
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ" (Jayaho Ramanuja ). ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ -పాన్ ఇండియా భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే ఇది చిన్న సినిమా అనకూడదు. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడంలో మా వంతు సపోర్ట్ చేస్తాం. జయహో రామానుజ సాయి వెంకట్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.
దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – మన తెలుగు రాష్ట్రాల్లో రామానుజాచార్యుల గురించి పెద్దగా తెలియదు. కానీ తమిళనాట ప్రతి ఒక్కరికీ ఆయన ఎవరో తెలుసు. చినజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహాన్ని మన దగ్గర ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్ద వాళ్లు వచ్చి ఆవిష్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల వారికి బాగా ఆయన గురించి తెలిసింది. తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియజేసే ప్రయత్నంలోనే ఈ చిత్రాన్ని రూపొందించాను. వెంకటేశ్వర స్వామికే గురువు లాంటి వారు రామానుజులు. వెంకటేశ్వరుడికి శంఖు చక్రాలు రామానుజాచార్యుల వారే బహూకరించారు. కమల్ హాసన్ గారు సోషల్ మూవీలో 10 పాత్రలు చేశారు. కానీ పౌరాణికంలో ఎవరూ 11 పాత్రల్లో నటించలేదు. నేను "జయహో రామానుజ" చిత్రంలో 11 పాత్రలు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయండి అని మిత్రులు ఇచ్చిన సలహాతో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంతో పాటు మిగతా ప్రపంచ భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం’ అఅన్నారు.
నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ – ముందుగా నాన్నకు బర్త్ డే విషెస్ చెబుతున్నా. "జయహో రామానుజ" వంటి భారీ చిత్రాన్ని నేను నిర్మించగలను అని నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్న నాన్నకు థ్యాంక్స్. ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేదాన్ని కాదు. రాజమౌళి గారి సినిమాలు కూడా రిలీజ్ వాయిదా పడుతుంటాయి. క్వాలిటీ కోసం కొంత టైమ్ తీసుకోవడం మంచిదే. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో జయహో రామానుజ చిత్రాన్ని నిర్మించాం. ఈ రోజు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మించాను. త్వరలోనే మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. మీరంతా మీ ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు
Comments
Please login to add a commentAdd a comment