పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ రూపేశ్
జిన్నారం (పటాన్‌చెరు): టీఎస్ న్యాబ్, జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. గుమ్మడిదలకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌గౌడ్, అనంతారానికి చెందిన సాయికుమార్‌గౌడ్, వికారాబాద్ జిల్లా పంచలింగాలకు చెందిన క్యాసారం రాకేశ్‌లు నిషేధిత అ్రల్పాజోలం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
నలుగురూ కలిసి కొత్తపల్లి గ్రామ శివారులో ఓ కోళ్ల ఫారాన్ని లీజుకు తీసుకున్నారు. అక్కడ ఓ ప్రత్యేక గదిలో డ్రగ్‌ను తయారు చేసేందుకు రియాక్టర్‌తో సహా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసుకున్నారు. అంజిరెడ్డి బాలానగర్‌లో అ్రల్పాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు తీసుసురాగా రాకేశ్ డ్రగ్‌ను ప్రాసెస్‌ను చేసేవాడు. ఆరు నెలలుగా వీరి డ్రగ్ వ్యాపారం బాగానే నడిచింది.
అయితే గ్రామ శివారులో వ్యర్థాల ఘాటు వాసనలు వెలువడటంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో టీఎస్ న్యాబ్, పోలీసులు సంయుక్తంగా డ్రగ్ కేంద్రంపై దాడులు జరిపి, రూ.40 లక్షల విలువైన 2.6 కిలోల అ్రల్పాజోలం, మరో రూ.60 లక్షల విలువైన ముడి పదార్థాలు, యంత్రాలను అధికారులు సీజ్ చేశారు.
రాకేశ్, అంజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సాయికుమార్‌గౌడ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నాడని ఎస్పీ రూపేశ్ తెలిపారు. సమావేశంలో న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, ఇన్‌స్పెక్టర్ సంతోష్, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, జిన్నారం సీఐ సు«దీర్ కుమార్, ఎస్‌ఐలు మహేశ్వర్‌రెడ్డి, విజయారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment