సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు నిరూపణ కావడంతో సికింద్రాబాద్ రాష్ట్రపతిరోడ్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ మేనేజర్ సత్యారావుకు సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.25 లక్షలు జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో మరో ఏడాది శిక్ష అనుభవించాలని బుధవారం తీర్పు చెప్పింది. సత్యారావు స్థిర, చరాస్తులు అమ్మి కేంద్రానికి రూ.1.34 కోట్లు డిపాజిట్ చేయాలని, మిగిలిన సొమ్ము నుంచి నిందితుడు రూ.25 లక్షలను జరిమానా చెల్లించవచ్చని పేర్కొంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయన ఆస్తులపై 2011 జూలైలో కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment