నిరుద్యోగ యువకుడికి ప్రభుత్వ పథకం కింద మంజూరైన రుణాన్ని ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన బ్యాంకు మేనేజర్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
నిరుద్యోగ యువకుడికి ప్రభుత్వ పథకం కింద మంజూరైన రుణాన్ని ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన బ్యాంకు మేనేజర్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హమీర్పురి గ్రామంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఈ సంఘటన జరిగింది. బ్యాంకు మేనేజర్తో పాటు మరో ప్రైవేటు వ్యక్తిమీద కూడా కేసు నమోదు చేసినట్లు సీబీఐ ప్రతినిధి తెలిపారు. అవినీతి నిరోధక చట్టంతో పాటు నేరపూరిత కుట్ర కింద ఈ కేసులు నమోదు చేశారు.
స్వయం ఉపాధి పథకం కింద మంజూరైన రుణాన్ని విడుదల చేయడానికి బ్యాంకు మేనేజర్ 6వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు సీబీఐని ఆశ్రయించడంతో సీబీఐ వలపన్ని మేనేజర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకుందని సీబీఐ అధికార ప్రతినిధి కంచన్ ప్రసాద్ తెలిపారు.