Jayaho Ramanuja
-
రామానుజాచార్యుల చరిత్రతో...
సాయి వెంకట్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. జో శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి భాగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సాయి వెంకట్ మాట్లాడుతూ– ‘‘మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి మెలగాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు రామానుజా చార్యులవారు. ఆయన గొప్పతనం ఈ తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ‘జయహో రామానుజ’ చిత్రాన్ని రూపోందించాను.సంగీత సాహిత్యాలు బాగుండాలని టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడ కుండా సాంగ్స్ డిజైన్ చేశాం’’ అన్నారు. ‘‘జయహో రామానుజ’ సినిమా మా నాన్నగారు సాయి వెంకట్‌కి ఒక కల’’ అన్నారు నిర్మాత ప్రవళ్లిక. ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, వెంకట్, హర్ష. -
డబ్బులు ఉంటే అలాంటి పాత్రలు రావు..దేవుడి పర్మిషన్ ఉండాలి: సుమన్
డబ్బులు, పలుకుబడి ఉంటే ఆధ్యాత్మికమైన పాత్రలు రావు..అలాంటి పాత్రలు చేయాలంటే పై నుంచి ఆ దేవుడి పర్మిషన్ కావాలి. అన్నమయ్య సమయంలోనూ నా పాత్ర కోసం చాలా మందిని అడిగారు. కానీ ఆ వెంకటేశ్వరుడి స్వామి నన్ను మాత్రం కావాలని అనుకున్నాడు. అందుకే ఆ పాత్ర నాకు వచ్చింది’అని సీనియర్ నటుడు సుమన్ అన్నారు. సుదర్శనం ప్రొడక్షన్స్ లో లయన్ డా. సాయివెంకట్ స్వీయ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ ’. సాయిప్రసన్న ప్రవలిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుమన్ మాట్లాడుతూ.. సాయి వెంకట్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి బంధం ఉంది. రామానుజం పాత్రను పోషిస్తున్నట్టుగా చెప్పారు. ఎలా ఉంటుందో అని అనుకున్నాను. అయితే ఫస్ట్ లుక్ చూసిన తరువాత నాకు కాన్ఫిడెంట్ అనిపించింది. కారెక్టర్‌కి గెటప్ బాగా సూట్ అయితే సినిమా బాగా వస్తుంది. రామానుజం పాత్రకు సాయి వెంకట్ గెటప్ బాగా సెట్ అయింది. ఈ సినిమా బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు. దర్శక నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు బాహుబలి, బింబిసార రేంజ్లో వీఎఫ్ఎక్స్ ఉంటుంది. చిన్న వాళ్లు సినిమా తీస్తే ఎవ్వరూ అంచనాలు పెట్టుకోరు. మనల్ని మనమే నిరూపించుకోవాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. మాలాంటి వారు తీసిన చిన్న సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టం. ఈ సినిమాను టెక్నికల్‌పరంగా, బిజినెస్ పరంగా తీశాను. ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం’ అన్నారు. ‘జయహో రామానుజ సినిమా చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’అని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి అన్నారు. ‘ట్రైలర్ చాలా బాగుంది. సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’అని తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ అన్నారు. ‘ఇలాంటి గొప్ప చిత్రాన్ని తీసిన సాయి వెంకట్‌కు మా కృతజ్ఞతలు' అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ జో శర్మ, సింగర్, నిర్మాత సాయి ప్రసన్న , బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రామానుజ జీవిత చరిత్రతో ‘జయహో రామానుజ’
సాయి వెంకట్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సుదర్శనం ప్రొడక్షన్స్‌పై సాయి ప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ని నిర్మాతలు వడ్లపట్ల మోహన్, ప్రసన్న కుమార్, టీఎఫ్‌సీసీ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ, సెన్సార్ బోర్డు మెంబర్ అట్లూరి రామకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ– ‘‘11వ శతాబ్దంలోని భగవత్ రామానుజుల జీవిత చరిత్ర ఆధారంగా ‘జయహో రామానుజ’ తెరకెక్కిస్తున్నాం. 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ నెల 15 నుంచి మూడవ షెడ్యూలు ప్రారంభిస్తాం. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నాం. మొదటి భాగాన్ని ఈ ఏడాది దసరాకు, రెండవ భాగాన్ని 2023 మే 5న రామానుజ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. -
రెండు భాగాలుగా ‘జయహో రామానుజ’
సాయివెంకట్ టైటిల్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జో శర్మ, అశ్వాపురం వేణుమాధవ్, అప్పం పద్మ ముఖ్య తారలు. సుదర్శనం హేమలత సమర్పణలో సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళిక నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి, జగద్గురు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు చిత్రం లోగోను ఆవిష్కరించి, ‘‘రామానుజంగారి గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో తెలుస్తాయి. సాయివెంకట్గారికి మేం కొన్ని సూచనలు ఇచ్చాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’’ అన్నారు కోదండ రామాచార్యులు. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లు పరిశోధన చేశాను. రామానుజంగారి విశిష్టతను రెండు సినిమాలుగా చూపించేంత సబ్జెక్ట్ దొరికింది. తొలి భాగాన్ని విడుదల చేసిన ఐదు నెలలకు రెండో భాగాన్ని రిలీజ్ చేస్తాం. ఇంత గొప్ప సినిమా నిర్మిస్తున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానంవారు అభినందించి, తిరుమలలో షూటింగ్ చేసుకునేందుకు అనుమతివ్వడం సంతోషంగా ఉంది. ఇందులో ఆరు పాటలు, 11 శ్లోకాలు ఉన్నాయి’’ అన్నారు.