హం. ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రస్తుతం దేశంలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంది.ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. అలాగే దేశ తొలి మహిళా ప్రధాని. 1991 నుంచి 1996, 2001 నుంచి 2006 వరకు రెండు సార్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేశారు. ఖలీదా 1996లో రెండవసారి పీఎంగా గెలిచినప్పటికీ షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌తో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించి ఖండించాయి. దీంతో ఆమె రెండవ పదవీకాలం 12 రోజులు మాత్రమే కొనసాగింది. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నికలు నిర్వహించగా.. హసీనా ప్రధానిగా గెలుపొందారు.2007లో ఖలీదా అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. 2018లో దోషిగా నిర్ధారించడంతో జైలు శిక్ష పడింది. అనేక ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువ కాలం ఆమె ఆసుపత్రిలోనే గడిపారు. మరి ఈ సమయంలో విడుదలవుతున్న ఖలీదా ప్రధానమంత్రి పదవిని చేపడతారా లేదా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 78 ఏళ్లు. మహమ్మద్ యూనస్.. అతను 1983లో గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించాడు. బంగ్లాదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి బ్యాంక్ చిన్న మొత్తంలో రుణాలను (రూ 2,000 వరకు) అందిస్తుంది. ఇది లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడటానికి సహాయపడుతోంది. అందుకే యూనస్‌కు ి 'పేదలకు బ్యాంకర్' అనే మారుపేరు వచ్చింది. ఈ మోడల్ ఇప్పుడు 100 కంటే ఎక్కువ దేశాలలో కొనసాగుతోంది.బంగ్లాదేశ్‌లో కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న మైక్రోఫైనాన్స్ సంస్థ అయిన గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అయితే యూనస్‌పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. జూన్‌లో తన టెలికాం కంపెనీ అయినా గ్రామీణ టెలికాం సంబంధించిన కార్మికుల సంక్షేమ నిధి నుంచి 252.2 మిలియన్ టాకా (రూ. 219.4 కోట్లు) నిధుల దుర్వినియోగం చేసిన ఆరోపణలపై అభియోగాలు మోపారు. కానీ తనపై అభియోగాలు రాజకీయ ప్రోద్బలంతో మోపారని ఆరోపించారు.జనవరిలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాడు.అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక షేక్ హసీనా రాజీనామా తర్వాత అధికారాన్ని కైవసం చేసుకునేందుకు షేక్ హసీనా ప్రత్యర్థులు పెనుగులాడుతుండగా.. విద్యార్థులు మాత్రం యూనస్‌ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. ఆర్మీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు విద్యార్ధులు అంగీకరించడం లేదు.నహీద్ ఇస్లాం..26 ఏళ్ల నహీద్ ఇస్లాం సోషియాలజీ విద్యార్థి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశాడు. ఈ కోటా విధానంలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ విద్యార్ధుల ఉద్యమానికి జాతీయ సమన్వయకర్తగా పనిచేశారు. చివరకు హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేతకు దారి తీసిన నేత ఇస్లాం.జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహిద్ ఇస్లామ్‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అతని కళ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి వేధించారు. రెండు రోజుల తర్వాత పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మరోసారి కూడా అతన్ని కిడ్నాప్ చేశారు. గోనోసహస్త్య నగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో.. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్, హా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన వ్యక్తులుగా చెప్పుకునే కొందరు అతన్ని అపహరించారు. కానీ నహిద్‌ను తాము ఎత్తుకెళ్లలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు వెల్లడించారు. -
మరణశయ్యపై ఖలీదా జియా!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు సరైన వైద్య అందించకుండా ఆమెపై ప్రధాని షేక్ హసీనా పగ తీర్చుకుంటున్నారని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆరోపించింది. ఖలీదా ‘మరణశయ్య’పై ఉన్నారని, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆ పార్టీ సెక్రటరీ జేనరల్ ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ ఆదివారం తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న 78 ఏళ్ల ఖలీదా జియా శనివారం రాత్రి తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, వెంటనే అంబులెన్స్‌లో ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన ఖలీదా ఓ అవినీతి కేసులో జైలు పాలయ్యారు. అయితే జియా ఓల్డ్ ఢాకా సెంట్రల్ జైల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు సరైన వైద్యం అందలేదని అలంగీర్ ఆరోపించారు. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉండటానికి అనుమతించినప్పటికీ పూర్తి నిర్బంధంలో జైలులాంటి జీవితాన్నే అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖలీదాకు విదేశాల్లో చికిత్స అవసరమని మెడికల్ బోర్డు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందకుండా చంపేసి, రాజకీయంగా అడ్డు తొలగంచుకోవాలని ప్రధాని షేక్ హసీనా చూస్తున్నారని అలంగీర్ ఆరోపించారు. -
బంగ్లా మాజీ ప్రధానికి మరో ఎదురు దెబ్బ
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(72)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న ఆమెకు అధికార దుర్వినియోగం కేసులో జైలు శిక్ష ఖరారైంది. బంగ్లాదేశ్ రాజధానిలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఖలేదాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జియా తన భర్త పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థకోసం అక్రమంగా నిధులను సేకరించిన ఆరోపణలనువిచారించిన కోర్టు సోమవారం ఈ తీర్పునిచ్చింది. మాజీ ప్రధానితోపాటు హారిస్ చౌదరి సహా మరో ముగ్గురికి కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పది లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. ఢాకాలోని జియా చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ కోసం 375 వేల డాలర్ల గుప్త విరాళాలను సేకరించడంలో ప్రధానమంత్రిగా ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జడ్జి వ్యాఖ్యనించారు. కాగా విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున జియా కోర్టుకు హాజరు కాలేదు. మరోవైపు రెండు కేసులకు సంబంధించిన ఆరోపణలను ఖలీదా జియా పార్టీ ఖండించింది. రాజకీయ కుట్రగా అభివర్ణించింది. -
బ్రిటన్ ఎంపీ వీసా రద్దు
న్యూఢిల్లీ: బ్రిటన్ ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా లాయర్ అయిన లార్డ్ అలెగ్జాండర్ కార్లైల్ వీసాను భారతప్రభుత్వం రద్దు చేసింది. మీడియా సమావేశం ద్వారా భారత్–బంగ్లా సంబంధాల్లో సమస్యలను సృష్టించాలని చూస్తున్నారనే కారణాలతో గత రాత్రి బ్రిటన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కార్లైల్‌ను వెనక్కి పంపించింది. ‘కార్లైల్ మీడియా సమావేశంలో మాట్లాడటం వీసా నిబంధనలకు విరుద్ధం. రాజకీయ కార్యకలాపాలకు పాల్పడే వారికి ఏ దేశమూ వీసా ఇవ్వదు. ఆయనకు జారీ చేసిన బిజినెస్ వీసాతో మీడియా సమావేశం నిర్వహించరాదు. మూడో దేశానికి సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడేందుకు ఓ విదేశీయుడిని భారత్ ఎలా అనుమతిస్తుంది?’ అని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
బ్రిటీష్ ఎంపీని వెనక్కి పంపిన భారత్
న్యూఢిల్లీ : బ్రిటీష్ పార్లమెంటేరియన్ లార్డ్ అలెగ్జాండర్ కార్లిలేను ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు భారత్‌లోకి అనుమతించలేదు. సరైన వీసా పత్రాలు లేని కారణంగా ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని తిరిగి వెనక్కి పంపించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. కార్లిలే పర్యటన ఉద్దేశం, అతను వీసాలో సమర్పించిన వివరాలు వేర్వేరుగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో అతన్ని తిరిగి ఇంగ్లండ్ పంపించామన్నారు. కార్లీలే ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు న్యాయ సలహాదారునిగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ అవినీతి కేసులో బంగ్లా కోర్టు ఆమెకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె న్యాయ సలహాదారుడిగా ఉన్న కార్లిలేను బంగ్లాదేశ్‌లోని రానివ్వబోమని ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయన జియాకు మద్దతుగా ఇండియాలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు గతంలోనే తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయ మీడియాకు జియా కేసులోని వాస్తవాలను వివరిస్తానని కూడా అన్నారు. కానీ వీసాలో పర్యటన ఉద్దేశాని వేరే విధంగా పేర్కొనడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
బంగ్లా మాజీ ప్రధాని జియాకు జైలు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియా(72)కు ఓ అవినీతి కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. దీంతో డిసెంబర్లో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆమె అనర్హతకు గురయ్యే వీలుంది. తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అనాథ శరణాలయానికి సేకరించిన విదేశీ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు గురువారం ఈ తీర్పు వెలువరించింది. జియా కొడుకు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తారిక్‌నూ దోషిగా తేల్చిన కోర్టు..ఆయనతో పాటు మరో నలుగురికి 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం తారిక్ లండన్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. దోషులందరికి ఈ కేసులో సమాన పాత్ర ఉన్నా జియా వయసు, సమాజంలో ఉన్న గౌరవం రీత్యా ఆమెకు కాస్త తక్కువ శిక్ష విధిస్తున్నట్లు జడ్జి మహ్మద్ అక్తారుజ్జమాన్ తన తీర్పు ప్రతిలో పేర్కొన్నారు. తాజా తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని జియా తరఫు లాయర్ వెల్లడించారు. తీర్పు రాగానే జియా మద్దతుదారులు, అభిమానులు ఆందోళనలకు దిగి ఢాకాలో పలుచోట్ల హింసకు పాల్పడ్డారు. కోర్టు బయట గుమిగూడిన ఆందోళనకారులను చెదరగొట్టడం పోలీసులకు కష్టమైంది. భారీ భద్రత నడుమ జియాను కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రతిపక్ష బీఎన్పీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్న ఆమె.. మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. కాగా, అంతకు ముందు జియా తన మద్దతుదారులు, బంధువులకు ధైర్యవచనాలు చెప్పి కోర్టుకు బయల్దేరారు. ‘మీరేం భయపడకండి. ధైర్యంగా ఉండండి. నేను క్షేమంగా తిరిగొస్తా’ అని ఆమె అన్నారు. జియా గతంలో చేసిన పాపాలకు ఫలితంగానే ఈ శిక్ష పడిందని ఆమె ప్రధాన ప్రత్యర్థి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. -
