సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసుకు సంబంధించి కార్తీకి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను హైకోర్టు సరిగ్గ పరిశీలించలేదని ఆరోపిస్తూ ఇది కేసు విచారణను ప్రభావితం చేస్తుందని సీబీఐ పేర్కొంది.
ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న క్రమంలో కార్తీ చిదంబరం బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ప్రోత్సహించడం సరైంది కాదని సీబీఐ తన అప్పీల్‌లో పేర్కొంది. కార్తీకి బెయిల్ మంజూరు చేసే క్రమంలో కోర్టు ఆయనపై ఉన్న అభియోగాల తీరు, ఆధారాలు, సాక్ష్యాలపై ప్రభావం చూపే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు వ్యవహరించిందని సీబీఐ ఆక్షేపించింది. మార్చి 23న ఢిల్లీ హైకోర్టు కార్తీ చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment