
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు షాక్ ఇచ్చింది. డ్రోన్ కెమెరాల కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఆయనతో పాటు అరెస్ట్ అయిన ఐదుగురుకి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగానే ప్రభుత్వంపై ఆయనపై అక్రమ కేసులో మోపుతోందని కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. (రేవంత్‌రెడ్డి అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment