సాయి వెంకట్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. జో శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి భాగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో జూలై 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సాయి వెంకట్ మాట్లాడుతూ– ‘‘మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి మెలగాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు రామానుజా చార్యులవారు. ఆయన గొప్పతనం ఈ తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ‘జయహో రామానుజ’ చిత్రాన్ని రూపోందించాను.
సంగీత సాహిత్యాలు బాగుండాలని టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడ కుండా సాంగ్స్ డిజైన్ చేశాం’’ అన్నారు. ‘‘జయహో రామానుజ’ సినిమా మా నాన్నగారు సాయి వెంకట్‌కి ఒక కల’’ అన్నారు నిర్మాత ప్రవళ్లిక. ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, వెంకట్, హర్ష.
Comments
Please login to add a commentAdd a comment