Sriranjani
-
అటక దించుతోంది
అమ్మ, అమ్మమ్మ, పిల్లలు కలిసి ఆడుకోగలిగిన ఆటలు ఏముంటాయి? నాన్న, తాతయ్యలతో కలిసి పిల్లలు ఆడుకోవాలంటే? పెద్దవాళ్లు చురుగ్గా కదలలేరు. పిల్లలేమో రెండు పాదాలను ఒక్క క్షణం కూడా నేల మీద ఆన్చరు. అయినప్పటికీ పెద్దవాళ్లను, పిల్లవాళ్లను కలిపి కూర్చోబెట్టి ఒక ఆట ఆడించేందుకు పాత ఆటలన్నిటినీ తవ్వి తీస్తున్నారు బెంగళూరు యువతి శ్రీరంజని! పిల్లల్లో బోర్డ్ గేమ్స్‌పై ఆసక్తి కలిగించి, ఆడించడానికి, వాటి ద్వారా పెద్దవాళ్లకూ ప్రయోజనం కలిగించడానికి ఎక్కడెక్కడి బోర్డ్ గేమ్‌లను కూడా వెతికి పట్టుకుని వస్తున్నారు శ్రీరంజని. శతాబ్దాల కిందట మనవాళ్లు ఆడుకున్న ఆటలతోపాటు ఖండాంతరాల నుంచి కూడా బోర్డ్ గేమ్‌లను శోధించి, పరిశోధించి తెస్తున్నారామె. మతి మరుపునకు చెక్ ‘‘అష్టాచెమ్మా, పరమపద సోపానపటం, బారాహ్ గట్టా, పులి–మేక, వామనగుంటలు.. పిల్లల్లో మేధాశక్తిని పెంచడం ఒక ప్రయోజనం అయితే పెద్దవాళ్లలో మతిమరుపును కూడా తగ్గిస్తున్నాయి ఈ ఆటలు! ఈ విషయాన్ని సైకాలజిస్టులు చెప్పడమే కాదు, అల్జీమర్స్‌తో బాధపడుతున్న తొంభై ఏళ్ల మహిళ.. తాను ఈ ఆటలు మొదలు పెట్టిన తరవాత మర్చిపోయిన బాల్యస్మృతులన్నీ గుర్తుకు వస్తున్నాయని సంతోషంగా నాతో చెప్పారు. తన చిన్ననాటి స్నేహితుల పేర్లు గుర్తు చేసుకోవడానికి చాలా కష్టపడేదాన్నని, ఇప్పుడు చాలా సంఘటనలు ఇప్పుడే జరిగినట్లు కళ్లముందు మెదలుతున్నాయని తన బాల్యంలోకి వెళ్లిపోయారావిడ. అరవైలలోకి వచ్చిన వాళ్లు వారంలో కనీసం ఒక గంటయినా సరే ఈ ఆటలు ఆడితే మెదడు చురుగ్గా ఉంటుంది. మతిమరుపు బారి నుంచి దూరంగా ఉండవచ్చు కూడా. స్మార్ట్ ఫోన్ యుగంలో మైండ్ అనుక్షణం ఏదో ఒక టాస్క్‌లో నిమగ్నమై ఉంటోంది. ఫోన్ చేతిలోకి తీసుకుని కాల్ లాగ్‌లోకి వెళ్లిన తర్వాత ఎవరికి ఫోన్ చేయాలనుకున్నామో మర్చిపోయే పరిస్థితి నలభై ఏళ్లకే దాపురించింది. ఈ దుస్థితిని విజయవంతంగా దాటేయడానికి కూడా పిల్లలతో కానీ పెద్ద వాళ్లతో కానీ ఓ గంటసేపు నచ్చిన బోర్డ్ గేమ్ ఆడుకోవడమే దివ్యమైన ఔషధం’’ అంటున్నారు శ్రీరంజని. కూర్చొని ఒకచోట ఆడుకునే ఆటలపై ఆమె బెంగళూరులో వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడివే ప్రధాన ఆకర్షణలు బర్త్‌డే పార్టీలతోపాటు ఇతర ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లలో ఇప్పుడు బోర్డ్ గేమ్‌లే ప్రధాన ఆకర్షణ అవుతున్నాయి కూడా. దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఈ ఆటల్లో కొన్నయినా ఉండి ఉంటాయి. అటకెక్కిన ఆటవస్తువులను అటక దించి అక్కున చేర్చుకోవచ్చు. బోర్డ్ గేమ్‌లను పునఃపరిచయం చేయడం కోసం ఏకంగా పరిశోధనే చేస్తున్నారు శ్రీ రంజని. మన పులి–మేకలా..దక్షిణాఫ్రికాలో ఆవు– చిరుత ఆటను, క్రీస్తు పూర్వం అశోక చక్రవర్తి కాలం నాటి నవకంకారి ఆటను కూడా వెలికి తీశారామె. – మను -
అమ్మాయిల గురించి అబ్బాయిలకు ఏమీ తెలీదు
‘‘దర్శకుడు సెల్వరాఘవన్ సార్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా తొమ్మిదేళ్లు పని చేశా. ‘రంగులరాట్నం’ కథ సినిమాటోగ్రాఫర్ మదిగారికి చెప్పా. ఆయన ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్‌గారికి చెప్పమన్నారు. రాజీవన్‌గారు సుప్రియగారికి రిఫర్ చేశారు. కథ విన్న ఆమె నాగార్జునగారికి చెప్పడం, ఆయనకు నచ్చడంతో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చింది’’ అని దర్శకురాలు శ్రీరంజని అన్నారు. రాజ్ తరుణ్, చిత్రా శుక్లా జంటగా ఆమె దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘రంగులరాట్నం’ సంక్రాతికి విడుదలవుతోంది. శ్రీరంజని మాట్లాడుతూ– ‘‘దర్శకురాలిగా నా తొలి చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో లాంచ్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక స్వీట్.. క్యూట్ లవ్ స్టోరీ. తెలుగులో సినిమా అనగానే చాలెంజింగ్ అనిపించింది. సెల్వగారి చాలా సినిమాల షూటింగ్ హైదరాబాద్‌లో చేయడంతో నాకు తెలుగు వచ్చు. అందుకే పెద్దగా భాషతో ఇబ్బంది అనిపించలేదు. హీరో ఎవరన్నది ముందుగా అనుకోలేదు. సుప్రియగారు రాజ్ తరుణ్ గురించి చెప్పినప్పుడు తన సినిమాలు చూశా. పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాం. ఇప్పటివరకు ఎటువంటి ఇమేజ్ లేని అమ్మాయి బావుంటుందని చిత్రని ఫిక్సయ్యాం. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ రాయడం పెద్దగా కష్టం అనిపించలేదు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. అబ్బాయిలకే అమ్మాయిల గురించి ఏమీ తెలీదు. అందుకే నాకు ఈజీ అనిపించింది. నాగార్జునగారు ఇంకా సినిమా చూడలేదు. సంక్రాంతి రోజు పొద్దున్నే ‘అజ్ఞాతవాసి’, మధ్యాహ్నం ‘జై సింహా’, సాయంత్రం ‘రంగులరాట్నం’ సినిమాలు చూస్తా’’ అన్నారు. మా కుటుంబమంతా నాగార్జునగారి ఫ్యాన్సే – చిత్రా శుక్లా మా కుటుంబంలో అందరూ నాగార్జునగారి ఫ్యాన్సే. అలాంటిది అన్నపూర్ణ బ్యానర్లో చాన్స్ అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. కథ విన్నాక అదృష్టంలా ఫీలయ్యా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాగార్జునగారికి, సుప్రియగారికి, శ్రీ రంజనిగారికి థ్యాంక్స్. చాలా బాధ్యత ఉన్న అమ్మాయిలా ఈ చిత్రంలో కనిపిస్తా. రాజ్‌తరుణ్, నేనూ చాలా టాకెటివ్. మాట్లాడుతూనే ఉంటాం. తను హిందీ బాగా మాట్లాడతాడు. అందుకని నాకు అర్థం అయ్యేలా హిందీలో డైలాగులు చెప్పేవాడు. సహజంగా, పక్కింటి అమ్మాయిలా కనబడే పాత్రలు, చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది’’ అన్నారు. -
మాస్ ఎంటర్టెయినర్గా వీరశివాజీ
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్ చిత్రంగా వీరశివాజీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు గణేష్ వినాయక్ పేర్కొన్నారు. ఈయన కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయనకు జంటగా నటి షామిలి హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో జాన్‌విజయ్, రోబోశంకర్, యోగిబాబు, నాన్‌కడవుల్ రాజేంద్రన్, మనీషాశ్రీ, వినోదిని, శ్రీరంజని,దర్శకుడు మారిముత్తు, సాధన్య, కుట్టి నటిస్తున్నారు. ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఎస్.నందగోపాల్ తమ మెడ్రాస్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం వీరశివాజి. .చిత్ర వివరాలను దర్శకుడు గణేష్ వినాయక్ తెలుపుతూ ఇది యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో విక్రమ్‌ప్రభు కాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారని చెప్పారు. ఇది పాండిచ్చేరి నుంచి కన్యాకుమారి వరకు సాగే పయనంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన కథా చిత్రం అని తెలిపారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పాండిచ్చేరిలో నిర్వహించినట్లు వెల్లడించారు. పాటల చిత్రీకరణ వినహా చిత్రం పూర్తి అయ్యిందని దర్శకుడు చెప్పారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని, సుకుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు.