Prohibited Drugs
-
ఎయిర్పోర్ట్ కొత్త రూల్స్.. ఈ వస్తువులకు నో ఎంట్రీ
సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్ విమానాశ్రయం దాని నియమాలలో కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా ప్రయాణికులు క్యాబిన్ బ్యాగ్‌లో మందులు వంటి ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లవచ్చు. కానీ ఇప్పుడు దుబాయ్ వెళ్లే విమానంలో ఇది సాధ్యం కాదు. మీరు అన్ని రకాల మందులను తీసుకెళ్లలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు అనుమతించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.దుబాయ్ విమాన లగేజీ నిబంధనలలో మార్పులుచాలా సార్లు ప్రయాణికులు తమకు తెలియకుండానే అనుమతి లేని కొన్ని వస్తువులను తమతో విమానంలోకి తీసుకెళ్తుంటారు. వీటిని విమానంలో తీసుకెళ్లడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు. మీరు దుబాయ్ వెళ్తుంటే విమానంలో చెక్-ఇన్ లగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో ఏమి ప్యాక్ చేయవచ్చు.. ఏమి చేయకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. దుబాయ్‌కి ప్రయాణించేటప్పుడు బ్యాగుల్లో ఎలాంటి వస్తువులను తీసుకువెళ్లవచ్చో ఇక్కడ తెలుసుకోండి.ఈ ఉత్పత్తులను బ్యాగులో తీసుకెళ్లకూడదుకొకైన్, హెరాయిన్, గసగసాలు, మత్తు కలిగించే మందులు.తమలపాకులు, కొన్ని మూలికలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు.ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, జూద వస్తువులు, మూడు పొరల ఫిషింగ్ నెట్లు, బహిష్కృత దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణిస్తారు.ముద్రిత వస్తువులు, ఆయిల్ పెయింటింగ్‌లు, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, రాతి శిల్పాలను కూడా తీసుకెళ్లకూడదు.నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం, మాంసాహారం కూడా తీసుకెళ్లకూడదు.ప్రయాణికులెవరైనా ఈ నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.ఈ మందులను అస్సలు తీసుకెళ్లలేరుబెటామెథోడోల్ఆల్ఫా-మిథైల్ఫెనానిల్ గంజాయికోడాక్సిమ్ఫెంటానిల్పాపీ స్ట్రా కాన్సన్ట్రేట్మెథడోన్నల్లమందుఆక్సికోడోన్ట్రైమెపెరిడిన్ఫెనోపెరిడిన్కాథినోన్కోడైన్యాంఫెటమైన్వీటిని చెల్లింపుతో తీసుకెళ్లవచ్చుదుబాయ్ ట్రిప్‌కు వెళ్లేటప్పుడు కొన్ని రకాల వస్తువులను చెల్లింపుతో తీసుకెళ్లవచ్చు. ఈ జాబితాలో మొక్కలు, ఎరువులు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, ట్రాన్స్మిషన్, వైర్లెస్ పరికరాలు, ఆల్కహాలిక్ పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కాలు ఉన్నాయి. -
నిషేధిత డ్రగ్ తయారీ ముఠా గుట్టురట్టు
జిన్నారం (పటాన్చెరు): టీఎస్ న్యాబ్, జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. గుమ్మడిదలకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌గౌడ్, అనంతారానికి చెందిన సాయికుమార్‌గౌడ్, వికారాబాద్ జిల్లా పంచలింగాలకు చెందిన క్యాసారం రాకేశ్‌లు నిషేధిత అ్రల్పాజోలం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. నలుగురూ కలిసి కొత్తపల్లి గ్రామ శివారులో ఓ కోళ్ల ఫారాన్ని లీజుకు తీసుకున్నారు. అక్కడ ఓ ప్రత్యేక గదిలో డ్రగ్‌ను తయారు చేసేందుకు రియాక్టర్‌తో సహా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసుకున్నారు. అంజిరెడ్డి బాలానగర్‌లో అ్రల్పాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు తీసుసురాగా రాకేశ్ డ్రగ్‌ను ప్రాసెస్‌ను చేసేవాడు. ఆరు నెలలుగా వీరి డ్రగ్ వ్యాపారం బాగానే నడిచింది.అయితే గ్రామ శివారులో వ్యర్థాల ఘాటు వాసనలు వెలువడటంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో టీఎస్ న్యాబ్, పోలీసులు సంయుక్తంగా డ్రగ్ కేంద్రంపై దాడులు జరిపి, రూ.40 లక్షల విలువైన 2.6 కిలోల అ్రల్పాజోలం, మరో రూ.60 లక్షల విలువైన ముడి పదార్థాలు, యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. రాకేశ్, అంజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సాయికుమార్‌గౌడ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నాడని ఎస్పీ రూపేశ్ తెలిపారు. సమావేశంలో న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ సంతోష్, పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, జిన్నారం సీఐ సు«దీర్ కుమార్, ఎస్ఐలు మహేశ్వర్‌రెడ్డి, విజయారావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి, డ్రగ్స్ పట్టివేత
కర్నూలు: కర్నూలులో భారీగా గంజాయి, నిషేధిత డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. వివరాలను సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, కేవీ మహేష్‌తో కలసి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు మూడో పట్టణ సీఐ తబ్రేజ్, సెబ్ సీఐ రామకృష్ణ తమ సిబ్బందితో నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని అరుంధతి నగర్‌కు వెళ్లే దారిలో పాడుబడిన ఇంటి దగ్గర దాడులు నిర్వహించారు. వారినుంచి రూ.4.25 లక్షలు విలువ చేసే 17 కేజీల గంజాయి, రూ. 27,500 విలువ చేసే 22 మిల్లీ గ్రాముల ఎల్ఎస్డీ స్టాంప్స్(నిషేధిత డ్రగ్)ను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన మహమ్మద్ వసీం, షేక్ షాహిద్ బాషా, జహీర్ అలీఖాన్, షేక్ షాహిద్ బాషా, షేక్ మహమ్మద్ సుహైల్, బి.తాండ్రపాడుకు చెందిన షేక్ ఫిరోజ్ బాషా, చాకలి దస్తగిరి, విష్ణుటౌన్‌షిప్‌కు చెందిన బునెద్రి అగ్నివిుత్ర, గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామానికి చెందిన బీమినేని భరత్‌చంద్ర, గుంటూరు ఫాతిమాపురానికి చెందిన కాటుమాల జోసెఫ్‌ను అరెస్టు చేశారు. కాగా, వీరు గంజాయిని గిద్దలూరు, తుని ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ –1985 కింద కేసు నమోదు చేశారు. -
డ్రగ్స్ కోసం నిల్వ కేంద్రాలు
న్యూఢిల్లీ: సంఘ వ్యతిరేక శక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న కొకెయిన్, హెరాయిన్ తదితర అన్ని రకాల నిషేధిత డ్రగ్స్‌ను ప్రత్యేకంగా భద్రపరిచేందుకు సురక్షిత నిలువ కేంద్రాలను ఆరునెలల్లోగా ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గురువారం సుప్రీంకోర్టు ఆదేశించింది. డ్రగ్స్ మాఫియా మూలాలు చాలా లోతుల్లో ఉన్నాయని, అవి దేశాంతరాలకు విస్తరించాయని, వారి వద్ద డబ్బుతో పాటు పోలీసులు, రాజకీయ నేతల అండదండలు ఉన్నాయని, పెద్ద మొత్తంలో అక్రమ సంపాదనకు మార్గమైన డ్రగ్స్ బిజినెస్‌కు అధికారంలో ఉన్న రాజకీయ వర్గాలు సహకరించడం సాధారణమేనని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోందని పేర్కొంది. ‘2002-2012 మధ్య స్వాధీనం చేసుకున్న నిషేధిత డ్రగ్స్‌లో కేవలం 16% డ్రగ్స్‌నే నాశనం చేసినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలిచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది.