‘‘దర్శకుడు సెల్వరాఘవన్ సార్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా తొమ్మిదేళ్లు పని చేశా. ‘రంగులరాట్నం’ కథ సినిమాటోగ్రాఫర్ మదిగారికి చెప్పా. ఆయన ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్‌గారికి చెప్పమన్నారు. రాజీవన్‌గారు సుప్రియగారికి రిఫర్ చేశారు. కథ విన్న ఆమె నాగార్జునగారికి చెప్పడం, ఆయనకు నచ్చడంతో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చింది’’ అని దర్శకురాలు శ్రీరంజని అన్నారు. రాజ్ తరుణ్, చిత్రా శుక్లా జంటగా ఆమె దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘రంగులరాట్నం’ సంక్రాతికి విడుదలవుతోంది. శ్రీరంజని మాట్లాడుతూ– ‘‘దర్శకురాలిగా నా తొలి చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో లాంచ్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక స్వీట్.. క్యూట్ లవ్ స్టోరీ. తెలుగులో సినిమా అనగానే చాలెంజింగ్ అనిపించింది. సెల్వగారి చాలా సినిమాల షూటింగ్ హైదరాబాద్‌లో చేయడంతో నాకు తెలుగు వచ్చు. అందుకే పెద్దగా భాషతో ఇబ్బంది అనిపించలేదు. హీరో ఎవరన్నది ముందుగా అనుకోలేదు. సుప్రియగారు రాజ్ తరుణ్ గురించి చెప్పినప్పుడు తన సినిమాలు చూశా. పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాం. ఇప్పటివరకు ఎటువంటి ఇమేజ్ లేని అమ్మాయి బావుంటుందని చిత్రని ఫిక్సయ్యాం. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ రాయడం పెద్దగా కష్టం అనిపించలేదు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. అబ్బాయిలకే అమ్మాయిల గురించి ఏమీ తెలీదు. అందుకే నాకు ఈజీ అనిపించింది. నాగార్జునగారు ఇంకా సినిమా చూడలేదు. సంక్రాంతి రోజు పొద్దున్నే ‘అజ్ఞాతవాసి’, మధ్యాహ్నం ‘జై సింహా’, సాయంత్రం ‘రంగులరాట్నం’ సినిమాలు చూస్తా’’ అన్నారు.
మా కుటుంబమంతా నాగార్జునగారి ఫ్యాన్సే – చిత్రా శుక్లా
మా కుటుంబంలో అందరూ నాగార్జునగారి ఫ్యాన్సే. అలాంటిది అన్నపూర్ణ బ్యానర్‌లో చాన్స్ అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. కథ విన్నాక అదృష్టంలా ఫీలయ్యా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాగార్జునగారికి, సుప్రియగారికి, శ్రీ రంజనిగారికి థ్యాంక్స్. చాలా బాధ్యత ఉన్న అమ్మాయిలా ఈ చిత్రంలో కనిపిస్తా. రాజ్‌తరుణ్, నేనూ చాలా టాకెటివ్. మాట్లాడుతూనే ఉంటాం. తను హిందీ బాగా మాట్లాడతాడు. అందుకని నాకు అర్థం అయ్యేలా హిందీలో డైలాగులు చెప్పేవాడు. సహజంగా, పక్కింటి అమ్మాయిలా కనబడే పాత్రలు, చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది’’ అన్నారు.
అమ్మాయిల గురించి అబ్బాయిలకు ఏమీ తెలీదు
Published Wed, Jan 10 2018 12:39 AM | Last Updated on Wed, Jan 10 2018 12:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment