మళ్లీ సీబీఐ ఎదుట హాజరైన కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ : అవినీతి, ఫెరా ఉల్లంఘనల కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ సోమవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి వచ్చిన కార్తీని సీబీఐ అధికారులు దాదాపు 100కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఈనెల 23న విచారణ సందర్భంగా కార్తీని సీబీఐ ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించిన విషయం విదితమే. ఈ కేసులో సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈనెల 18న సుప్రీం కోర్టు కార్తీ చిదంబరాన్ని ఆదేశించింది. ఇదే కేసులో సుప్రీం ఉత్తర్వులకు అనుగుణంగా ఈనెల 28న మరో నలుగురిని సీబీఐ ప్రశ్నించనుంది.
ముంబయికి చెందిన ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ లభించేలా వ్యవహరించినందుకు కార్తీకి రూ 3.5 కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఆయనపై నేరపూరిత కుట్ర, మోసం, అక్రమ పద్దతుల్లో డబ్బులు స్వీకరించారనే అభియోగాలపై ఈ ఏడాది మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.