మాజీ ప్రధానమంత్రికి బెయిల్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలేదా జియాకు లంచం కేసులో బెయిల్ లభించింది. జియా అనాథశరణాలయం ట్రస్ట్‌లో దాదాపు ఇరవై ఒక్క కోట్ల టాకా(బంగ్లా కరెన్సీ)ల దుర్వినియోగం జరిగిందని 2008లో ఆమెతోపాటు ఆమె కుమారుడు తారిఖ్ రెహ్మాన్ పై కేసులు నమోదయ్యాయి. పలు అవకతకలకు సంబంధించి ఖలేదా జియాపై 37 కేసులున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఆమె ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీటిపై ఢాకా హైకోర్టు ప్రత్యేక బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఖలేదా పెట్టుకున్న వినతిని పరిశీలించిన న్యాయస్థానం...ఆమెకు పర్మినెంట్ బెయిల్‌ను ఎందుకు మంజూరు చేయరాదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆమె బెయిల్‌ను దుర్వినియోగం చేశారా అని అడిగింది. అనంతరం పర్మినెంట్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ కేసుతో సంబంధమున్న ఖలేదా కుమారుడితోపాటు మరో నలుగురు బెయిల్‌పై బయటకు వచ్చి కనిపించకుండా పోయారని ప్రభుత్వం తెలిపింది. -
మాజీ ప్రధాని కుమారుడికి ఏడేళ్ల జైలు శిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ మాజీప్రధాని, ప్రతిపక్ష నేత ఖలీదా జియా కుమారునికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మనీలాండరింగ్ కేసులో శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తారీఖ్ రహ్మాన్(51)li నిర్దోషిగా భావిస్తూ దిగువ కోర్టు 2013లో ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. తల్లి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తారీఖ్ తన స్నేహితుడు గియాసుద్దీన్ మామమ్ కు 200 మిలియన్ టకాల (2.5 మిలియన్ డాలర్లు) విలువ చేసే కాంట్రాక్టును అక్రమంగా ఇప్పించాడు.. ఇందుకు ప్రతిగా తారీఖ్ కు సింగపూర్ బ్యాంకు ఖాతాలో గియాసుద్దీన్ 45 మిలియన్ల టాకాలను జమచేశాడని కోర్టు నిర్ధారించింది. దీంతో తారీఖ్ కు 200 మిలియన్ టకాలను ఫైన్ విధిస్తూ.. ఏడేళ్ల జైలుశిక్షను కోర్టు విధించింది. దీనిపై బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్ పీ) స్పందించడానికి నిరాకరించింది. మనీ లాండరింగ్ అంటే... ఈ మధ్య తరచు మనీ ల్యాండరింగ్ గురించి వింటూనే ఉన్నాం. మనీ ల్యాండరింగ్ అంటే అక్రమంగా (చట్టానికి లోబడి) కాకుండా డబ్బు సంపాదించి.. దాన్ని విదేశీ బ్యాంకులకు తరలించి దాచి పెట్టుకోవడం. -
సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
ఢాకా: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ ఖలీద జియా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు చెందిన స్వచ్ఛంద సంస్థ జియా చారిటబుల్ ట్రస్ట్ నిధుల విషయంలో లంఛాలకు పాల్పడినట్లు చేస్తున్న కేసుపై స్టే విధించాలంటూ ఆమె రెండు పిటిషన్లు వేశారు. అంతకుముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఆమె ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై వచ్చే వారం విచారణ జరగనుంది. కోట్లలో ఆమె అవినీతికి పాల్పడినట్లు యాంటి కరప్షన్ కమిషన్(ఏసీసీ) 2010లో కేసు నమోదుచేసింది. -
చిక్కుల్లో మాజీ ప్రధాని
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అధ్యక్షురాలు ఖలిదా జియా(70) మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఢాకా కోర్టులో పరువునష్టం దావా దాఖలైంది. ప్రధాని షేక్ హసినా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ పై చేసిన ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేశారు. ఈ నెల 1న ఢాకాలో జరిగిన ర్యాలీలో జియా ప్రసంగిస్తూ... వాజెద్ అక్రమంగా 300 మిలియన్ డాలర్లు బ్యాంకుల్లో దాచుకున్నారని ఆరోపించారు. జియా చేసిన ఆరోపణలు వాజెద్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ప్రొ-అవామి లీగ్ జననేత్రి పరిషత్ అధ్యక్షుడు ఏబీ సిద్ధిఖీ ఢాకా కోర్టులో పరువునష్టం దావా వేశారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ జరపాలని పోలీసులను ఆదేశించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. -
మాజీ ప్రధానికి అరెస్ట్ వారంట్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత బేగం ఖలేదా జియాకు ఆ దేశ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతేడాది ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు జరిగిన సమయంలో ఓ బస్సుకు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వ్యవహారంలో మాజీ ప్రధానికి బెయిల్ వచ్చే అవకాశముందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ఏడాది జనవరిలో బంగ్లా నేషనల్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలో ఓ బస్సుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు.