graft case
-
అడిషనల్ దందా’పై నగేశ్ మౌనం
సాక్షి, హైదరాబాద్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ‘అడిషనల్’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం లేదని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన ఈ కేసులో ఇటీవల ఏసీబీ కోర్టు ఐదుగురు నిందితులైన మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేశ్, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ వాసీం, మాజీ ఆర్డీవో అరుణారెడ్డి, మాజీ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, నగేశ్ బినామీ కోలా జీవన్‌గౌడ్‌లను నాలుగురోజుల కస్టడీకి అనుమతించింది. ఇందులో భాగంగా సోమ వారం ఉదయం నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు నగేశ్ ఆస్తులు, అక్రమ వ్యవహారాలపై ప్రశ్నించినట్లు సమా చారం. గతంలో ఇలాంటి వ్యవహారాలు ఏమైనా నడిపారా? అన్న విషయాలపై నగేశ్ నోరు మెదపలేదని సమాచారం. నగేశ్ తమతో పలు అక్రమ వ్యవహాలు చేసేలా ఒత్తిడి పెంచాడని ఇటీవల పలువురు తహసీల్దార్లు చేసిన ఆరోపణలపైనా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు నగేశ్ ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. వీరి కస్టడీ గడువు ఈ నెల 24తో ముగియనుంది. పార్టీలు, ప్రలోభాలతో బుట్టలోకి! ఈ క్రమంలో జీవన్‌గౌడ్‌కు సంబంధించి ఏసీబీ పలు ఆసక్తికర విషయాలు రాబట్టినట్లు సమాచారం. నగేశ్‌పై దాడుల సమయంలో ఏసీబీ అధికారుల బృందం ఒకటి.. జీవన్‌గౌడ్ కోసం ప్రత్యేకంగా అతని స్వస్థలమైన నిర్మల్‌కు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్థానికంగా పైరవీకారుడిగా పేరున్న జీవన్‌గౌడ్ గతంలోనూ పలువురు అధికారులను ఇలాంటి అక్రమాలకు వినియోగించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం డబ్బుతోపాటు పలు రకాల విలాసాలు, పార్టీలు ఆశజూపి ప్రలోభాలకు గురిచేసే వాడని పలువురు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సినిమా ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలతో తనకు పరిచయాలున్నాయని జీవన్‌గౌడ్ అధికారులను మభ్యపెట్టి పనులు చేయించుకునేవాడని పలువురు రెవెన్యూ సిబ్బంది ఏసీబీకి తెలిపినట్లు సమాచారం. నగేశ్‌కు జీవన్‌గౌడ్ తక్కువ కాలంలోనే దగ్గరయ్యాడని, నమ్మకస్తుడిగా మారి బినామీగా ఎదిగాడని తెలిసింది. ఏకంగా జీవన్‌గౌడ్ పేరిట పది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని బా«ధితుడు లింగమూర్తిపై ఒత్తిడి చేశాడంటే.. అతను నగేశ్‌కు ఎంతటి ఆప్తుడిగా మారాడో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
బంగ్లా మాజీ ప్రధానికి మరో ఎదురు దెబ్బ
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(72)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న ఆమెకు అధికార దుర్వినియోగం కేసులో జైలు శిక్ష ఖరారైంది. బంగ్లాదేశ్ రాజధానిలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఖలేదాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జియా తన భర్త పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థకోసం అక్రమంగా నిధులను సేకరించిన ఆరోపణలనువిచారించిన కోర్టు సోమవారం ఈ తీర్పునిచ్చింది. మాజీ ప్రధానితోపాటు హారిస్ చౌదరి సహా మరో ముగ్గురికి కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పది లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. ఢాకాలోని జియా చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ కోసం 375 వేల డాలర్ల గుప్త విరాళాలను సేకరించడంలో ప్రధానమంత్రిగా ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జడ్జి వ్యాఖ్యనించారు. కాగా విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున జియా కోర్టుకు హాజరు కాలేదు. మరోవైపు రెండు కేసులకు సంబంధించిన ఆరోపణలను ఖలీదా జియా పార్టీ ఖండించింది. రాజకీయ కుట్రగా అభివర్ణించింది. -
సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
ఢాకా: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ ఖలీద జియా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు చెందిన స్వచ్ఛంద సంస్థ జియా చారిటబుల్ ట్రస్ట్ నిధుల విషయంలో లంఛాలకు పాల్పడినట్లు చేస్తున్న కేసుపై స్టే విధించాలంటూ ఆమె రెండు పిటిషన్లు వేశారు. అంతకుముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఆమె ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై వచ్చే వారం విచారణ జరగనుంది. కోట్లలో ఆమె అవినీతికి పాల్పడినట్లు యాంటి కరప్షన్ కమిషన్(ఏసీసీ) 2010లో కేసు నమోదుచేసింది. -
ఆ కళంకిత మంత్రిని పీకేయండి!
