రెండు భాగాలుగా ‘జయహో రామానుజ’ | Jayaho Ramanuja Movie Logo Launch | Sakshi
Sakshi News home page

రెండు భాగాలుగా ‘జయహో రామానుజ’

Jan 30 2022 9:18 AM | Updated on Jan 30 2022 9:18 AM

Jayaho Ramanuja Movie Logo Launch - Sakshi

సాయివెంకట్‌ టైటిల్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జో శర్మ, అశ్వాపురం వేణుమాధవ్, అప్పం పద్మ ముఖ్య తారలు. సుదర్శనం హేమలత సమర్పణలో సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళిక నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి, జగద్గురు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు చిత్రం లోగోను ఆవిష్కరించి, ‘‘రామానుజంగారి గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో తెలుస్తాయి. సాయివెంకట్‌గారికి మేం కొన్ని సూచనలు ఇచ్చాం’’ అన్నారు.

‘‘ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’’ అన్నారు కోదండ రామాచార్యులు. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లు పరిశోధన చేశాను. రామానుజంగారి విశిష్టతను రెండు సినిమాలుగా చూపించేంత సబ్జెక్ట్‌ దొరికింది. తొలి భాగాన్ని విడుదల చేసిన ఐదు నెలలకు రెండో భాగాన్ని రిలీజ్‌ చేస్తాం. ఇంత గొప్ప సినిమా నిర్మిస్తున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానంవారు అభినందించి, తిరుమలలో షూటింగ్‌ చేసుకునేందుకు అనుమతివ్వడం సంతోషంగా ఉంది. ఇందులో ఆరు పాటలు, 11 శ్లోకాలు ఉన్నాయి’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement