సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
ఢాకా: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ ఖలీద జియా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు చెందిన స్వచ్ఛంద సంస్థ జియా చారిటబుల్ ట్రస్ట్ నిధుల విషయంలో లంఛాలకు పాల్పడినట్లు చేస్తున్న కేసుపై స్టే విధించాలంటూ ఆమె రెండు పిటిషన్లు వేశారు.
అంతకుముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఆమె ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై వచ్చే వారం విచారణ జరగనుంది. కోట్లలో ఆమె అవినీతికి పాల్పడినట్లు యాంటి కరప్షన్ కమిషన్(ఏసీసీ) 2010లో కేసు నమోదుచేసింది.