Romeo and Juliet
-
రోమియో.. జూలియట్
ఇటలీ దేశంలోని వెరోనా నగరం కాపులేట్స్, మాంటెక్ అనే రెండు సంపన్న కుటుంబాల మధ్య వైరంతో అల్లకల్లోలం అవుతుంటుంది. ఈ నేపథ్యంలో వెరోనా పట్టణపు యువరాజు రెండు కుటుంబాలను హెచ్చరించి వారి మధ్య గొడవలు జరగకుండా ఆపుతాడు. యువరాజు ఆజ్ఞతో ఇరుకుటుంబాలు గొడవలు పడకుండా మిన్నకుండిపోతాయి. మాంటెక్ వంశానికి చెందిన రోమియో.. రోసాలిన్ అనే అమ్మాయిని ప్రేమించి ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. రోసాలిన్కు ప్రేమ అంటే గిట్టదు! అందుకే రోమియోను దూరంగా పెడుతుంది. రోమియో మాత్రం ఆమె ప్రేమను పొందటం కోసం పరితపిస్తుంటాడు. ప్రతినిత్యం సోదరుడి వరుసైన బెన్ వోలియోను, ముసలివాడైన మోర్కుషియోలను వెంటబెట్టుకుని ఆమె వెనకాలే తిరుగుతుంటాడు. ఓ రోజు రొసాలిన్.. స్నేహితురాలి విందుకు వెళ్లిందని తెలుసుకున్న రోమియో మారువేషంలో అక్కడకు వెళతాడు. ఆ విందులో మొట్టమొదటిసారి కపులేట్స్ వంశానికి చెందిన జూలియట్‌ను చూస్తాడు. తొలిచూపులోనే జూలియట్ అందానికి దాసోహం అంటాడు. రొసాలిన్‌ను మరిచిపోయి జూలియట్ ప్రేమలో మునిగితేలుతుంటాడు. ఆ విందు ఆఖరి దశలో ఉండగా రోమియో జూలియట్‌కు తన ప్రేమ విషయం చెబుతాడు. జూలియట్ కూడా రోమియోను చూడగానే ప్రేమలో పడిపోతుంది. మొదట కొంచెం బెట్టుచేసినా తర్వాత అతని ప్రేమను అంగీకరిస్తుంది. ఆ తర్వాత రోమియో జూలియట్‌లకు తమ కుటుంబాల మధ్య ఉన్న వైరం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జూలియట్‌ను పారిస్ అనే యువకుడికిచ్చి వివాహం చేయటానికి నిశ్చయం జరుగుతుంది. జూలియట్ నిస్సహాయ పరిస్థితిలో పడుతుంది. అదే రోజు రాత్రి రోమియో, జూలియట్లు కలుసుకుంటారు. తమ ఈ సమస్యకు పెళ్లే పరిష్కారంగా భావించి ఫ్రాయర్ లారెన్స్ అనే ఒక మత బోధకుడి సహాయంతో భార్యాభర్తలవుతారు. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. రెండు కుటుంబాలను ఐక్యం చేయాలనే ఉద్ధేశ్యంతోనే లారెన్స్ ఈ పెళ్లి జరిపిస్తాడు. అందుకే రోమియో జూలియట్ల పెళ్లి సంగతిని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచుతాడు. ఈ తర్వాత చోటుచేసుకునే కొన్ని సంఘటనల కారణంగా రోమియో! జూలియట్‌కు అన్న వరుసయ్యే టైబల్డ్ అనే వ్యక్తిని చంపేస్తాడు. రోమియో చేసిన పనిని తప్పుబట్టిన జనం అతడ్ని మహారాజు దగ్గరకు తీసుకువెళతారు. అతడికి ఉరిశిక్ష విధించాలని మహారాజుకు విన్నవిస్తారు. దీంతో రోమియో అక్కడినుంచి తప్పించుకుని పారిపోతాడు. రోమియో.. టైబల్డ్ను చంపిన విషయం జూలియట్‌కు తెలుస్తుంది. అయినప్పటికి ఆమె అతన్ని తప్పుబట్టక అతడి కోసం వెతికిస్తుంది. రోమియో మాత్రం ఎవరికంటా పడకూడదని అన్ని నగరాలు తిరుగుతుంటాడు. ప్రియురాలిని కలుసుకోలేని పరిస్థితిలో రోమియో మనోవేదనకు గురవుతాడు. చివరకు అతడు లారెన్స్ ఊరైన ‘‘మంటువ’’కు చేరుకుంటాడు. మరో వైపు జూలియట్‌కు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతారు ఆమె కుటుంబసభ్యులు. దీంతో జూలియట్ సమస్య పరిష్కారం కోసం లారెన్స్‌ను ఆశ్రయిస్తుంది. అతడు ఓ ఉపాయం చెబుతాడు.. ఓ రసాయనం ద్వారా ఆమెను 48 గంటలు శవంలా పడుండేలా చేస్తానని, ఇటాలియన్ సంప్రదాయం ప్రకారం 48 గంటలు శవాన్ని ఖననం చేయరు కాబట్టి.. 48 గంటల తర్వాత జూలియట్ మామూలు మనిషిగా మారినపుడు ఆమెను అక్కడినుంచి తప్పించి రోమియో దగ్గరకు చేరుస్తానని చెబుతాడు. ఇందుకు ఆమె ఒప్పుకుంటుంది. ఆ తర్వాత లారెన్స్ ఇచ్చిన రసాయనాన్ని తాగి నిస్తేజంగా మారిపోతుంది. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు ఆమె మరణించిందని భావించి శవాన్ని భద్రపరిచేందుకు సమాధి గృహానికి తీసుకెళతారు. లారెన్స్ .. రోమియోకు ప్రయోగం గురించి, చేయవలసిన పని గురించి లేఖ రాస్తాడు. అయితే అదేసమయంలో అక్కడ ప్లేగు వ్యాధి ప్రభలడంతో లేఖ రోమియోకు అందదు. కానీ, జూలియట్ చనిపోయిందన్న వార్త అతడికి తెలుస్తుంది. దీంతో అతడు గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ప్రేయసిలేని జీవితాన్ని ఊహించుకోలేక విషం తాగుతాడు. చివరిసారి జూలియట్‌ను చూడాలని నగర శివార్లలోకి వస్తాడు. అప్పుడు కపులేట్స్ వర్గంవారు అతడ్ని చుట్టుమడతారు. రోమియో వారిని ఎదురించి శవపేటిక దగ్గరకు వస్తాడు. అదే సమయంలో జూలియట్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న పారిస్ కూడా అక్కడకు వస్తాడు. లోపలికి ఎవ్వరినీ రానివ్వొద్దని ఆదేశాలు జారీచేస్తాడు. అయితే రోమియో అందరితో తలబడి ప్రేయసి శవాన్ని తాకబోతాడు. పారిస్ అడ్డుకోవటంతో ఆగ్రహించిన రోమియో అతన్ని చంపేస్తాడు. తర్వాత శవపేటికలో ఉన్న జూలియట్ శరీరాన్ని గుండెలకు హత్తుకుని, విలపిస్తూ ఆఖరిసారి ఆమెను ముద్దుపెట్టుకుని తుదిశ్వాస విడుస్తాడు. అప్పుడే జూలియట్ కళ్లు తెరుస్తుంది. ఆమెకు అక్కడి పరిస్థితి మొత్తం అర్థం అవుతుంది. జూలియట్‌ను బంధించటానికి సైనికులు ఆమెను సమీపిస్తుంటారు. జూలియట్.. రోమియో శరీరంపై పడి విలపిస్తూ అతని వద్ద ఉన్న కత్తిని గుండెల్లో పొడుచుకుని ప్రాణం తీసుకుంటుంది. -
మాస్ ఎంటర్టెయినర్గా వీరశివాజీ
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్ చిత్రంగా వీరశివాజీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు గణేష్ వినాయక్ పేర్కొన్నారు. ఈయన కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయనకు జంటగా నటి షామిలి హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో జాన్‌విజయ్, రోబోశంకర్, యోగిబాబు, నాన్‌కడవుల్ రాజేంద్రన్, మనీషాశ్రీ, వినోదిని, శ్రీరంజని,దర్శకుడు మారిముత్తు, సాధన్య, కుట్టి నటిస్తున్నారు. ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఎస్.నందగోపాల్ తమ మెడ్రాస్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం వీరశివాజి. .చిత్ర వివరాలను దర్శకుడు గణేష్ వినాయక్ తెలుపుతూ ఇది యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో విక్రమ్‌ప్రభు కాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారని చెప్పారు. ఇది పాండిచ్చేరి నుంచి కన్యాకుమారి వరకు సాగే పయనంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన కథా చిత్రం అని తెలిపారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పాండిచ్చేరిలో నిర్వహించినట్లు వెల్లడించారు. పాటల చిత్రీకరణ వినహా చిత్రం పూర్తి అయ్యిందని దర్శకుడు చెప్పారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని, సుకుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు. -
ఆ పాట దుమ్మురేపుతుంది
రోమియో జూలియట్ చిత్రంలో ఆ పాట దుమ్ము రేపుతుందంటున్నారు దర్శకుడు లక్ష్మణన్. జయం రవి, హన్సిక నటిస్తున్న తాజా చిత్రం రోమియో జూలియట్. మెడ్రాస్ ఎంటర్ ప్రైజస్ పతాకంపై నిర్మాత ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ఇది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు లక్ష్మణన్ తెలుపుతూ రోమియో జూలియట్ జాలీగా సాగే రొమాంటిక్ ఎంటర్ టెయినర్గా పేర్కొన్నారు. చిత్రం చూపే ప్రేక్షకులు ఆహా అంటూ ఆద్యంతం ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నారు. చిత్రం కోసం స్థానిక పురసైవాక్కంలో కోటి రూపాయల ఖర్చుతో ఒక బ్రహ్మాండమయిన బంగ్లా సెట్‌ను కళా దర్శకుడు విలన్ పర్యవేక్షణలో రూపొందించినట్లు చెప్పారు. ఈ సెట్లో చిత్రంలోని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సెట్లో జయం రవి, హన్సికలతో దుమ్మురేపే మాస్ గీతాన్ని షూట్ చేయనున్నట్లు తెలిపారు. మరో విషయం ఏమిటంటే పూనం బాజ్వా మరో హీరోయిన్గా నటిస్తున్నట్లు వెల్లడించారు. కొంచెం గ్యాప్ తరువాత ఆమె నటిస్తున్న తమిళ చిత్రం ఇదేనన్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని, ఎస్.సౌందరరాజన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ఎస్.నందగోపాల్ తెలిపారు. -
రాముడి, కృష్టుడికి 'రామ్ లీలా'కు సంబంధం లేదు: భన్సాలీ
రామ్ లీలా చిత్ర టైటిల్ భారతీయ పురాణం రామ్ లీలాతోకాని, కృష్ణ భగవానుడి 'రాస్ లీలా'తో ఎలాంటి సంబంధం లేదని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. రామ్ లీలా చిత్రం విలియమ్ షేక్ స్పియర్ 'రోమియో అండ్ జూలియట్' నవల స్పూర్తితో రూపొందించాను అని తెలిపారు. రాముడికి సంబంధించిగాని, కృష్ట భగవానుడికి కథకు సంబంధించిన చిత్ర కాదని, భారత పురాణాలతో ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు అని భన్సాలీ అన్నారు. అశ్లీలంగా, హింసాత్మకంగా, మితీమీరిన శృంగారంతో రామ్ లీలా చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. కావున 15 నవంబర్ తేదిన విడుదలను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాముడికి సంబంధించిన కథ అని ప్రేక్షకులు రామ్ లీలా చిత్రం చూసే అవకాశం ఉంది అని.. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రమాధం ఉంది అని ఢిల్లీ కోర్టులో ఆరుగురు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరి మనోభావాల్ని దెబ్బ తీసేలా లేవు.. ఎవర్ని అవమానించే రీతిలో కూడా లేవు. మత విశ్వాసాలకు భంగం వాటిల్లదు అని సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు.