కేరళలో ఊమెన్ చాందీ సర్కారుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి కేఎం మణిపై విజిలెన్స్, ఏసీబీ లంచం కేసు నమోదుచేసింది. రాష్ట్రంలో గత సంవత్సరం మూతపడిన 418 బార్లను తెరిపించడానికి ఆయన కోటి రూపాయల లంచం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో రుజువైందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బార్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు ఆర్థికమంత్రి తనను 5 కోట్ల రూపాయల లంచం అడిగారని, అందుకు తాను తోటి సభ్యుల నుంచి సేకరించి కోటి రూపాయలు ఇచ్చానని కేరళ హోటళ్లు, బార్ల సంఘం అధ్యక్షుడు బిజు రమేష్ గత నెలలో ఓ టీవీ షోలో ఆరోపించారు.
అయితే ... ఆ ఆరోపణలను సీఎం చాందీ ఖండించారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనన్నారు. ఈ విషయం కేరళ అసెంబ్లీని కుదిపేసింది. మణి రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. చివరకు విజిలెన్స్, ఏసీబీ జోక్యం చేసుకోవడంతో ఆర్థికమంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.
కేరళ ఆర్థిక మంత్రిపై లంచం కేసు!
Published Thu, Dec 11 2014 7:37 PM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement