‘‘2018’లాంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్‌లోనే చూడాలి. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని మాట ఇస్తున్నా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కొన్ని ప్రధాన ఏరియాల్లో ‘బన్నీ’ వాసు ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జూడ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘కేరళలో 2018లో వచ్చిన వరద బాధితుల్లో నేనూ ఒక్కణ్ణి. ఈ కథని ప్రపంచానికి చెప్పాలనుకుని ‘2018’ తీశాను. భాషతో సంబంధం లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment