మాస్ ఎంటర్‌టెయినర్‌గా వీరశివాజీ | Mass Entertainer veerasivaji | Sakshi
Sakshi News home page

మాస్ ఎంటర్‌టెయినర్‌గా వీరశివాజీ

Published Thu, Feb 4 2016 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

మాస్ ఎంటర్‌టెయినర్‌గా వీరశివాజీ

మాస్ ఎంటర్‌టెయినర్‌గా వీరశివాజీ

కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ చిత్రంగా వీరశివాజీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు గణేష్ వినాయక్ పేర్కొన్నారు. ఈయన కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయనకు జంటగా నటి షామిలి హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో జాన్‌విజయ్, రోబోశంకర్, యోగిబాబు, నాన్‌కడవుల్ రాజేంద్రన్, మనీషాశ్రీ, వినోదిని, శ్రీరంజని,దర్శకుడు మారిముత్తు, సాధన్య, కుట్టి నటిస్తున్నారు. ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఎస్.నందగోపాల్ తమ మెడ్రాస్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం వీరశివాజి.

.చిత్ర వివరాలను దర్శకుడు గణేష్ వినాయక్ తెలుపుతూ ఇది యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో విక్రమ్‌ప్రభు కాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారని చెప్పారు. ఇది పాండిచ్చేరి నుంచి కన్యాకుమారి వరకు సాగే పయనంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన కథా చిత్రం అని తెలిపారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పాండిచ్చేరిలో నిర్వహించినట్లు వెల్లడించారు. పాటల చిత్రీకరణ వినహా చిత్రం పూర్తి అయ్యిందని దర్శకుడు చెప్పారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని, సుకుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement