ఢాకా: బంగ్లాదేశ్ మాజీప్రధాని, ప్రతిపక్ష నేత ఖలీదా జియా కుమారునికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మనీలాండరింగ్ కేసులో శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తారీఖ్ రహ్మాన్(51)li నిర్దోషిగా భావిస్తూ దిగువ కోర్టు 2013లో ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.
తల్లి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తారీఖ్ తన స్నేహితుడు గియాసుద్దీన్ మామమ్ కు 200 మిలియన్ టకాల (2.5 మిలియన్ డాలర్లు) విలువ చేసే కాంట్రాక్టును అక్రమంగా ఇప్పించాడు.. ఇందుకు ప్రతిగా తారీఖ్ కు సింగపూర్ బ్యాంకు ఖాతాలో గియాసుద్దీన్ 45 మిలియన్ల టాకాలను జమచేశాడని కోర్టు నిర్ధారించింది. దీంతో తారీఖ్ కు 200 మిలియన్ టకాలను ఫైన్ విధిస్తూ.. ఏడేళ్ల జైలుశిక్షను కోర్టు విధించింది. దీనిపై బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్ పీ) స్పందించడానికి నిరాకరించింది.
మనీ లాండరింగ్ అంటే...
ఈ మధ్య తరచు మనీ ల్యాండరింగ్ గురించి వింటూనే ఉన్నాం. మనీ ల్యాండరింగ్ అంటే అక్రమంగా (చట్టానికి లోబడి) కాకుండా డబ్బు సంపాదించి.. దాన్ని విదేశీ బ్యాంకులకు తరలించి దాచి పెట్టుకోవడం.