ప్రతీకాత్మక చిత్రం
కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో పలువురు సిబ్బంది కుమ్మక్కై రూ.2 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం కలికిరి బ్రాంచికి వచ్చిన అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఈ అక్రమాల నేపథ్యంలో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ప్రస్తుతం కలికిరిలో విధులు నిర్వర్తిస్తున్న జాయింట్ మేనేజరు రామచంద్రడు, క్లర్క్ ఈలు, ఇటీవలే ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి బ్రాంచ్‌కు బదిలీపై వెళ్లిన జాయింట్ మేనేజరు కరణం జయకృష్ణ, గుంతకల్లు బ్రాంచ్‌కు బదిలీ అయిన ఫీల్డ్ ఆఫీసర్ ఈశ్వరన్‌లను బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బ్యాంకు మెసెంజర్ అలీ నకిలీ రసీదులు ఇచ్చి అవకతవకలకు పాల్పడినట్లు ఒక పొదుపు సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాల డొంక కదిలింది. బ్యాంకు అంతర్గత దర్యాప్తులో ఇప్పుడు సస్పెండైన నలుగురు మెసెంజర్ అలీతో కుమ్మక్కయ్యారని ప్రాథమికంగా నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment