ఆ పాట దుమ్మురేపుతుంది | Extravagant set for 'Romeo and Juliet'!! | Sakshi
Sakshi News home page

ఆ పాట దుమ్మురేపుతుంది

Published Mon, Jun 2 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

ఆ పాట దుమ్మురేపుతుంది

ఆ పాట దుమ్మురేపుతుంది

రోమియో జూలియట్ చిత్రంలో ఆ పాట దుమ్ము రేపుతుందంటున్నారు దర్శకుడు లక్ష్మణన్. జయం రవి, హన్సిక నటిస్తున్న తాజా చిత్రం రోమియో జూలియట్. మెడ్రాస్ ఎంటర్ ప్రైజస్ పతాకంపై నిర్మాత ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ఇది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు లక్ష్మణన్ తెలుపుతూ రోమియో జూలియట్ జాలీగా సాగే రొమాంటిక్ ఎంటర్ టెయినర్‌గా పేర్కొన్నారు. చిత్రం చూపే ప్రేక్షకులు ఆహా అంటూ ఆద్యంతం ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నారు.
 
 చిత్రం కోసం స్థానిక పురసైవాక్కంలో కోటి రూపాయల ఖర్చుతో ఒక బ్రహ్మాండమయిన బంగ్లా సెట్‌ను కళా దర్శకుడు విలన్ పర్యవేక్షణలో రూపొందించినట్లు చెప్పారు. ఈ సెట్‌లో చిత్రంలోని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సెట్‌లో జయం రవి, హన్సికలతో దుమ్మురేపే మాస్ గీతాన్ని షూట్ చేయనున్నట్లు తెలిపారు. మరో విషయం ఏమిటంటే పూనం బాజ్వా మరో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు. కొంచెం గ్యాప్ తరువాత ఆమె నటిస్తున్న తమిళ చిత్రం ఇదేనన్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని, ఎస్.సౌందరరాజన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ఎస్.నందగోపాల్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement