km mani
-
కేరళ కాంగ్రెస్ చీఫ్ పరిస్థితి విషమం!
కొచ్చి: కేరళ కాంగ్రెస్(ఎం) అధ్యక్షుడు కేఎం మణి ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 86 ఏళ్ల మణికి కొచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చెస్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే మణి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, మణికి మెరగైన వైద్యం అందిస్తున్నామని ఆస్పత్రి హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. ఆయన 50 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కొట్టాయం పార్లమెంట్ స్థానం నుంచి ఆయన కేరళ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. కానీ అనారోగ్యం కారణంగా ఆయన ప్రచారానికి దురంగా ఉన్నారు. -
మణి రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి
-
ఆ కళంకిత మంత్రిని పీకేయండి!
తిరువనంతపురం: బార్ లైసెన్సుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఆర్థికమంత్రి కేఎం మణిపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి నిర్దేశించింది. దీంతో ఆయనను మంత్రిమండలి నుంచి తొలగించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బార్ లైసెన్సుల కుంభకోణంలో కేఎం మణి పాత్ర ఉందని కేరళ హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ మేరకు సూచనలు అందినట్టు తెలుస్తోంది. ప్రమాణాలు పాటించడం లేదని కేరళలో మూసివేసిన మద్యం షాపుల లైసెన్స్‌లను పునరుద్ధరించేందుకు ఆర్థికమంత్రి కేఎం మణి రూ. కోటి డిమాండ్ చేసి.. లంచంగా తీసుకున్నారని ఓ హోటల్ యాజమాని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఓ మంత్రి నిందితుడిగా ఉన్న కేసులో దర్యాప్తు సజావుగా జరుగుతుందని సామాన్యుడు భావించే పరిస్థితి లేదని పేర్కొంది. యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పార్టీకి చెందిన కేఎం మణి మంత్రిపదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇదివరలో సీఎం ఊమెన్ చాందీ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కేరళ ఆర్థిక మంత్రిపై లంచం కేసు!
కేరళలో ఊమెన్ చాందీ సర్కారుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి కేఎం మణిపై విజిలెన్స్, ఏసీబీ లంచం కేసు నమోదుచేసింది. రాష్ట్రంలో గత సంవత్సరం మూతపడిన 418 బార్లను తెరిపించడానికి ఆయన కోటి రూపాయల లంచం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో రుజువైందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బార్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు ఆర్థికమంత్రి తనను 5 కోట్ల రూపాయల లంచం అడిగారని, అందుకు తాను తోటి సభ్యుల నుంచి సేకరించి కోటి రూపాయలు ఇచ్చానని కేరళ హోటళ్లు, బార్ల సంఘం అధ్యక్షుడు బిజు రమేష్ గత నెలలో ఓ టీవీ షోలో ఆరోపించారు. అయితే ... ఆ ఆరోపణలను సీఎం చాందీ ఖండించారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనన్నారు. ఈ విషయం కేరళ అసెంబ్లీని కుదిపేసింది. మణి రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. చివరకు విజిలెన్స్, ఏసీబీ జోక్యం చేసుకోవడంతో ఆర్థికమంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.