గ్రూప్ రుణం ఆమోదానికి లంచం తీసుకున్న కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ ఒకరిని సీబీఐ వర్గాలు అరెస్టు చేశాయి.
గ్రూప్ రుణం ఆమోదానికి లంచం తీసుకున్న కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ ఒకరిని సీబీఐ వర్గాలు అరెస్టు చేశాయి. బీహార్లోని కిషన్ గంజ్ బ్రాంచి మేనేజర్ ఓం ప్రకాష్ ఒక గ్రూప్ రుణం ఇవ్వడానికి 12 వేల రూపాయల లంచం అడగడంతో ఖాసిఫ్ అహ్మద్ సీబీఐని ఆశ్రయించారు. దాంతో తాము వల పన్నగా బ్యాంకు మేనేజర్తో పాటు ఆయన ఏజెంటు మమతా జైన్ డబ్బు అడిగారని సీబీఐ డీఐజీ వీకే సింగ్ తెలిపారు.
ముందుగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా బ్యాంకు మేనేజర్ను, ఏజెంటును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే ఎస్ఎంఎస్ ద్వారా అయినా సరే తమకు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రచారం చేయడంతో ప్రజల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నట్లు సీబీఐ డీఐజీ తెలిపారు.