rajendra nagar court
-
రేవంత్‌రెడ్డికి షాకిచ్చిన న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు షాక్ ఇచ్చింది. డ్రోన్ కెమెరాల కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఆయనతో పాటు అరెస్ట్ అయిన ఐదుగురుకి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగానే ప్రభుత్వంపై ఆయనపై అక్రమ కేసులో మోపుతోందని కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. (రేవంత్‌రెడ్డి అరెస్టు) -
రూపేశ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
హైదరాబాద్ : కాంగో జాతీయురాలు సిథియా హత్య కేసును మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు విచారించింది. అందులోభాగంగా పోలీసుల అభ్యర్థన మేరకు చిన్నారి సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని వైద్యాధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిందితుడు రూపేశ్‌ను విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. సానియా కేసు విచారణను తిరిగి జులై 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. -
పాపం... సానియా..
-
పాపం... సానియా..
- రోజంతా కోర్టుల్లో హైడ్రామా - తల్లిదండ్రులకు దూరమై ఒంటరైన చిన్నారి సాక్షి, హైదరాబాద్ : నాన్న చేతిలో కాలి బూడిదైన అమ్మ... ఆ హత్యానేరంతో జైలుకెళ్లిన నాన్న... తమకే కావాలని తల్లి వైపు... తండ్రి వైపు బంధువులు పటబట్టడంతో... ఎవరికీకాక ఒంటరైన బుజ్జితల్లి కంటనీరు కట్టలు తెగుతోంది. ఎనిమిదేళ్ల చిన్నారి సానియా శుక్రవారమంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. గచ్జిబౌలిలో ఉండే రూపేశ్‌కుమార్ తన భార్య సింథియాను గత ఆదివారం హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి ఏకైక కుమార్తె సానియా(8) పరిస్థితి దైన్యంగా మారింది. చిన్నారిని తామే పెంచుతామని నానమ్మ లలిత చెబుతుండగా, తమదేశం కాంగోకు తీసుకెళ్తామంటూ మేనమామ పట్టుబడుతున్నారు. కాంగో రాయబారి కూడా సానియాను తమకు అప్పగించాలని కోరినట్లు తెలిసింది. కనిపించని బంధువులు... ఈ వివాదంతో నింబోలిఅడ్డాలోని రెస్క్యూ హోంలో ఉన్న సానియాను ఎవరికి అప్పచెప్పాలో తేల్చుకోని పోలీస్‌లు తొలుత రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని 8ఎంఎం కోర్టు న్యాయమూర్తి రాధిక జేస్వాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టుకు న్యాయమూర్తి బదిలీ చేశారు. సానియాను అక్కడికి తీసుకువెళ్లగా... తమ పరిధిలో లేదని ఫ్యామిలీ కోర్టు జడ్జి రమేష్‌బాబు వెల్లడించారు. దీంతో మళ్లీ రాజేంద్రనగర్ 8ఎంఎం కోర్టుకు తీసుకెళ్లగా... పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. అయితే... సానియా మాక్కావాలంటే మాక్కావాలన్న బంధువులు ఒక్కరు కూడా కోర్టులో పిటిషన్ వేయలేదు. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు చిన్నారిని హైదర్షాకోటలోని కస్తూర్బా ట్రస్ట్‌కు తరలించారు. సోమవారం వరకు అక్కడే చిన్నారి యోగక్షేమాలు చూసుకోవాలన్నారు. బంధువులు పిటిషన్ దాఖలు చేస్తే తిరిగి ఈ కేసుపై విచారణ జరుగుతుంది. -
సానియా వ్యవహారంపై తేలని వివాదం
-
సానియా వ్యవహారంపై తేలని వివాదం
హైదరాబాద్ : దారుణంగా హత్యకు గురైన తల్లి... ఓవైపు జైల్లో తండ్రి.. ఇంకోవైపు తమకు అప్పగించాలంటూ తల్లి తరఫు బంధువులు, మరోవైపు సానియా తమతోనే ఉంటుందని తండ్రి కుటుంబసభ్యలు డిమాండ్‌తో చిన్నారి సానియా పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో వారి కూతురు సానియా ఎక్కడ ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయిదు రోజుల క్రితం కాంగో దేశస్తురాలు అయిన సింథియాను అతి కిరాతకంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని దహనం చేసిన రూపేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె సోదరుడు డానీస్తోపాటు అతడి బంధువులు రెండురోజులుగా పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సానియాను పోలీసులు గురువారం రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసు తమ పరిధిలోకి రాదని, రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో పోలీసులు రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించనున్నారు. కాగా తల్లి హత్య అనంతరం సానియా తన నాయనమ్మ లీలావతి వద్ద ఉండగా, ఆ చిన్నారిని పోలీసులు గురువారం నాడు రెస్క్యూ హోంకు తరలించారు. ఆ ప్రదేశాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.