హైదరాబాద్ : కాంగో జాతీయురాలు సిథియా హత్య కేసును మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు విచారించింది. అందులోభాగంగా పోలీసుల అభ్యర్థన మేరకు చిన్నారి సానియాకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని వైద్యాధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిందితుడు రూపేశ్‌ను విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. సానియా కేసు విచారణను తిరిగి జులై 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.