తిరువనంతపురం: బార్ లైసెన్సుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఆర్థికమంత్రి కేఎం మణిపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి నిర్దేశించింది. దీంతో ఆయనను మంత్రిమండలి నుంచి తొలగించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బార్ లైసెన్సుల కుంభకోణంలో కేఎం మణి పాత్ర ఉందని కేరళ హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ మేరకు సూచనలు అందినట్టు తెలుస్తోంది. ప్రమాణాలు పాటించడం లేదని కేరళలో మూసివేసిన మద్యం షాపుల లైసెన్స్‌లను పునరుద్ధరించేందుకు ఆర్థికమంత్రి కేఎం మణి రూ. కోటి డిమాండ్ చేసి.. లంచంగా తీసుకున్నారని ఓ హోటల్ యాజమాని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఓ మంత్రి నిందితుడిగా ఉన్న కేసులో దర్యాప్తు సజావుగా జరుగుతుందని సామాన్యుడు భావించే పరిస్థితి లేదని పేర్కొంది. యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పార్టీకి చెందిన కేఎం మణి మంత్రిపదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇదివరలో సీఎం ఊమెన్ చాందీ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఆ మంత్రిపై కేసు నడవాల్సిందే
కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బార్ లైసెన్సుల కేటాయింపు కోసం లంచాలు తీసుకున్నారంటూ రాష్ట్ర ఆర్థికమంత్రి కేఎం మణిపై ఉన్న కేసు విచారణ కొనసాగాల్సిందేనని ప్రత్యేక విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. కేసును మూసేస్తామంటూ విచారణ సంస్థ దాఖలుచేసిన తుది నివేదికను కోర్టు తోసిపుచ్చింది. కేరళలో బార్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు మణి 5 కోట్ల లంచం డిమాండ్ చేశారని, ముందుగా 470 బార్లను తెరిపించేందుకు కోటి రూపాయలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికి ఆరోపణలు లేవని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రత్యేక జడ్జి జాన్ కె. ఇల్లెకదన్ తోసిపుచ్చారు. దీనిపై మరింత విచారణ జరగాలని ఆదేశించారు. మంత్రిపై చార్జిషీటు పెట్టడానికి తగిన సాక్ష్యాలు లేవని విజిలెన్స్ బ్యూరో తన నివేదికలో చెప్పింది. అయితే, ఈ నివేదికను సవాలుచేస్తూ సీపీఎం సీనియర్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్, మరో 8 మంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో మణిని విచారించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. -
కేరళ ఆర్థిక మంత్రిపై లంచం కేసు!
కేరళలో ఊమెన్ చాందీ సర్కారుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి కేఎం మణిపై విజిలెన్స్, ఏసీబీ లంచం కేసు నమోదుచేసింది. రాష్ట్రంలో గత సంవత్సరం మూతపడిన 418 బార్లను తెరిపించడానికి ఆయన కోటి రూపాయల లంచం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో రుజువైందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బార్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు ఆర్థికమంత్రి తనను 5 కోట్ల రూపాయల లంచం అడిగారని, అందుకు తాను తోటి సభ్యుల నుంచి సేకరించి కోటి రూపాయలు ఇచ్చానని కేరళ హోటళ్లు, బార్ల సంఘం అధ్యక్షుడు బిజు రమేష్ గత నెలలో ఓ టీవీ షోలో ఆరోపించారు. అయితే ... ఆ ఆరోపణలను సీఎం చాందీ ఖండించారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనన్నారు. ఈ విషయం కేరళ అసెంబ్లీని కుదిపేసింది. మణి రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. చివరకు విజిలెన్స్, ఏసీబీ జోక్యం చేసుకోవడంతో ఆర్థికమంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. -
బ్యాంకు మేనేజర్‌ను అరెస్టు చేసిన సీబీఐ
గ్రూప్ రుణం ఆమోదానికి లంచం తీసుకున్న కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ ఒకరిని సీబీఐ వర్గాలు అరెస్టు చేశాయి. బీహార్‌లోని కిషన్ గంజ్ బ్రాంచి మేనేజర్ ఓం ప్రకాష్ ఒక గ్రూప్ రుణం ఇవ్వడానికి 12 వేల రూపాయల లంచం అడగడంతో ఖాసిఫ్ అహ్మద్ సీబీఐని ఆశ్రయించారు. దాంతో తాము వల పన్నగా బ్యాంకు మేనేజర్‌తో పాటు ఆయన ఏజెంటు మమతా జైన్ డబ్బు అడిగారని సీబీఐ డీఐజీ వీకే సింగ్ తెలిపారు. ముందుగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా బ్యాంకు మేనేజర్‌ను, ఏజెంటును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే ఎస్ఎంఎస్ ద్వారా అయినా సరే తమకు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రచారం చేయడంతో ప్రజల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నట్లు సీబీఐ డీఐజీ తెలిపారు. -
లంచం కేసులో బ్యాంకు మేనేజర్ అరెస్టు
నిరుద్యోగ యువకుడికి ప్రభుత్వ పథకం కింద మంజూరైన రుణాన్ని ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన బ్యాంకు మేనేజర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హమీర్పురి గ్రామంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఈ సంఘటన జరిగింది. బ్యాంకు మేనేజర్‌తో పాటు మరో ప్రైవేటు వ్యక్తిమీద కూడా కేసు నమోదు చేసినట్లు సీబీఐ ప్రతినిధి తెలిపారు. అవినీతి నిరోధక చట్టంతో పాటు నేరపూరిత కుట్ర కింద ఈ కేసులు నమోదు చేశారు. స్వయం ఉపాధి పథకం కింద మంజూరైన రుణాన్ని విడుదల చేయడానికి బ్యాంకు మేనేజర్ 6వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు సీబీఐని ఆశ్రయించడంతో సీబీఐ వలపన్ని మేనేజర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుందని సీబీఐ అధికార ప్రతినిధి కంచన్ ప్రసాద్ తెలిపారు.