న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అవినీతిపై ఫిర్యాదులను స్వీకరించడానికి ఒకే ఫోన్ నంబరుతో నిరంతరాయంగా పనిచేసే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐ భావిస్తోంది. ఫిర్యాదును స్వీకరించిన అనంతరం అది కేంద్ర పరిధిలోకి వచ్చే సంస్థల్లో అవినీతికి సంబంధించినది అయితే సీబీఐ సొంతంగా విచారణ చేపడుతుంది.
రాష్ట్ర విభాగాలకు చెందిన ఫిర్యాదు అయితే సంబంధిత రాష్ట్రంలోని అవినీతి నిరోధక విభాగాలకు చేరవేస్తుంది. అనంతరం వాటి పురోగతినీ తెలుసుకుంటూ ఉంటుంది. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా ఈ–మెయిళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇందులో స్వీకరిస్తారు.
అవినీతి ఫిర్యాదులకు ఒకే నంబర్!
Published Thu, Nov 17 2016 10:24 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement